back to top
Home Blog

సరికొత్త శీర్షిక ప్రారంభం – అమెరికా జనహృదయ సంగీతం – కంట్రీ మ్యూజిక్

0

[సంచిక వారపత్రికలో త్వరలో ‘అమెరికా జనహృదయ సంగీతం – కంట్రీ మ్యూజిక్’ అనే ఫీచర్‍ ప్రారంభమవుతోందని తెలిపే ప్రకటన.]

[dropcap]కం[/dropcap]ట్రీ మ్యూజిక్ అంటే జానపద సంగీతం!!

ప్రపంచం నలుమూలలనుంచీ బలవంతాన అమెరికా చేరిన నిస్సహాయుల అవేదనా సంగీతం!!

అన్యాయాల బరువు క్రింద నలిగిన బలహీనుల హృదయ వేదనా నాదం – కంట్రీ మ్యూజిక్!!!

తాము కోల్పోయిన సంస్కృతి సాంప్రదాయాలను తలచుకుంటూ,  తమ నూతన జీవన విధానాన్ని స్వీకరిస్తూన్న మనస్సుల ఆక్రోశ ధ్వనిని తమ వాయిద్యాలతో వినిపించే సంగీతం – కంట్రీ మ్యూజిక్!!!

ప్రపంచంలో ఏ మూల వున్నా మానవుల ఆనంద విషాదాలు, ఆవేశాలూ, ఆవేదనల స్వరూపాలొకటే నని నిరూపించే సార్వజనీన సంగీతం కంట్రీ మ్యూజిక్!!!

అలాంటి కంట్రీ మ్యూజిక్‌నూ, కంట్రీ సింగర్స్‌నూ పరిచయంచేసే వినూత్నము, విభిన్నమూ, విశిష్టమూ అయిన నూతన శీర్షిక .. సంచికలో.. త్వరలో!!!!

అమెరికా జనహృదయ సంగీతం- కంట్రీ మ్యూజిక్!

త్వరలో!!! సంచికలో!!!

పుస్తక ప్రదర్శన ప్రత్యేకం- మీరు కొన్న/కొనాలనుకుంటున్న పుస్తకం

1

[dropcap]హై[/dropcap]దరాబాదులో 19/12/2024  నుండి 29/12/2024 వరకూ జరిగే పుస్తక ప్రదర్శన సందర్భంగా సంచిక పాఠకులకు ఒక విజ్ఞప్తి.

తెలుగులో పుస్తక ప్రచురణ జోరుగా సాగుతోంది.

పుస్తకాల అమ్మకాలు నిరాశాజనకంగా ఉన్నా, పుస్తక ప్రచురణలో రచయితల ఉత్సాహం ఏమాత్రం తగ్గటం లేదు. ఇది అభినందనీయమైన విషయం.

అయితే, తెలుగు సాహిత్య ప్రపంచంలో ఒక మంచి పుస్తకం ఉందన్న విషయం తెలిస్తే పాఠకులు తప్పకుండా కొంటారన్న విశ్వాసం సంచికకు ఉంది. 

కానీ, ఒక మంచి పుస్తకం ఉన్నదన్న విషయం పాఠకులకు తెలియచెప్పే వ్యవస్థ తెలుగు సాహిత్య ప్రపంచంలో లేదు.

అందువల్ల, ముఠాలుగా ఏర్పడ్డవాళ్ళు, గుంపులను కూర్చుకున్నవాళ్ళూ సాధారణ పుస్తకాన్ని కూడా పదే పదే ప్రస్తావిస్తూ గొప్ప పుస్తకంలా పాఠకులను నమ్మిస్తున్నారు. తీరా పుస్తకం కొన్న పాఠకులు నిరాశ చెంది మరోసారి తెలుగు పుస్తకం జోలికి రాకూడదనుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

పదిమందికీ చెప్పేవాళ్ళు లేక  మంచి పుస్తకం మరుగున పడుతున్నది. గుంపుల్లో చేరక, గుంపులను ఏర్పాటుచేసుకోలేని రచయిత నిరాశకు గురవుతున్నాడు.

అందుకే, సంచిక పుస్తక ప్రేమికులకు , పుస్తక ప్రదర్శన సందర్భంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నది.

మంచి పుస్తకం గురించి ఎవరో చెప్పాలని ఎదురు చూడటం ఎందుకు.. మీరే చెప్పండి.

గతంలో మీరు కొని చదివి మీకు నచ్చిన పుస్తకాలు, పదిమందీ చదివితే బాగుంటుందనిపించిన పుస్తకం పేరు, రచయిత పేరు, వెల, ప్రచురణ సంస్థ పేరుతో పాటూ  మీ  ఫోటోను, మీ  పరిచయంతో సంచికకు పంపండి. మీ పేరుతో మీరు రికమండ్ చేసిన పుస్తకాలను ప్రచురించటం ద్వారా పుస్తక ప్రదర్శనలో ఏయే పుస్తకాలు కొనాలో ఒక అవగాహన కలిగించాలన్నది సంచిక ఉద్దేశం. 

ఈ పుస్తక ప్రదర్శనలోనూ కొన్న పుస్తకాలతో మీ ఫోటోను పంపించండి.

ఫోటోలో మీరెంత స్పష్టంగా కనిపిస్తారో పుసకాలూ అంతే స్పష్టంగా కనబడాలి.  పుస్తకం పేరు, రచయిత పేరు, వెల, ప్రచురణ సంస్థ పేరు కూడా రాసి పంపితే సంతోషం..

మంచి మైకులో చెప్పమన్నారు.. మంచి పుస్తకం గురించి సంచికలో చెప్పమంటున్నాము..

పుస్తకాల వివరాలు పంపవలసినది,

వాట్సప్ నెంబరు:

9849617392

ఈమెయిల్:

kmkp2025@gmail.com

మీ అభిప్రాయాలు/స్పందనలు పంపగలరు.

2025 ఉగాది – వచన కవితల పోటీ – ప్రకటన

0

[dropcap]శ్రీ[/dropcap] విశ్వావసు నామ సంవత్సర ‘ఉగాది’ (2025) పర్వదినం సందర్భంగా సంచిక- సాహితీ ప్రచురణలు సంయుక్తంగా వచన కవితల పోటీని నిర్వహిస్తున్నారు.

సంచిక- సాహితీ ప్రచురణల తరఫున వచన కవిత పోటీని నిర్వహిస్తున్నారు కవి శ్రీ ఆచార్య ఫణీంద్ర.

వచన కవిత పోటీ నిబంధనలు:

  • రచనలో అక్షరదోషాలు లేకుండా సరిచూసుకొని, టైపు చేయించిన (లేదా) స్పష్టమైన వ్రాతప్రతి యొక్క పిడియఫ్ ప్రతిని మాత్రమే పంపించాలి.
  • ఒకరు ఎన్ని కవితలనైనా పంపించవచ్చు. అలాగని ఒకేసారి ఒక పుస్తకానికి సరిపడ కవితలను పంపకూడదు.
  • ఒకసారి ప్రతిని పంపించిన తర్వాత మార్పులు, చేర్పులు, సవరణలు అంగీకరింపబడవు.
  • వీలయినంతవరకూ కవితలో రాజకీయాలు, విద్వేష భావనలు ఉండకూడదు. కవిత ప్రధానంగా రసమయమయి వుండాలి. అనుభూతి ప్రధానమై వుండాలి.
  • ఇంతకుముందు ఎక్కడా ప్రచురితం కాని రచనలను మాత్రమే పోటీకి పంపాలి.
  • ఇప్పటికే ఎక్కడైనా పరిశీలనలో ఉన్న రచనలు పోటీకి అనర్హం.
  • పై అంశాలను ధృవీకరిస్తూ హామీపత్రం తప్పనిసరిగా జతపరచాలి.
  • రచనకు ఏ కలం పేరు వాడినా కవి అసలు పేరు తప్పనిసరిగా హామీ పత్రంలో రాయాలి.
  • కావ్యం అనువాదం, అనుకరణ, అనుసరణ కాదని హామీపత్రంలో స్పష్టం చేయాలి.
  • ఏ రాష్ట్రమైనా, ఏ దేశంలో ఉన్న తెలుగు వారైనా కావ్యాలు పంపవచ్చు.
  • పోటీలో బహుమతి పొందిన ఏ కవితనైనా, ఫలితాలు వెలువడిన తరువాత వెనక్కి తీసుకునే అవకాశం లేదని గమనించగలరు.
  • బహుమతుల విషయంలో న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు.
  • కవితలపై కవి పేరు ఉండరాదు. విడిగా హామీపత్రంపై మాత్రమే పేరు, ఫోన్‌ నంబరు, ఈ-మెయిల్‌ ఐడీ రాయాలి.
  • కవితలు పంపవలసిన చివరి తేదీ 31/1/2025.

పంపాల్సిన విధానం:

మెయిల్ ద్వారా పంపాల్సిన చిరునామా – sanchikavachanakavitapotee2025@gmail.com

మెయిల్ సబ్జెక్ట్ లైనులో సంచిక – సాహితీ ప్రచురణలు 2025 ఉగాది వచన కవితల పోటీకి అని వ్రాయాలి.

వాట్సప్ ద్వారా అయితే – 9849617392. సంచిక – సాహితీ ప్రచురణలు 2025 ఉగాది వచన కవితల పోటీకి అని వ్రాయాలి.

By Post (పోస్ట్ ద్వారా అయితే):

(గమనిక: పోస్ట్ ద్వారా పంపేవారు విధిగా ఒక కాపీ తమ దగ్గర వుంచుకోవాలి).

Sachika Web Magazine
Plot no 32, H.No 8-48
Raghuram Nagar Colony.
Aditya Hospital lane
Dammaiguda, Hyderabad-500083

అనే చిరునామాకి పంపాలి. పోస్టల్ కవర్ మీద తప్పనిసరిగా సాహితీ ప్రచురణలు 2025 ఉగాది వచన కవితల పోటీకి అని వ్రాయాలి.

***

బహుమతి సొమ్ము ప్రకటన తరువాత వెలువడుతుంది.

ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు – శ్రీ అపురూప వేంకటేశ్వర స్వామి దేవాలయం, మామిడిపల్లి, నిజామాబాదులో ‘ఉగాది – 2025’ పర్వదినం సందర్భంగా జరిగే ‘ కవి సమ్మేళనం’లో ‘బహుమతి’ ప్రదానం జరుగుతుంది.

2025 ఉగాది – పద్య కావ్య రచన పోటీ – ప్రకటన

0

[dropcap]‘ప[/dropcap]ద్యరచన’ తెలుగు భాష నుదుటిపై ‘తిలకం’ అయితే- ‘వచన కవిత్వం’ తెలుగు భాషామతల్లికి కంఠాభరణం వంటిది.

ప్రపంచంలో ప్రతి భాషకూ తనదైన ఒక ప్రత్యేక వ్యాకరణం, భావవ్యక్తీకరణ, ప్రక్రియలు వుంటాయి.

పార్సీ భాషకు రుబాయీ,

ఉర్దూ భాషకు ఘజల్,

ఇంగ్లీషు భాషకు సానెట్,

జపానీయులకు హైకూలు ప్రత్యేకమైనవి. అయితే –

తెలుగు భాషకు ‘పద్యం’ ప్రత్యేకమైనది. తెలుగు భాషలో తప్పించి మరే ఇతర భాషలోనూ ఛందోబద్ధమైన పద్యాన్ని ఇప్పటికీ సజీవంగా, ఇంత విస్తృతంగా రాస్తున్నవారు లేరు. 

ఈనాటి తెలుగు కవుల్లో చాలా మంది పర భాషలకు చెందిన ప్రత్యేక ప్రక్రియలకు ఇస్తోన్న ప్రాధాన్యం , వాటి రచనలో ఒరదర్శిస్తున్న  ఉత్సాహం మనదయిన  పద్య రచనకు ఇవ్వకపోవడం చింతించదగిన విషయం!

ఛందస్సును సర్పపరిష్వంగంగానో, భావవ్యక్తీకరణకు ప్రతిబంధకంగానో భావిస్తున్నంతకాలం పద్యానికి ప్రాధాన్యత లభించదు.

అందుకే – తెలుగు పద్యానికి కొంతైనా పూర్వ వైభవం కల్పించాలన్న సదుద్దేశంతో.. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ‘ఉగాది’ (2025) పర్వదినం సందర్భంగా సంచిక-డాక్టర్ అమృతలత సంయుక్తంగా పద్య కావ్య రచన పోటీ నిర్వహిస్తున్నారు.

ఈ పోటీని సంచిక- డాక్టర్ అమృతలతల తరఫున నిర్వహిస్తారు మాన్యులు, పండితులు శ్రీ ఏల్చూరి మురళీధర రావుగారు.

పద్య కావ్య పోటీ నిబంధనలు:

  • కావ్యం స్వేచ్ఛావస్తువుతో సలక్షణమైన భాషలో 350 పద్యాలకు మించకుండా రచించినదై ఉండాలి.
  • ముద్రిత రచనలను, అనువాదాలను, శతకాలను, స్తోత్రాదులను, ఖండకావ్య సంపుటులను పంపించవద్దు.
  • రచనలో అక్షరదోషాలు లేకుండా సరిచూసుకొని, టైపు చేయించిన (లేదా) స్పష్టమైన వ్రాతప్రతి యొక్క పిడియఫ్ ప్రతిని మాత్రమే పంపించాలి.
  • ఒకరు ఒక్క రచనను మాత్రమే పంపించాలి. ఒకసారి ప్రతిని పంపించిన తర్వాత మార్పులు, చేర్పులు, సవరణలు అంగీకరింపబడవు.
  • రచన పిడియఫ్ ప్రతి మొదట అది మీ స్వీయకృతి అన్న హామీ పత్రాన్ని, మీ చిరునామా, ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడి స్పష్టంగా పేర్కొనాలి.
  • రచనకు ఏ కలం పేరు వాడినా కవి అసలు పేరు తప్పనిసరిగా హామీ పత్రంలో రాయాలి.
  • ఏ రాష్ట్రమైనా, ఏ దేశంలో ఉన్న తెలుగు వారైనా కావ్యాలు పంపవచ్చు.
  • బహుమతుల విషయంలో న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు.
  • కావ్యం ప్రతులపై కవి పేరు ఉండరాదు. విడిగా హామీపత్రంపై మాత్రమే పేరు, ఫోన్‌ నంబరు, ఈ-మెయిల్‌ ఐడీ రాయాలి.
  • కావ్యాలు పంపవలసిన చివరి తేదీ 31/1/2025.

పంపాల్సిన విధానం:

మెయిల్ ద్వారా పంపాల్సిన చిరునామా – sanchikapadyakaavyapotee2025@gmail.com

మెయిల్ సబ్జెక్ట్ లైనులో సంచిక-డాక్టర్ అమృతలత పద్య కావ్య రచన 2025 పోటీకి అని వ్రాయాలి.

వాట్సప్ ద్వారా అయితే – 9849617392. సంచిక-డాక్టర్ అమృతలత పద్య కావ్య రచన 2025 పోటీకి అని వ్రాయాలి.

By Post (పోస్ట్ ద్వారా అయితే):

(గమనిక: పోస్ట్ ద్వారా పంపేవారు విధిగా ఒక కాపీ తమ దగ్గర వుంచుకోవాలి).

Sachika Web Magazine
Plot no 32, H.No 8-48
Raghuram Nagar Colony.
Aditya Hospital lane
Dammaiguda, Hyderabad-500083

అనే చిరునామాకి పంపాలి. పోస్టల్ కవర్ మీద తప్పనిసరిగా సంచిక-డాక్టర్ అమృతలత పద్య కావ్య రచన 2025 పోటీకి అని వ్రాయాలి.

బహుమతి సొమ్ము ప్రకటన తరువాత వెలువడుతుంది.

ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు – శ్రీ అపురూప వేంకటేశ్వర స్వామి దేవాలయం, మామిడిపల్లి, నిజామాబాదులో ఉగాది – 2025’ పర్వదినం సందర్భంగా జరిగే కవి సమ్మేళనంలో బహుమతిప్రదానం జరుగుతుంది.

మరుగునపడ్డ మాణిక్యాలు – 107: అమెరికన్ ఫిక్షన్

0

[సంచిక పాఠకుల కోసం ‘అమెరికన్ ఫిక్షన్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

[dropcap]ర[/dropcap]చయితలు మార్కెట్ డిమాండ్లకి తలవంచాలా? అక్కర్లేదని అందరూ అంటారు. కానీ పుస్తకాలు అమ్ముడవకపోతే ఏం చేయాలి? డబ్బుకి కటకటగా ఉంటే ఏం చేయాలి? డబ్బుకి లోటు లేనివారు కళాసేవ చేయొచ్చు. డబ్బు లేనివారు తమ అవసరాల కోసం రాజీ పడకతప్పని పరిస్థితులు వస్తాయి. ఇది కృష్ణదేవరాయల కాలం కాదు కదా ఉత్తమ కళాకారులని కూర్చోబెట్టి పోషించటానికి! ప్రస్తుతకాలంలో రచయితల పరిస్థితులపై వచ్చిన వ్యంగ్య చిత్రం ‘అమెరికన్ ఫిక్షన్’ (2023). ఇందులో అమెరికాలో పుస్తకాలకి మార్కెట్ ఎలా ఉందో ప్రస్తావించారు. అక్కడ కొన్ని కథలకి డిమాండు ఉంది. మిగతా ప్రపంచంలో డిమాండున్న కథలు, రచయితలు వేరుగా ఉండొచ్చు. కానీ ప్రపంచంలో ఎక్కడైనా రచయితలకి ఈ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. డిమాండు నిజంగా ఉందా లేక కొందరు మేధావులు సృష్టించారా అనేది మరో అంశం. ఇది వ్యంగ్య చిత్రం కాబట్టి హాస్యం పాళ్ళు ఎక్కువ. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం.

థెలోనియస్ ఎలిసన్ అమెరికాలోని లాస్ ఏంజిలిస్‌లో ఉండే ఒక రచయిత. అతన్ని అందరూ మంక్ అని పిలుస్తారు. అవివాహితుడు. నవలలు రాశాడు. ప్రొఫెసర్‌గా పని చేస్తుంటాడు. నల్లజాతికి చెందినవాడే కానీ అతను అన్ని రకాల పాత్రలను సృష్టించాడు. ఈ జాతి, ఆ జాతి అనే తారతమ్యం లేదు. అమెరికాలో ప్రస్తుత పరిస్థితి జాతివివక్ష చూపించేవారిని తప్పుబట్టటం అనే స్టేజిని దాటి నల్లజాతి వారిని అక్కున చేర్చుకోకపోతే తప్పు అన్నట్టు ఉంది. నల్లజాతి వారు పడ్డ బాధలు, వారిపై పోలీసు జులుం, ఆర్థికంగా వారు ఎలా వెనకబడ్డారో చెప్పే కథల మీద ఆసక్తి పెరిగింది. అదొక ఫ్యాషన్‌గా మారిపోయింది. ఆ ఆసక్తి చూపకపోతే జాతివివక్ష చూపినట్టే అనే భావన పెరిగింది. దీన్నే Woke culture అని కూడా అంటారు. అయితే నల్లజాతివారిలో బాగా చదువుకున్నవారు, మంచి ఉద్యోగాలు చేసేవారు చాలామంది ఉన్నారు. మంక్ ఆ కోవకి చెందినవాడే. అతను రాసిన కొత్త నవల గురించి అతని ఏజెంట్ “ప్రచురణకర్తలకి నల్ల పుస్తకం (నల్లజాతి వారి దీనగాథ అని గూఢార్థం) కావాలి” అంటే అతను “నేను నల్లవాణ్ణి. ఇది నేను రాసిన పుస్తకం. కాబట్టి ఇది నల్ల పుస్తకమే” అంటాడు! మంక్ ఒకసారి ఒక పుస్తకాల దుకాణానికి వెళతాడు. అతను రాసిన పుస్తకాలు ‘ఆఫ్రికన్ అమెరికన్ స్టడీస్’ అనే విభాగంలో ఉంటాయి. అతను నల్లజాతికి చెందినవాడు కాబట్టి అవి అక్కడ పెట్టారు, కథాంశాన్ని బట్టి కాదు! మంక్‌కి చిర్రెత్తుకొస్తుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి.

తన కొత్త నవల ప్రచురణకర్తలకి నచ్చటం లేదని మంక్ అసహనంగా ఉంటాడు. పైగా అతనికి Woke culture అంటే చిరాకు. కాలేజీలో క్లాసులో ఒక శ్వేతజాతి అమ్మాయి “నల్లవారిని కించపరిచే మాటలు నాకు ఇష్టం లేదు” అంటే అతనికి చిర్రెత్తుకొస్తుంది. ఆ మాటలు ఒకప్పుడు శ్వేతజాతి వారు వాడినవే. పాత సాహిత్యం గురించి మాట్లాడేటపుడు ఆ మాటలు వస్తాయి. వద్దంటే ఎలా? ఇదే Woke culture. అతను ఆ అమ్మాయి మీద కేకలేసి ఆమెకి బయటకి పొమ్మంటాదు. దీంతో అతని మీద ఫిర్యాదులొస్తాయి. కాలేజీ వారు అతన్ని బలవంతంగా సెలవు మీద పంపిస్తారు. జీతం కూడా ఆపేస్తారు. ముందుగా అనుకున్న ప్రకారం అతను కాలేజీ తరఫున బోస్టన్ నగరంలో ఒక పుస్తక ప్రదర్శనకి వెళతాడు. అక్కడ సింటారా అనే నల్లజాతి రచయిత్రి రాసిన తొలి నవల గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆమె బాగా చదువుకుని ఒక ప్రచురణసంస్థలో పని చేసి ఇప్పుడు నవల రాసింది. కథాంశం మాత్రం పేదరికపు నల్లజాతి కుటుంబం గురించి. పాత్రలు వ్యాకరణ దోషాలతో మాట్లాడతాయి. పెళ్ళి కాకుండానే గర్భవతి అయి అబార్షన్ కోసం వెళ్ళే పిల్ల ఒక పాత్ర. కథలో ఆ పాత్ర తల్లితో మాట్లాడే మాటలు సింటారా చదివి వినిపిస్తే ప్రేక్షకులు హర్షధ్వానాలు చేస్తారు. ఇదంతా చూసి మంక్‌కి కంపరంగా ఉంటుంది. ఇక్కడ మంక్ పాత్రధారి జెఫ్రీ రైట్ హావభావాలు నవ్వు తెప్పిస్తాయి. మొత్తానికి మంక్ ఇంకా కుంగిపోతాడు. సాహిత్యమంటే తరతరాలు నిలిచేది కాక అప్పటికి కుహనా మేధావులు ఏది మెచ్చుతారో అదే సాహిత్యం అన్నట్టు ఉంది పరిస్థితి. సింటారా “నా జాతి వారి కథలు ఎక్కడా కనపడలేదు. అందుకే ఈ పుస్తకం రాశాను” అంటుంది. తానేమో బాగా చదువుకుంది. ఆ నేపథ్యంతో కథ రాయొచ్చుగా. తన జాతిలో ఇతరులకి ప్రేరణగా ఉంటుంది. అబ్బే, అదెవరు చదువుతారు? కష్టాలు, కన్నీళ్ళు ఉంటేనే చదువుతారు. అయితే సింటారాకి తన వాదన వినిపించే అవకాశం ఇవ్వకుండా ఆమెని విమర్శించటం కరెక్టేనా? ఈ చిత్రం గొప్పతనం ఏమిటంటే ఆమెకి తన వాదన వినిపించే అవకాశం వస్తుంది.

బోస్టన్ మంక్ సొంత ఊరు. అతని తండ్రి, అక్క, తమ్ముడు అందరూ డాక్టర్లే. మంక్ మాత్రం సాహిత్యం మీద మక్కువతో రచయితగా మారాడు. తండ్రి చనిపోయాడు. తల్లి ఆగ్నెస్, అక్క లీసా బోస్టన్‌లోనే ఉంటారు. మంక్‌ని చూసి ఆగ్నెస్ “లావయ్యావు. ఏమైంది? కుంగిపోతే ఎక్కువ తినేస్తావు నువ్వు” అంటుంది. తల్లికి అన్నీ తెలిసిపోతాయి. లీసాకి విడాకులయిపోయాయి. అయితే ఆగ్నెస్ ఆ విషయం మర్చిపోతుంటుంది. లీసా భర్త గురించి అడుగుతూ ఉంటుంది. ఆమె మతిమరపు చూసి లీసాకి ఆందోళనగా ఉంటుంది. “నర్సుని పెడదాం” అంటాడు మంక్. “డబ్బుల్లేవు. నా విడాకులకి ఖర్చయింది. అమ్మకున్న రెండు ఇళ్ళలో ఒకటి అమ్మొచ్చు కానీ ఆ డబ్బు రెండో ఇంటి తనఖా విడిపించటానికే సరిపోతుంది” అంటుంది లీసా. తమ్ముడు క్లిఫ్‌కి కూడా విడాకులయిపోయాయి. అతని పరిస్థితీ బాలేదు. భార్యకి సగం ఆస్తి ఇవ్వాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా లీసా హఠాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోతుంది. బిడ్డ మరణంతో ఆగ్నెస్ పరిస్థితి ఇంకా దిగజారుతుంది. క్లిఫ్ అక్క అంత్యక్రియలకి వస్తాడు కానీ తల్లిని పెద్దగా పట్టించుకోడు. తల్లి తనని ప్రేమగా చూసుకోలేదని అతని భావన. మంక్ కాలేజీవారు తనకి జీతం ఇస్తారేమో అని అడుగుతాడు కానీ చుక్కెదురవుతుంది.

ఇలా దెబ్బ మీద దెబ్బ తగిలిన మంక్‌కి కోరలైన్ అనే ఒక లాయరు పరిచయమవుతుంది. ఇద్దరూ ఒకరికొకరు నచ్చుతారు. మంక్ ఈ పరిణామంతో కొంచెం తేరుకుంటాడు. కానీ తల్లిని డాక్టర్ దగ్గరకి తీసుకువెళితే ఆల్జీమర్స్ అని తేలుతుంది. మరోపక్క ఎక్కడ చూసినా సింటారా పేరు మారుమోగిపోతూ ఉంటుంది. మంక్ కసి మీద ఒక నవల రాస్తాడు. తండ్రెవరో తెలియని, నేరగాడైన ఒక నల్లజాతి యువకుడి కథ అది. సింటారా నవలలో పాత్రల్లాగ ఇందులో పాత్రలు కూడా వ్యాకరణదోషాలతో మాట్లాడతాయి. అనుకోకుండా తండ్రిని కలుసుకున్న ఆ యువకుడు కోపంతో తండ్రిని చంపేస్తాడు. చచ్చిపోతున్న తండ్రితో “నువ్వు చెత్తగాడివి కాబట్టి నేను చెత్తగాడినయ్యాను” అంటాడు. చివరికి ఒక పోలీసు చేతిలో మరణిస్తాడు. మంక్ ఆ నవలని తన ఏజెంటుకి పంపిస్తాడు. ఏజెంటుకి అస్సలు నచ్చదు. మంక్ “ఎవరూ అచ్చు వేయరని తెలుసు. వాళ్ళు కోరుకుంటున్న చెత్త ఎంత కంపు కొడుతుందో చూపించాలని రాశాను. పబ్లిషర్లకి పంపించు” అంటాడు. అయితే మెలిక ఏమిటంటే అతను ఆ నవల స్టాగ్ లీ అనే పేరుతో రాశాడు. మంక్ రాశాడని ఏజంటుని తప్ప ఎవరికీ తెలియదు. తల్లికీ, ప్రియురాలికీ కూడా చెప్పడు. ఒక పబ్లిషర్ ఆ నవలని ప్రచురించటానికి ఒప్పుకుంటుంది. ఆమె మంక్ రాసిన ఇతర పుస్తకాలని ఎప్పుడూ తీసుకోలేదు. ఇది మాత్రం నచ్చింది. పెద్ద మొత్తం కూడా ఇస్తానంటుంది. ఈ నవల బెస్ట్‌సెల్లర్ అవుతుందని అంటుంది. మంక్ మొదట ఒప్పుకోడు. “నేను కేవలం వారిని పరిహసించటానికి రాశాను. ఇక వేళాకోళం చాలు” అంటాడు. కానీ ఏజెంటు అతన్ని ఒప్పిస్తాడు. తల్లి వైద్యానికి ఆ డబ్బు ఉపయోగపడుతుందంటాడు. “నీ పుస్తకాలు బావుంటాయి. కానీ అవి ఖరీదైన మద్యం లాంటివి. ఆ మద్యం అందరూ కొనలేరు, నీ పుస్తకాలు అందరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు చవక మద్యం లాంటి నవల రాశావు. జనాలకి అదే కావాలి” అంటాడు. మంక్ అయిష్టంగానే ఒప్పుకుంటాడు.

మంక్ తన సిద్ధాంతాలని అమ్ముకోవటానికి ఇష్టపడలేదు. డబ్బు అవసరమున్నా తీసుకోవటానికి ఒప్పుకోలేదు. ఇది అతని ఔన్నత్యం. ‘నీ పుస్తకాలు అందరూ అర్థం చేసుకోలేరు. ఈ పుస్తకం జనంలోకి వెళ్ళనీ’ అంటేనే ఒప్పుకున్నాడు. అయితే ఒక రకంగా మంక్ కూడా కుహనా మేధావిలాగే ప్రవర్తించాడు. సింటారా పుస్తకాన్ని అకారణంగా ద్వేషించాడు. ఆమె సృష్టించిన పాత్రలు సమాజంలో లేవని అనటానికి అతనికి అధికారం లేదు. అతను అలాంటివారిని కలవలేదు, అంతే. ఈ చిత్రం గొప్పతనం ఏమిటంటే అతన్ని పూర్తిగా సమర్థించదు. అన్ని దృక్కోణాలు చూపిస్తుంది. ఇంకా స్క్రీన్ ప్లేపరంగా, దర్శకత్వపరంగా మంచి మార్కులు కొట్టేస్తుందీ చిత్రం. స్క్రీన్‌ప్లే గురించి చెప్పటానికి ఒక సన్నివేశం ఉదహరించవచ్చు. మంక్ కోరలైన్‌ని మొదటిసారి తన తల్లి ఇంటి బయట కలుసుకుంటాడు. అది అతని తల్లికి చెందిన రెండో ఇల్లు. సముద్రతీరంలో ఉంటుంది. చాలాకాలంగా ఖాళీగా ఉంది. లీసా అస్థికలు సముద్రంలో కలపటానికి అక్కడికి వస్తుంది మంక్ కుటుంబం. మంక్ ఎవరో తెలియక కోరలైన్ “ఆ ఇంట్లో ఎవరో పెద్దాయన తుపాకీతో కాల్చుకుని చనిపోయాడట” అంటుంది. మంక్ ముఖంలో రంగులు మారతాయి. ఆత్మహత్య చేసుకుని చనిపోయినది మంక్ తండ్రే అని మనకి అర్థమవుతుంది. కోరలైన్‌కి కూడా తన పొరపాటు అర్థమవుతుంది. అతని పేరు విని అతను రచయిత అని గుర్తుపడుతుంది. ఎదురుగా ఉన్న తన ఇంట్లోకి రమ్మంటుంది. సాధారణంగా కొత్త మనిషిని ఇంట్లోకి ఆహ్వానిస్తే ఆ మనిషి మీద రొమాంటిక్‌గా ఆసక్తి ఉన్నట్టే. మాటల్లో ఆమె పరిణతి గల స్త్రీ అని అర్థమవుతుంది. “రచయితలు ఎవరినీ వెంటనే చెడ్డవారని ముద్ర వేయరు. అలా చేస్తే మంచి కథలు రాయలేరు” అంటుంది. ఇలాంటి లోతైన భావాలతో ఆమె మేధస్సుని ఎస్టాబ్లిష్ చేసేస్తాడు స్క్రీన్‌ప్లే రచయిత. వారు మాటల్లో ఉండగా ఇంటికి ఇంకో పురుషుడు వస్తాడు. మంక్ సెలవు తీసుకుని వచ్చేస్తాడు. తన మేధస్సుకి సరితూగగల స్త్రీ చేజారిపోయినందుకు అతను నిరాశగా ఉంటాడు. ‘నా జీవితమింతేనా?’ అన్నట్టు ఉంటాడు. మర్నాడు కోరలైన్ అతని దగ్గరకి వచ్చి “నిన్న వచ్చినతను నా మాజీ భర్త. త్వరలో విడాకులు తీసుకోబోతున్నాం. నీతో ఇంకా మాట్లాడాలనుంది” అంటుంది. మంక్ ఆనందపడతాడు. చీకట్లో చిరుదీపం కనిపించినట్టు. పరిస్థితులు మారబోతున్నాయి అనే సూచన ఇది.

ఇంకా స్క్రీన్‌ప్లే గురించి చెప్పాలంటే లీసా పాత్ర గురించి చెప్పాలి. తండ్రికి ఎఫెయిర్లు ఉండేవని లీసా మంక్‌తో అంటుంది. ఒకసారి ఒక తెల్లజాతి స్త్రీని అతను ముద్దాడుతుండగా చూశానని అంటుంది. ఇది క్లిఫ్‌కి కూడా తెలుసు కానీ మంక్‌కి తెలియదు. లీసా, క్లిఫ్ ఒక జట్టుగా ఉండేవారు. తండ్రికి మంక్ అంటే ఇష్టమని వారిద్దరికీ అక్కసు. మంక్ ఎప్పుడూ తాను ఇతరలు కంటే మేధావినని అనుకుంటాడని లీసా అంటుంది. మంక్ “నువ్వు రోగులకి సేవ చేస్తున్నావు. నేనేమో కల్పిత పాత్రల కల్పిత సంభాషణలు రాస్తూ ఉంటాను” అంటాడు. తమకి మేధస్సు ఎక్కువని గర్వపడేవారు ఇతరులని చూసి ‘వారిలా సంతోషంగా ఎందుకు ఉండలేకపోతున్నాను’ అనుకోవటం మామూలే. తర్వాత మంక్ కోరలైన్‌ని తల్లికి పరచయం చేస్తే ఆమె కోరలైన్‌తో “నువ్వు తెల్లగా లేనందుకు నాకు ఆనందంగా ఉంది” అంటుంది. ఆమెకి కూడా భర్త ఎఫెయిర్ల గురించి తెలిసి ఉండవచ్చు అనే సూచన ఉంది. అతని ఆత్మహత్యకి అదే కారణం అయి ఉండవచ్చు. దర్శకత్వపరంగా చూస్తే ఇంకో సన్నివేశం గురించి చెప్పుకోవచ్చు. ఏజెంటు ఆఫీసులో మంక్ అతన్ని కలుసుకుంటాడు. పబ్లిషర్ ఒప్పుకుందని ఏజెంటు చెబుతాడు. మంక్ ప్రచురణకి ఒప్పుకోనంటాడు. అప్పుడు ఏజెంటు గదిలో ఉన్న మూడు మద్యం బాటిళ్ళు తెచ్చి టేబుల్ మీద పెడతాడు. “ఒకటి ఇరవై నాలుగు డాలర్లు. ఒకటి యాభై డాలర్లు. ఒకటి నూట అరవై డాలర్లు. అన్నీ జానీ వాకర్ కంపెనీవే. మొదటిది నాసి రకం. రెండోది తక్కువ నాసి రకం. మూడోది మంచి రకం. మూడోది ఖరీదెక్కువ కాబట్టి ఎక్కువమంది కొనరు. కానీ ఎవరైనా కోరుకునేది మత్తునే. నీ నవలలు మూడోరకం మద్యం లాంటివి. గాఢత ఎక్కువ. కానీ అందరికీ నచ్చవు. జనాలకి తేలికైన కథలు కావాలి. నువ్వు ఇప్పుడు మొదటి రకం మద్యం లాంటి నవల రాశావు. దాని వల్ల నీ ప్రతిభకి మచ్చ రాదు. నువ్వు అన్ని రకాల కథలూ రాయగలవు” అంటాడు. అప్పుడు మంక్ ఒప్పుకుంటాడు. మద్యం సీసాలని గమనిస్తే మొదటి సీసా కాస్త ఖాళీగా ఉంటుంది. రెండో సీసా సగం ఖాళీగా ఉంటుంది. మూడోది నిండుగా ఉంటుంది. ఏజెంటు ఎక్కువగా తాగేది, తాగించేది రెండో రకం అన్నమాట. అటు చవకదీ కాదు, ఇటు ఖరీదైనదీ కాదు. ఖరీదైనది ఎప్పుడైనా మంచి సందర్భం వచ్చినప్పుడు తాగవచ్చని అట్టేపెట్టాడు. మధ్యతరగతి మనస్తత్వం. ఇలాంటి సూక్ష్మమైన విషయాలు చాలా కనిపిస్తాయీ చిత్రంలో.

పెర్సివల్ ఎవరెట్ రాసిన ‘ఇరేజర్’ అనే నవల ఆధారంగా కోర్డ్ జెఫర్సన్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాసి, దర్శకత్వం వహించాడు. ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే రచయితగా ఆస్కార్ అందుకున్నాడు. మంక్‌గా జెఫ్రీ రైట్, సింటారాగా ఇస్సా రే, కోరలైన్‌గా ఎరికా అలెగ్జాండర్ నటించారు. జెఫ్రీ రైట్ నటన ఈ చిత్రానికి హైలైట్. మంక్ తమ్ముడు క్లిఫ్‌గా నటించిన స్టెర్లింగ్ బ్రౌన్‌కి కూడా మంచి పేరొచ్చింది. అతనికి చిత్రం రెండో భాగంలో మంచి సన్నివేశాలు ఉంటాయి. ఇద్దరికీ ఆస్కార్ నామినేషన్లు వచ్చాయి.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ వ్యాసంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు.

మంక్, ఏజెంటు ఫోన్లో పబ్లిషర్ పౌలాతో మాట్లాడతారు. మంక్ మోటు భాష వాడతాడు. తాను తన అనుభవాల ఆధారంగా పుస్తకం రాశానని అంటాడు. స్టాగ్ లీ (మంక్ పెట్టుకున్న పేరు) అనేది అసలు పేరు కాదని, అతను పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు కాబట్టి మారుపేరుతో రాశాడని అంటాడు ఏజెంటు. అందుకే వీడియో కాల్ చేయట్లేదని అంటాడు. ఇలా అబద్ధాల మీద అబద్ధాలు చెబుతాడు. మంక్ అయిష్టంగానే ఊకొడుతూ ఉంటాడు. కొన్నాళ్ళ తర్వాత పౌలా మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఈసారి వాళ్ళ మార్కెటింగ్ విభాగం ప్రతినిధి జాన్ ఆమెతో ఉంటాడు. పుస్తకాన్ని ఆఘమేఘాల మీద ప్రచురించి, అమెరికాలో నల్లజాతి బానిసత్వం రద్దు చేసిన జూన్ పంతొమ్మిదవ తేదీన విడుదల చేస్తామని అంటాడు. నల్లజాతివారు సంబరాలు చేసుకుంటారని, తెల్లజాతివారు అపరాధుల్లా ఫీలవుతారని అంటాడు. మంక్‌కి ఇది నచ్చదు. ఇది మరీ విపరీతంగా ఉందని అతని భావన. ఎప్పుడో జరిగిపోయిన దాన్ని తవ్వి గాయాలు రేపటం అతనికి ఇష్టం లేదు. అతనికో ఆలోచన వస్తుంది. పుస్తకం పేరు మారుస్తానని అంటాడు. ఎఫ్‌తో మొదలయ్యే అసభ్య పదమే తన పుస్తకానికి పేరని అంటాడు. పౌలా, జాన్‌లకి నచ్చదు. ఆ పేరు పెట్టకపోతే ప్రచురణకి ఒప్పుకోనని మంక్ అంటాడు. వాళ్ళు ఆ పేరు పెట్టటానికి ఒప్పుకోరని, పుస్తకం ప్రచురణ ఆగిపోతుందని అతని ఆశ. పౌలా, జాన్ మాట్లాడుకుని దానిక్కూడా ఒప్పుకుంటారు. ఒప్పుకోరనుకున్న మంక్ నిశ్చేష్టుడై ఉండిపోతాడు. అన్నిటికీ ఒప్పుకుంటే ఇంకేం చేస్తాడు? ఆ విధంగా పుస్తకం ప్రచురణకి వెళ్ళిపోతుంది.

ఈ మధ్యలో కొన్ని పరిణామాలు జరుగుతాయి. మంక్ తల్లి మానసికస్థితి మరింత క్షీణిస్తుంది. ఆమెని ఇరవై నాలుగు గంటలూ ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉండాలి. మరో పక్క ఒక సాహిత్య సంస్థ వారు సాహిత్య పురస్కారానికి నిర్ణేతల కమిటీలో మంక్‌ని చేరమంటారు. “కమీటీలో వైవిధ్యం (అంటే నల్లజాతి వారు అని గూఢార్థం) ఉండాలని మిమ్మల్ని అడుగుతున్నాం” అంటాడు ఆ సంస్థ అధ్యక్షుడు. మంక్‌కి ఈ ముసుగులో గుద్దులాట నచ్చదు. “మీరు జాతివివక్షకి పాల్పడుతున్నారనే ఆరోపణలు తప్పించుకోవటానికి నన్ను అడిగినందుకు థ్యాంక్స్” అంటాడు వ్యంగ్యంగా. ఆ అధ్యక్షుడు “యువార్ వెల్‌కమ్” అంటాడు తానేదో ఘనకార్యం చేస్తున్నట్టు. మంక్ అతని ప్రతిపాదనని తిరస్కరిస్తాడు. కానీ ఆ అధ్యక్షుడు “పైపై విమర్శలు కాకుండా నిజంగానే ఇతర రచయితల తప్పొప్పులు ఎంచే అవకాశమిది” అంటాడు లౌక్యంగా. మంక్ ఆయువుపట్టు మీద కొట్టాడు. మంక్ వెంటనే ఒప్పుకుంటాడు. కొసమెరుపు ఏమిటంటే సింటారా కూడా ఆ కమిటీలో ఉంటుంది. ఇది తెలిసి మంక్ నిస్పృహతో తల పట్టుకుంటాడు.

మరో పక్క ఒక సినీ నిర్మాత మంక్ పుస్తకాన్ని సినిమాగా తీస్తానని ముందుకొస్తాడు. ఏజెంటు ఆఫీసు దగ్గర రెస్టారెంట్లో ఆ నిర్మాతతో మంక్ సమావేశమవుతాడు. “నిర్మాతని కలిస్తే నేనెవరో తెలిసిపోతుందిగా?” అని ఏజెంటుతో అంటే “నీకంత సీన్ లేదు” అంటాడు ఏజెంటు. తల్లిని చూసుకోవటానికి ఎవరూ లేక మంక్ ఆమెని ఏజెంటు ఆఫీసులో వదిలి నిర్మాతని కలవటానికి వెళతాడు. నిర్మాతతో తాను పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నానని చెబుతాడు. ఇంతలో ఆంబులెన్స్ సైరన్ వినపడుతుంది. తల్లికి ఏమైనా అయిందని మంక్ “నేను వెళ్ళాలి” అని పరుగున ఏజెంటు ఆఫీసుకి వస్తాడు. పోలీసు సైరన్ అనుకుని అతను పారిపోతున్నాడని నిర్మాత అనుకుంటాడు. హాలీవుడ్ వాళ్ళకి ఇలాంటి గిమ్మిక్కులంటే పిచ్చి. “ఎంత నిజాయితీ!” అని సినిమా తీయటానికి ఒప్పుకుంటాడు. ఇంతకీ మంక్ తల్లి క్షేమంగానే ఉంటుంది. “నేనెన్ని పిచ్చిపనులు చేస్తే నాకంత డబ్బొచ్చి పడుతోంది” అంటాడు మంక్ ఏజెంటుతో. “అందుకే మా అమ్మా నాన్న అమెరికాకి వలస వచ్చారు” అంటాడు ఏజెంటు. ఇది అమెరికా మీద వ్యంగ్య బాణం. మంక్ తనకొచ్చిన అడ్వాన్సులతో తల్లిని మంచి నర్సింగ్ హోమ్‌లో చేర్పిస్తాడు.

సాధారణంగా సినిమా కథల్లో నాయకుడు లేదా నాయిక జీవితాన్ని పరిచయం చేసి తర్వాత వారికి ఏ కష్టాలు వచ్చాయో, వాటిని ఎలా అధిగమించారో చూపిస్తారు. ఇక్కడ మంక్‌కి వచ్చేవి లౌకికమైన కష్టాలు కాదు. సిద్ధాంతపరమైన కష్టాలు! లౌకికంగా డబ్బు వచ్చిపడుతూ ఉంటుంది. అయినా మంక్‌కి ఆనందం లేదు. సిద్ధాంతాలని అమ్ముకుంటున్నాడుగా! ‘వద్దంటే డబ్బు’, ‘బాబాయ్ అబ్బాయ్’ లాంటి సినిమాల్లో డబ్బు వచ్చిపడుతూ ఉంటే నాయకులు హైరానా పడుతుంటారు. కానీ మంక్ అంతా మన మంచికే అన్నట్టు ఉంటాడు. అయితే కొత్త కష్టాలు వచ్చిపడతాయి.

చిత్రంలో ముఖ్యమైన ఉపకథ మంక్ తమ్ముడు క్లిఫ్‌ది. అతను పెళ్ళి చేసుకుని పిల్లల్ని కన్నాడు. కానీ అతను స్వలింగప్రియుడు. ఆ విషయం తెలిసి అతని భార్య విడాకులు తీసుకుంటుంది. ‘ఇన్నాళ్ళూ సంకెళ్ళలో ఉన్నట్టు ఉన్నాను. ఇప్పుడు ఎంజాయ్ చేస్తాను’ అని అతను చాలామంది పురుషులతో సంబంధాలు పెట్టుకుంటాడు. మంక్ నీతులు చెబుతాడని అతనికి మంక్ అంటే చిరాకు. తల్లి నర్సింగ్ హోమ్‌లో ఉందని తెలిసి చూడటానికి బోస్టన్ వస్తాడు. ముందు ఇంటికి వెళతాడు. ఇంట్లో మంక్ ఉంటున్నాడు. మంక్‌తో కోరలైన్ ఇంటికి వస్తుంది. క్లిఫ్ ఇతర పురుషులతో తన సంబంధాల గురించి ఇద్దరికీ కథలు కథలుగా చెబుతాడు. మంక్‌కి చిరాకు వస్తుంది. కోరలైన్ మాత్రం “ప్రపంచం ఎలాగూ తగలబడుతోంది. ఎంజాయ్ చేయటంలో తప్పు లేదు” అంటుంది. ప్రపంచం తగలబడుతోందని అందరూ అనుకునేదే. దానికి ప్రతిస్పందన మాత్రం ఒక్కొక్కరిదీ ఒక్కోలా ఉంటుంది. కోరలైన్ విశాల దృక్పథం చూసి క్లిఫ్ “నీకు మంక్ ఎలా నచ్చాడు?” అంటాడు. “అతనిలో బాధా ఉంది, హాస్యమూ ఉంది” అంటుందామె. “అంటే దొడ్డికెళుతూ చచ్చిపోయేవాడిలాగన్న మాట” అంటాడతను. మంక్ “ఎప్పుడూ కాస్తంత హద్దు దాటి మాట్లాడటం నీకలవాటేగా” అంటాడు. అందరూ నవ్వుకుంటారు. తర్వాత క్లిఫ్ నర్సింగ్ హోమ్‌లో తల్లిని కలిసి ఆమెతో డ్యాన్స్ చేస్తాడు. ఆమె ఆల్జీమర్స్ అప్పటికే ముదిరింది. ఆమె ఉన్నట్టుండి “నువ్వు గే కాదని నాకు తెలుసు” అంటుంది. అంటే అతను గే అయినందుకు ఆమెకి నిరాశగా ఉందన్నమాట. ఆ మాటకి క్లిఫ్ చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతాడు. తలిదండ్రులు బిడ్డలని ‘నువ్వు నన్ను నిరాశపరచావు’ అంటే ఎంత క్షోభ? ఎవరి ఉనికి వారిది. ఎవరి పోరాటం వారిది. ధైర్యం చెప్పాల్సిన తలిదండ్రులు తీర్పులు చెబితే మనసు చివుక్కుమనదా? కుటుంబాలలో బంధాలు ఎంత క్లిష్టంగా ఉంటాయో ఇలా చూపించారు.

చిత్రంలో వచ్చే మలుపు ఒకటి చెప్పి ముగిస్తాను. మంక్ రాసిన పుస్తకం కూడా అవార్డు పరిశీలనకి వస్తుంది. ఆ కమిటీలో మంక్ సభ్యుడు! అతను వేరే పేరుతో రాశాడు కాబట్టి ఇతరులకి తెలియదు. ఇక తర్వాత ఏం జరుగుతుందో చూస్తేనే బావుంటుంది. మంక్ తానే మేధావిననుకోవటం వల్ల అతనికి సమస్యలు వచ్చిపడతాయి. అందులో హాస్యమూ ఉంటుంది, నిరాశా ఉంటుంది. చిత్రంలో సందేశం ఏమిటంటే ఎవరినీ చిన్నచూపు చూడవద్దు. ఎవరి ప్రతిభ వారికి ఉంటుంది. ఎవరి అభిప్రాయాలు, అభిరుచులు వారికి ఉంటాయి. అలాగే ఎవరి కష్టాలు వారికుంటాయి. మంక్ క్లిఫ్‌ని చూసి కాసింత అసూయపడతాడు. కానీ క్లిఫ్ తల్లి ప్రేమని పూర్తిగా పొందలేకపోయాడు. ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది. మంక్ సింటారాని చిన్నచూపు చూశాడు. ఆమె అతనికి దీటుగా జవాబు చెబుతుంది. జీవితం ముందు పరీక్షలు పెట్టి తర్వాత పాఠాలు నేర్పుతుంది. అదంతే! ఈలోగా మనవారిని మనం కోల్పోకుండా ఉంటే అదే విజయం.

‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-26 – జిందగీ ఇత్తెఫాక్ హై

0

[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

[dropcap]ఈ[/dropcap] వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘ఆద్మీ ఔర్ ఇన్సాన్’ (Aadmi Aur Insaan, 1970) చిత్రం లోని ‘జిందగీ ఇత్తెఫాక్ హై’. గానం ఆశా భోస్లే, మహేంద్ర కపూర్. సంగీతం రవి.

~

సాహిర్ క్లబ్ సన్నివేశాల కోసం రాసిన పాటలన్నీ కూడా ఆషామాషి పాటలు కావు. వాటిలో అతి గొప్ప తార్కికత ఉంటుంది. ‘బాజీ’ సినిమాలో ‘తద్బీర్ సే బిగడీ’ పాట నుండి గమనిస్తే ఆయన రాసిన క్లబ్ పాటలన్నీ కూడా సన్నివేశానికి అతికినట్టు సరిపోతూనే లోతైన అర్థాన్ని, జీవితపు సారాన్ని కలగలపి ప్రదర్శిస్తాయి. అందుకే ఆయన క్లబ్ పాటలకు వాంప్ పాత్రలకు, నర్తకీమణులకు రాసిన పాటల స్థాయి ఇతర కవులతో పోలిస్తే భిన్నంగా ఉండి గొప్ప జీవిత సత్యాలను చర్చకు పెడతాయి. ఆనాటి సినిమాలలో సాహిర్ రాసిన క్లబ్ పాటలు కేవలం మాస్‌ను అలరించడమే కాదు, మేధావుల చేత కూడా ప్రశంసింపబడ్డాయి. ‘ఆద్మీ ఔర్ ఇన్సాన్’ సినిమాలోని ‘జిందగీ ఇత్తఫాక్ హై’ అన్న పాటను ఇప్పుడు చర్చించుకుందాం.

ఈ సినిమాలో మొత్తం తొమ్మిది పాటలున్నాయి. ఈ ఒక్క పాట సోలోగానూ డ్యూయెట్ గానూ రెండు సార్లు సినిమాలో వస్తుంది. పాటలన్నీ కూడా వేటికవి గొప్పవే. కాని వాటన్నిటికి మించి క్లబ్ సాంగ్‌గా పార్టీ గీతంగా రాసిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంది. కారణం ఇందులో సాహిర్ ప్రదర్శించిన తాత్వికత. ఒకే పాటను డ్యూయెట్ గానూ సోలోగానూ ఉపయోగించుకున్న సందర్భాలు సిని ప్రపంచంలో అతి తక్కువ. సాహిర్ పాటతో అలాంటి ప్రయోగం ఈ సినిమాలో దర్శకులు చేస్తే ఆ రెండు వర్షన్లను కూడా సూపర్ హిట్ చేసారు సినీ శ్రోతలు.

‘జిందగీ’ అంటే జీవితం గురించి ఎన్నో సినీ పాటలు ఇప్పటిదాకా వచ్చాయి. వస్తూనే ఉన్నాయి జీవితాన్ని రకరకాల పద్ధతుల్లో అర్థం చేసుకుని, పాటలలో ప్రస్తావిస్తారు సినీ కవులు. జీవితాన్ని ఓ సమస్యగా, యాత్రగా, నాటకంగా, ఆటగా ఇతర కవులు అర్థం చేసుకుంటే సాహిర్ జీవితం యాదృచ్ఛికం అంటూ ఓ నినాదమే చేశారు. ‘ఇత్తెఫాక్’ అనే పదానికి తెలుగులో సరైన అర్థం యాదృచ్ఛికం. ఉర్దూలో ఈ పదానికున్న కవిత్వ ధోరణి తెలుగు పదానికి రాదు. కాని యాదృచ్ఛికం తప్ప మరో పర్యాయ పదం నాకు ఈ సందర్భంలో దొరకలేదు. అన్ని సార్లు ‘యాదృచ్ఛికం’ అని ప్రయోగించడం ఈ పాట సందర్భంలో తెలుగు అనువాదంలో కవిత్వ పరంగా కృతిమంగా అనిపించినా, అర్థాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పదాన్నే మళ్ళీ మళ్ళీ అనువాదంలో ఉపయోగించవలసి వచ్చింది.

ఈ పాట సినిమాలో రెండు సందర్భాలలో వస్తుంది. మొదటిది సోలో గీతం. పార్టీలో ముంతాజ్ పాత్రపై ఆ పాటను చిత్రించారు. బిగుతైన బట్టలతో ముంతాజ్ నర్తించగా, మందు ఏరులై పారుతున్న ఓ పార్టీలో ఈ గీతం వస్తుంది. దీన్ని ఆశా భోస్లే సోలోగా గానం చేసారు. రెండవ సారి కూడా ఇది పార్టీ గీతంగానే మళ్ళీ వస్తుంది. అయితే దాన్ని డ్యూయెట్ గా ఆశా, మహేంద్రకపూర్‌లు కలిసి గానం చేసారు. ముందుగా వచ్చే సోలోను మొదట చర్చించుకుందాం. ఆ పాట ఇలా ఉంటుంది.

జిందగీ ఇత్తెఫాక్ హై..

జిందగీ ఇత్తెఫాక్ హై, కల్ భీ ఇత్తెఫాక్ థీ, ఆజ్ భీ ఇత్తెఫాక్ హై

జిందగీ ఇత్తెఫాక్ హై

(జీవితం యాదృచ్చికం, నిన్నా యాదృచ్ఛికమే, నేడు యాదృచ్ఛికం)

ఇత్తెఫాక్‌కు ఉర్దూలో యాదృచ్ఛికం కాక ఇంకా అర్థాలు ఉన్నాయి. ఒప్పందం, సఖ్యత, స్నేహం, అని కూడా ఆ పదానికి అర్థాలున్నాయి. ఇక్కడ సాహిర్ జీవతం యాదృచ్ఛికం అన్న అర్థాన్ని ఇస్తూనే మరో పక్క దాన్ని ఓ ఒప్పందం గానూ ప్రస్తావించడం కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఆ పదాన్ని వాడి ఆయన శ్రోతల మొదళ్ళకు పని పెట్టారు. కాని ఏ అర్థాన్ని తీసుకుని ఈ పాటకు ఆపాదించుకున్నా అందులో మనుషులు జీవితంలో నిమిత్తమాత్రులని వారి చేతిలో ఏదీ ఉండదనే విషయం మాత్రం స్పష్టం అవుతుంది. ఆ నిజం మాత్రం ప్రతి అర్థంలోనూ ద్వనిస్తుంది. మనిషి అధీనంలో జీవితం ఉండదు. అన్నీ సంఘటనలు జరిగిపోతూ ఉంటాయి. అతనో పాత్ర మాత్రమే. దేని పై అతని అధికారం ఉండదు. గడిచిపోయిన నిన్న, నడుస్తున్న ఈ రోజు, రాబోయే మరో రోజు అన్నీ మనిషి జీవితంలో యాదృచ్ఛికాలే.

జామ్ పకడ్ బడాకె హాథ్, మాంగ్ దుయా ఘటె నా రాత్

జాన్ – ఎ – వఫా, తేరీ కసమ్, కహ్తె హై దిల్ కి బాత్ హమ్

గర్ కొయీ మెల్ హో సకె, ఆంఖోకా ఖేల్ హో సకే

అప్నె కో కుష్ నసీబ్ జాన్, వక్త్ కో మెహర్బాన్ మాన్

మిల్తె హై దిల్ కభీ కభీ, వర్నా హై అజ్నబీ సభీ

మెరె హందం మెరె మెహర్బాన్

హర్ ఖుషీ ఇత్తెఫాక్ హై..

హర్ ఖుషీ ఇత్తెఫాక్ హై, కల్ భీ ఇత్తెఫాక్ థీ

ఆజ్ భీ ఇత్తెఫాక్ హై, జిందగీ ఇత్తెఫాక్ హై

(చేయి చాచి మధు పాత్ర అందుకో, ఈ రాత్రి గడిచిపోరాదని ప్రార్థన చేయ్, ఓ ప్రియతమా నీ పై ఒట్టేసి, మనసులోని మాట చెప్తున్నాను, ఎవరితోనన్నా స్నేహం కలిగితే, కనులు కలపగలిగితే, నిన్ను నీవు అదృష్టవంతుడనుకో, కాలం దయ నీపై ఉందని తెలుసుకో, ఇక్కడ మనసులు ఎప్పుడో గాని కలవవు, లేదంటే అందరూ ఎవరికి వారు ఇక్కడ పరాయి వాళ్లే, నా స్నేహితుడా, నా పై దయ చూపిన వాడా, ప్రతి ఆనందమూ యాదృచ్ఛికమే, నిన్నా యాదృచ్ఛికమే, నేడూ యాదృచ్ఛికమే, జీవితమే యాదృచ్ఛికం)

జీవితంలో దొరికిన ఆనందాలని ఆలోచించక అందుకోవాలని, లభించిన ఆనందకరమైన ఘడియలు గడిచిపోరాదని ప్రార్థంచమని ఆమె చెబుతుంది. పైగా ప్రియమైన ఆ స్నేహితుని పై ఒట్టేసి మరీ ఆమె అతనికి జీవితంలోని క్షణికత్వాన్ని తెలియ జేస్తుంది. ఎవరితో స్నేహం కలిగినా, ఎవరితోనన్నా కనులు కలిసి మనసు స్పందించినా అది అతని అదృష్టంగా భావించమని ఆమె కోరుతుంది. కాలం అతనిపై దయ తలచిందని, అలాంటి క్షణాలు అందరి జీవితంలో రావని, ఈ నిజం తెలుసుకుని ఆ క్షణాలను ఆస్వాదించమని ఆమె కోరుతుంది. ఈ ప్రపంచంలో అందరూ పరాయి వాళ్ళే, మనసులు అంత త్వరగా కలవు. అదే జరిగితే అదో గొప్ప వరమని, ఆ క్షణాలను పూర్తిగా సొంతం చేసుకుని జీవించమని, చెబుతూ అతన్ని స్నేహితుడిగానూ, తనపై దయ చూపిన వాడిగానూ ప్రస్తావిస్తూ, అందుకే ఈ నిజాన్ని అతనికి తెలియపరుస్తున్నానని, దొరికిన ఆ ఆనందపు క్షణాల విలువ తెలుసుకుని ప్రవర్తించమని, జీవితం యాదృచ్ఛికం అని ఇక్కడ అన్ని అనుకోకుండా జరిగే సంఘటనలని, వాటి మధ్య దొరికిన ఆనందాన్ని తక్కువ చేసుకోవద్దని, దాని విలువ మరచి పోగొట్టుకోవద్దని ఆమె చెప్తుంది.

హుస్న్ హై ఔర్ షబాబ్ హై, జిందగీ కామయాబ్ హై,

బజ్మ్ యూ హీ ఖిలీ రహే, అప్ని నజర్ మిలీ రహే

రంగ్ యూ హీ జమా రహే, వక్త్ యూ హీ థమా రహే

సాజ్ కీ లయ్ పె ఝూమ్ లే, జుల్ఫ్ కె ఖం కొ చూమ్ లే

మెరె కియే సే కుచ్ నహీ, తేరె కియె సె కుచ్ నహి

మేరే హమ్దమ్ మేరే మెహెర్బాన్

యె సభీ ఇత్తెఫాక్ హై…

యె సభీ ఇత్తెఫాక్ హై కల్ భీ ఇత్తెఫాక్ థి ఆజ్ భీ ఇత్తెఫాక్ హై

జిందగీ ఇత్తెఫాక్ హై

(అందం ఉంది, యవ్వనమూ ఉంది వీటితో జీవితం సుసంపన్నమైంది. ఈ విందు ఇలాగే సాగనీ. మన కళ్ళు ఇలా కలిసే ఉండనీ, ఈ రంగులు ఇలాగే వికసించి ఉండనీ, కాలం ఇలాగే ఆగిపోనీ, ఈ రాగాల లయలో నాట్యం చేయ్, కురుల మడతలను ముద్దాడుకో, నేను ఏదో చెయ్యడం వల్లో నువ్వు ఏదో చేస్తేనో ఏదీ జరగిపోదు, ఓ నా స్నేహితుడా, నా ప్రియతమా ఇవన్నీ యాదృచ్ఛికాలే, నిన్నా యాదృచ్ఛికమే, నేడు యాదృచ్ఛికమే, జీవితమంతా యాదృచ్ఛికాల సంగమమే)

జీవితం అనుభవిచడానికే. ఈ అనుభవాలు మనం ఏదో కష్టపడితేనో, ప్రయత్నిస్తేనో మన దరి చేరవు. అవి అన్నీ యాదృచ్ఛికంగా ఎదురయ్యే అనుభవాలే. వాటిలో ఆనందం కలిగించే అనుభవాలుంటే వాటిని నిండుగా అనుభవించాలి. అందం యవ్వనం ఉన్నప్పుడే జీవితం సంపన్నంగా కనిపిస్తుంది. అలాంటప్పుడు జీవితంలో అనుభవంలోకి వచ్చే విందులను సాగిపోనివ్వాలి. కలిసిన కళ్లను కలుపుని ఉంచుకోవాలి. జీవితంలో చొచ్చుకు వచ్చిన రంగులను ఆస్వాదించాలి. కాలాన్ని శక్తి ఉన్నంత మేరా జ్ఞాపకంగా మలచుకుని దాన్ని శాశ్వతం చేసుకోవాలి. జీవితంలో నడిచి వచ్చిన మధురమైన రాగలను ఆఘ్రానించాలి. అందిన అందమైన కురుల మడతలను ముద్దాడుకోవాలి. మనం కోరుకుని ప్రయతిస్తే ఇలాంటి అనుభవాలు దొరకవు. అవి ఎదురయినప్పుడు ఆలోచనలో పడిపోక వాటిని అందుకుని అనుభవించడమే జీవితం ఎందుకంటే జీవితం మొత్తం యాదృచ్ఛికాల సంగమమే.

ఈ పాటలో నేటిని ఆస్వాదిస్తూ దొరికిన ఆనందపు క్షణాలని అనుభవిస్తూ జీవించమనే సందేశం ఉంది. జీవితంలోని ఆనందాలు ప్రయతిస్తే దొరకవు. అప్రయత్నంగా దక్కిన వాటిని కాదని వాటి విలువ తెలియకుండా ప్రయత్నిస్తే అవి మళ్ళీ మన దరి చేరవు. అన్ని యాదృచ్ఛికాలే, ఎందులోనూ మన గొప్ప లేదు. అందుకే దొరికిన ఆనందాలను అనుభవించగల స్థితిలో మనం ఉండడమే జీవితాన్ని అందుకోవడం.

ఈ పాటలో పల్లవి చరణాలను గమనించండి. సాహిర్ పాట ఇదే పద్ధతిలో ఉండాలనే నియమాలన్నిటిని వదిలి ఎన్నో ప్రయోగాలు చేసారు. హం దోనో సినిమాకి “అభీ నా జావో ఛోడ్ కర్” అని ఆయన రాసిన పాట విన్నాం కదా. అందులోనూ చరణం పల్లవులంటూ మనకు ఇంతకు ముందు తెలిసిన వరస ఉండది. ఆయన పదాలతో అద్భుతమైన ప్రయోగాలు చేసారు. అలాగే ఈ పాటలోకూడా అన్నీ వాక్యాలే. పల్లవిలో ఉండేది ఒక్క రెండు వాక్యాలయితే చరణంలో వాక్యాలు వరుసగా వస్తూనే ఉంటాయి. అదే ఈ పాట అందం కూడా. ఈ శైలి మరే రచయిత సాహిర బాటలో మాత్రం ప్రయోగించలేదు. ఇది పూర్తిగా సాహిర్ వ్యక్తిగత శైలి. నేను రాసిందే చరణం, ఆపిందే పల్లవి అన్నట్లుగా ఆయన ఆ పాటలన్ను అన్ని నియమాలకు అతీతంగా రాసుకూంటూ వెళ్ళి వాటిని ప్రజల మధ్యకు చేర్చగలిగారు. కవిత్వ బలం ఉంటే దానికి నియమాలు అక్కర్లేదని చేసి చూపెట్టారు.

ఇది ఆశా సోలోగా పాడిన పాట సారం. ఈ పాట అశాంతం ఫాస్ట్ బీట్‌లో వస్తుంది. దానికి చివర్న ఆశా భోస్లే చేర్చిన రాగం అత్యద్భుతంగా ఉంటుంది. పాటకు ఎంతో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇస్తుంది ఆశా గానం.

ఇదే పాట తరువాత డ్యూయెట్‌గా ఎలా రూపొందిందో చూద్దాం. ఇది కాస్త విషాదాన్ని జోడించి పాడిన గీతం. ఇందులో ఆశాతో గొంతు కలుపుతారు మహేంద్రకపూర్. ఈ డ్యూయెట్‌లో మనసు గాయపడిన నాయకుడికి ఆ నాట్యగత్తె సాంత్వాన చేకూరుస్తూ జీవితాన్ని అర్థం చేయిస్తుంది. పైన సోలోలో ఆనందంగా జీవితంలో ఓలలాడుతూ ఉండమనే సందేశం ఉంటే, ఇక్కడ ప్రతికూల పరిస్థితిలో కూడా జీవితంలో ఓటమిని ఒప్పుకోక ముందుకు సాగుతూ వెళ్లమనే సందేశం ఉంది.

జిందగీ ఇత్తెఫాక్ హై..

జిందగీ ఇత్తెఫాక్ హై, కల్ భీ ఇత్తెఫాక్ థీ ఆజ్ భీ ఇత్తెఫాక్ హై

జిందగీ ఇత్తెఫాక్ హై,

(జీవితం యాదృచ్ఛికం, నిన్నా యాదృచ్ఛికమే, నేడు యాదృచ్ఛికమే)

అదే పల్లవితో పాటను ఆమె మొదలెడుతుంది. అయితే తరువాతి వాక్యంలో విషాదంగా కనిపిస్తున్న నాయకుడిని ఆమె ప్రశ్నిస్తుంది. అతను తాననుభవిస్తున్న బాధ గురించి చెప్తే దానికి ఆమె తరువాత సమాధానం ఇస్తుంది. ఇక్కడ కూడా చరణాలలో సాహిర్ చేసిన ప్రయోగాలను గమనించవచ్చు.

ముందుగా ఆమె అతన్ని ఇలా సంబోధిస్తుంది..

కోయి తో బాత్ కీజియె, యారో కా సాథ్ దీజియె

(ఎవతోనన్నా మాట్లాడు, స్నేహితులతో కలువు)

అతను మౌనంగా ఉన్నాడు, మునుపటి ఉత్సాహం అతనిలో లేదు. ఏదో దెబ్బ తిన్నట్టుగా దిగాలుగా ఉండడం చూసి అతన్నిఎవరితోనన్నా కలిసి మాట్లాడమని మౌనంగా ఉండవద్దని ఆమె అడుగుతుంది. ఇక్కడ ఆమె పాడేది ఒకే ఒక్క వాక్యం. దీని తరువాత అతను ఇలా బదులిస్తాడు..

కభీ గైరో పె భీ అప్నో కా గుమాన్ హోతా హై

కభీ అప్నె భీ నజర్ ఆతే హై బేగానె సె.. వాహ్ వాహ్

(కొన్ని సార్లు పరాయు వాళ్ళ దగ్గర దగ్గరతనం దొరుకుతుంది. మరొ కొన్ని సార్లు మనవాళ్ళే పరాయివాళ్లనిపిస్తారు)

ఆమె అతని పరిచయస్థురాలు మాత్రమే. కాని అతనిలోని విషాదాన్ని గమనించింది. అలా ఉండవద్దని అతన్ని కోరుతుంది. దానికి అతను కొన్ని సార్లు పరాయి వారివద్ద కోరుకున్న దగ్గరితనం దొరుకుతుంది. కొని సార్లు మన అనుకున్న వాళ్ళే పరాయి వాళ్లవుతారు అని సమాధానం ఇస్తాడు. అతను కోరుకున్న వారి వద్ద ఆశించిన ప్రేమ స్నేహం దొరకట్లేదన్న అతని బాధ ఆమెకు అర్థం అయినా అతని కవిత్వ ధోరణికి అతను చెప్పే జీవిత సత్యాన్ని ఆమోదిస్తూ ఆమె వాహ్ వాహ్ అని బదులిస్తుంది. ఆమె ఇచ్చిన ప్రోత్సాహంతో అతను ఇలా అంటాడు..

కభీ ఖ్వాబో మె చమక్తే హై మురాదొ కే మహల్

కభీ మహలో మె ఉభర్ ఆతే హై వీరానే సె .. హాయ్ హాయ్ హాయ్

(కొన్ని  సార్లు కలల్లో కోరికల భవనాలు మెరుస్తూ కనిపిస్తాయి. కొన్ని సార్లు ఆ భవనాలలో నిర్జన ప్రదేశాలు దర్శనమిస్తాయి)

మనం కనే అందమైన కలలు కాల్పనికమైనవి కాని మన కోరికలను అవి ప్రతిఫలిస్తాయి. ఆ కాల్పనిక కలలలో అందమైన భవనాలు మెరుస్తూ మైమరిపిస్తాయి. కాని వాస్తవంలో చాలా సార్లు ఈ అందమైన భవనాలలో రాజప్రసాదాలలో నిర్జన ఎడారులు దర్శనమిస్తాయి. కలలకు వాస్తవానికి అంత వ్యత్యాసం ఉంటుంది. అందమైన కలలు వాస్తవ రూపంలోకి వచ్చినప్పుడు, మనం కోరుకున్నవి జీవితంలో మనముందుకు వచ్చినప్పుడు చాలా సందర్భాలలో ఎంతో నిరాశకు గురి చేస్తాయి. ఆ నిరాశను తట్టుకోవడం చాలా కష్టం. అవి మన ఓటమిని, మన మూర్ఖత్వాన్ని, మన అమాయకత్వాన్ని చూపిస్తాయి. దాన్ని తట్టుకోవడం అంత సులువు కాదు. అతను తనలోని నిరాశను, తాను కన్న కలలకు, తనకు దక్కిన వాస్తవానికి మధ్య తేడాను ఆమెకు చెప్పినప్పుడు అతని కవిత్వ ధోరణికి ఆమె ఆనందిస్తుంది. అంతటి నిరాశను కవితాత్మకంగా వ్యక్తికరించిన అతని భాషా పటిమకు అచ్చెరువు చెంది ‘హాయ్ హాయ్’ అంటు అతని భాధను అర్థం చేసుకున్నానని ప్రకటిస్తుంది. కాని దానికి ఓ అందమైన లోతైన జీవిత సారాన్ని జోడించి తన జవాబును ఇలా ఇస్తుంది..

కోయి రుత్ భీ సజా నహీ, క్యా హొ కబ్ కుచ్ పతా నహి

గమ్ ఫజూల్ హై గం న కర్, ఆజ్ తో జష్న్ కమ్ న కర్

మేరె హమ్దం మేరే మెహర్బాన్

హర్ ఖుషీ ఇత్తెఫాక్ హై..

హర్ ఖుషీ ఇత్తెఫాక్ హై

కల్ భీ ఇత్తెఫాక్ థీ, ఆజ్ భీ ఇత్తెఫాక్ హై

జిందగీ ఇత్తెఫాక్ హై

(ఏ రుతువు కూడా శిక్ష కాదు, ఎప్పుడు ఏమవుతుందో ఎవరికీ తెలియదు, దుఃఖం దేనికి పనికిరాదు అందుకే దుఃఖించకు, నీ వాళ్లతో సంబరాలను తగ్గించుకోకు. ఎందుకంటే ఓ నా స్నేహితుడా, ఓ నా ప్రియ నేస్తమా, ప్రతి ఆనందమూ యాదృచ్ఛికమే, నిన్నా యాదృచ్ఛికమే, నేడు యాదృచ్ఛికమే, జీవితమే యాదృచ్ఛికం)

జీవితంలో ఎన్నో రుతువులు వస్తాయి వెళ్తాయి. కొన్ని ఆనందాన్నిస్తే కొన్ని విషాదాలను మిగులుస్తాయి. అయినా ఏ రుతువూ మనకు శిక్ష కాదు. ఏప్పుడు ఏం జరుగుతుందో ఎవరమూ చెప్పలేమూ. ఏదీ అనుకుని రాదు. ఏం జరిగినా దుఃఖం వాటిని మార్చలేదు. అందుకే దుఃఖిస్తూ కూర్చోవడం అంటే జీవితాన్ని వ్యర్థం చేసుకోవడమే, దుఃఖం ఎవరికీ ఉపయోగ పడదు. దుఃఖం కలిగిందని, నీ వాళ్లతో మిగిలిన సంబరాలకు నిన్ను నువ్వు దూరం చేసుకోకు. ఎందుకంటే నీ జీవితంలో వచ్చిన ఈ దుఃఖం లాగే ఆనందమూ యాదృచ్ఛికమే, నీ గడిచిన నిన్న, నడుస్తున్న ఈ రోజు, రాబోయే తరువాతి రోజు అన్నీ యాదృచ్ఛికాలే. వాటిని స్వీకరించి ముందుకు వెళ్లడమే జీవితం.

ఇక్కడ కూడా చరణంలో జరిగిన ప్రయోగాలను గమనించండి. అతను తన స్థితిని అమెకు తెలియబరుస్తున్నాడు. ఆమె తన పంథాలో జవాబిస్తుంది. వాక్యాలలో ఎక్కడా పాటకుండవల్సిన నియమాలు కనిపించవు. పాటంతా కేవలం కవితాగానమే..

అతనికి జీవితంలో గడచిన దుఃఖాల ప్రభావంతో రాబోయే ఆనందాలను వదులుకోవద్దని చెబుతూ, అతన్ని ఆమె ఇలా అడుగుతుంది..

ఖోయె సె క్యూ హో ఇస్ కదర్, డూంఢతీ హై కిసే నజర్

(ఏదో పోగొట్టుకున్నట్లు ఇలా ఎందుకున్నావు? నీ చూపులు దేన్ని వెతుకుతున్నాయి)

జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్లు ఉన్న అతన్ని ఎందుకని అలా ఉన్నావు దేన్ని వెతుకుతున్నావు అని ఆమె ప్రశ్నిస్తుంది. దానికి అతను ఇలా జవాబు ఇస్తున్నాడు

ఆజ్ మాలూం హువా పెహ్లె యే మాలూం నా థా

చాహతే బడ్కే పషేమాన్ భి హో జాతీ హై.. అచ్ఛా

దిల్ కె దామన్ సె లిపటతి హుయీ రంగీన్ నజరే

దేఖతె దేఖతె అన్జాన్ భి హో జాతీ హై

దేఖతె దేఖతె అన్జాన్ భి హో జాతీ హై

(ఇవాళే ఇది తెలిసింది, ఇంతకు ముందు నాకు తెలియని ఓ విషయం, ఇష్టాలు పెరుగుతూ పోయి సిగ్గు పశ్చాత్తాపంలోకి మారిపోగలవని..) అలాగా..

(హృదయపు అంచులను హత్తుకునే ఆ రంగుల చూపులు చూస్తూ ఉండగానే అపరిచితమై పోతాయని)

అతను ఒకప్పుడు కొందరిపై ఇష్టాలను పెంచుకున్నాడు. ఆ ఇష్టాలను మనసులో పెరగనిచ్చాడు. కాని అవి పెరిగి పెరిగి సిగ్గు పశ్చాత్తాపాలుగా మారిపోయాయి. ఒకప్పటి తన ఇష్టానికి, ప్రేమకు ఇప్పుడు అతను సిగ్గుపడుతున్నాడు, పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. ఇలాంటి స్థితి వస్తుందని, తన ప్రేమ ఇష్టాలే తరువాత తాను సిగ్గుపడే విషయాలుగా మారతాయనే సత్యం అతనికి ఇప్పుడే తెలిసింది. హృదయాన్ని తాకిన అందమైన చూపులు, ఆ అనుభవాలు అంతలోనే అపరిచితమైన పోతాయని అతను ఎప్పుడు అనుకోలేదు. అలాంటి స్థితి తన జీవితంలో వస్తుందనే ఆలోచనే అతనికి ఇప్పటిదాకా రాలేదు.

ఇక్కడ ఈ చరణంలో సాహిర్ ‘పషేమాన్’ అనే ఉర్దూ పదాన్ని వాడారు. ఆ పదానికి ఉన్న లోతు తెలుగులో తీసుకురావడాని సిగ్గు, పశ్చాత్తాపం అనే రెండు పదాలను వాడవలసి వచ్చింది. ఉర్దూలో కొన్ని పదాల లోతు ఒకే పదంతో ఇతర భాషలలో పట్టుకోవడం చాలా కష్టం.

తమ ప్రేమలు ఇష్టాలకు పశ్చాత్తాపపడే స్థితిని అనుభవించినవారికి ఈ వాక్యంలోని లోతు, ఆ నాయకుడి దుఃఖం అనుభవంలోకి వస్తుంది. నాకు వ్యక్తిగతంగా చాలా ప్రియమైన చరణం ఇది.

దీనికి ఆమె ఇచ్చే జవాబు చూడండి..

యార్ జబ్ అజనబీ బనే, ప్యార్ జబ్ బేరుఖీ బనే

దిల్ పె సహ్ జా గిలా న కర్, సబ్సె హస్కర్ మిలా నజర్

మేరే హందం మేరె మెహర్బాన్

దోస్తీ ఇత్తెఫాఖ్ హై,..

దోస్తీ ఇత్తెఫాఖ్ హై,

కల్ భీ ఇత్తెఫాఖ్ థీ ఆజ్ భీ ఇత్తెఫాఖ్ హై

జిందగీ ఇత్తెఫాఖ్ హై

(స్నేహితులు అపరిచితులయి పోయి, ప్రేమ ఉదాసీనతలోకి మారిపోతే మనసుతో భరించు, ఫిర్యాదు చేయకు, అందరితో నవ్వుతూ చూపులు కలుపు, నా స్నేహితుడా, నా ప్రియతమా, ఎందుకంటే స్నేహం యాదృచ్ఛికమే, నీ నిన్న కూడా యాదృచ్ఛికం, నేడు కూడా యాదృచ్ఛికమే, అసలు జీవితమే యాదృచ్ఛికం)

బహుశా ఈ చరణం తరువాత ఇక చెప్పేది వినేది ఏమీ ఉండదన్నట్లుగా ఈ పాట ఈ చరణం తరువాత హఠాత్తుగా ఆగిపోతుంది. సంగీత దర్శకుడు రవి ఈ పాటకు అందించిన సాంగీతం ఈ చరణాల భావాన్ని హృదయానికి మోసుకు వచ్చే తీరు అనుభవించవలసిందే.

చాలా సార్లు మోసపోయిన వ్యక్తులు, ప్రేమను కోల్పోయిన వ్యక్తులు తమ గాథను వినిపించిన తరువాత విన్న వాళ్లు వాళ్లకు జరిగిన అన్యాయానికి సానుభూతి చూపించడం లేదా అవతలి వారిని నిందించడం చూస్తాం. వాళ్లకి ప్రేమ విలువ తెలియదు, నీ విలువ తెలియదు అలాంటప్పుడు నువ్వెందుకు బాధపడతావు అనే అర్థంతో సాంత్వన వచనాలు పలుకుతాము. సాహిర్ కలం అలాంటి తప్పు చేయదు. ఇవన్నీ జీవితంలో భాగం అని చెప్తూనే జీవితాన్ని వాస్తవిక దృష్టితో చూడమంటుంది. అందుకే పై చరణంలో అతని బాధను ఆమె అర్థం చేసుకుంటూనే ఇవన్నీ జరుగుతాయి, స్నేహితులు పరాయి వాళ్లవుతారు, ప్రేమ ఉదాసీనతగా మారుతుంది. కాని దాన్ని భరించు, ఫిర్యాదు చేయకు అందరితో నవ్వుతూ ఉండు ఎందుకంటే నీకు దొరికిన స్నేహం ప్రేమ కూదా యాదృచ్చికమైనవే. అవి అలా వచ్చాయి అలాగే వెళ్లిపోతాయి. అదే నిజం. ఈ జీవితమే యాదృచ్ఛికంగా దొరికినది. ఇక ఇందులో ఏది శాశ్వతం, ఏది నిజం? ఏది నీ సొంతం. అన్నీ వచ్చి వెళ్లిపోయే స్థితులే. నీకు దొరికిన ఆ నిన్నలోని ఆనందం యాదృచ్ఛికమే, నేటి విషాదం యాదృచ్ఛికమే, ఎందులోనూ నీ ప్రమేయం లేదు. అందుకే తామరాకు మీద నీటి బొట్టులా ఉండిపో.. అన్ని అనుభవాలు నీ నుండి, నీలో నుండి వీడిపోతూ ఉంటే గమనించు, అన్ని స్థితులలోనూ కేవలం ప్రేక్షకుడిగా మిగిలిపో.

ఇది ఓ క్లబ్ డాన్సర్ పాడే పాట. ఓ పార్టీలో ఓ నాట్యగత్త ఇతరులను రంజింపచేయడానికి పాడిన పాట. సాహిర్ దీన్ని ఇంత లోతైన గీతంగా మార్చగలిగారంటే, పాట పట్ల ఆయనకున్న నిబద్ధత అర్థం అవుతుంది. స్త్రీని అది పురుషులను రంజింపచేసే వృత్తిలో ఉన్న స్త్రీలో ఇంత పరిపక్వతను లోతైన ఆలోచనను, జీవితాన్ని అర్థం చేసుకోగలిగిన తాత్వికతను నింపడం ఆయనకే చెల్లింది. క్లబ్ డాన్సర్లకు, నాట్యగత్తెలకు సినిమాలలో చాలా మంది కవులు రాసిన పాటలను గమనించండి. ఆ పాత్రలను ఎలాంటి సామాజిక, మానసిక స్థాయిలో వాళ్లు ఉంచేసారో అర్థం అవుతుంది.

కాని సాహిర్ ప్రత్యేకంగా ఇలాంటి స్త్రీల వైపు నిలబడి వారి గొంతుకతో గొప్ప జీవిత సత్యాలను చెప్పిస్తారు. చాలా సందర్భాలలో అందమైన నాయికల కంటే కూడా ఉదాత్తమమైన వ్యక్తిత్వాన్ని ఆయన తన పాటల ద్వారా ఆ స్త్రీలకు ఆపాదించారు. ఆయన చూపిన ఈ విశాలత్వం, ఈ దూరదృష్టి స్త్రీని కేవలం రంజింపచేసే వస్తువుగా చూడ నిరాకరించిన ఆయన అభ్యుదయం నాకు చాలా చాలా ఇష్టం. సాహిర్ రాసిన ఏ క్లబ్ గీతమైయినా అత్యంత గొప్ప తాత్వికతతో గుబాళిస్తుంది. జీవితంలో ఎవరు ఏ స్థితికి చేరారన్నది కూడా యాదృచ్ఛికమే. అందులో ఎవరి గొప్పా లేదు, ఎవరి స్వీయ నిర్ణయమూ లేదు. జీవితమే యాదృచ్ఛికం అయినప్పుడు సమాజంలో ఈ సామాజిక స్థాయి భేధాలు, గొప్ప బీద తారతమ్యాలు, వృత్తికి సంబంధించిన మర్యాదలు అన్నీ అర్థం లేనివి.

మానవ జీవితాన్ని చర్చించిన ఎన్నో గొప్ప పాటలు ఉన్నాయి. కాని నాకు ఇది చాలా ఇష్టమైన గీతం. జీవితాన్ని ఇంత గొప్పగా చిత్రించిన సాహిర్ అంటే పట్టరాని అభిమానం. ‘జిందగీ ఇత్తెఫాక్ హై’ అనుకుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. చాలా కోపాలు, ఫిర్యాదులు పటాపంచలైపోతాయి.

కోయి రుత్ భీ సజా నహీ, క్యా హొ కబ్ కుచ్ పతా నహి

గమ్ ఫజూల్ హై గం న కర్, ఆజ్ తో జష్న్ కమ్ న కర్

మేరె హమ్దం మేరే మెహర్బాన్

హర్ ఖుషీ ఇత్తెఫాక్ హై..

ఇంతకు మించిన జీవిత సత్యం మరొకటి ఉండదేమో..

Images Source: Internet

(మళ్ళీ కలుద్దాం)

సినిమా క్విజ్-120

0

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. గుత్తా రామినీడు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., భానుమతి, రామకృష్ణ, హరనాథ్, జమున నటించిన ‘పల్నాటి యుద్ధం’ (1966) సినిమాకి ఎస్. రాజేశ్వరరావు సంగీతం అందించారు. ఈ చిత్రానికి కథ, మాటలు సమకూర్చినదెవరు?
  2. జి. విశ్వనాథం దర్శకత్వంలో ఎన్.టి.ఆర్. (ద్విపాత్రాభినయం), రాజశ్రీ, జయలలిత, రాజనాల, పద్మనాభం నటించిన ‘గోపాలుడు భూపాలుడు’ (1967) సినిమాకి ఎడిటర్ ఎవరు?
  3. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో కృష్ణ, రామ్‍మోహన్, కాంచన, సుకన్య నటించిన ‘ప్రైవేటు మాస్టారు’ (1967) సినిమాకి ముళ్ళపూడి వెంకట రమణ సంభాషణలు అందించగా, కథ అందించినదెవరు?
  4. దాదా మిరాశి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., భానుమతి, కృష్ణకుమారి, హరనాథ్, నాగయ్య, శోభన్ బాబు నటించిన ‘పుణ్యవతి’ (1967) సినిమాకి డా. నిహర్ రంజన్ గుప్తా కథ అందించిన ఏ హిందీ సినిమా ఆధారం?
  5. డి. యోగానంద్ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., జయలలిత, రాజనాల నటించిన ‘బాగ్దాద్ గజదొంగ’ (1968) సినిమాలో బాగ్దాద్ సుల్తాన్ పాత్రలో నటించినదెవరు?
  6. బి. విఠలాచార్య దర్శకత్వంలో ఎన్.టి.ఆర్. (ద్విపాత్రాభినయం), దేవిక, జయలలిత, రాజనాల నటించిన ‘గండికోట రహస్యం’ (1969) సినిమాకి ఎం.జి.ఆర్. నటించిన ఏ తమిళ చిత్రం మూలం?
  7. తమిళంలో వచ్చిన ‘జీవనాంశం’ అనే చిత్రం ఆధారంగా, సి.ఎస్. రావు దర్శకత్వంలో, కృష్ణ, కృష్ణంరాజు, విజయనిర్మల నటించిన 1970 నాటి చిత్రం ఏది? (క్లూ: ‘ఈ చిన్నది లేత వయసుది ఎవరిది, ఎవరిది’ అనే పాట ఈ సినిమాలోదే)
  8. తాపీ చాణక్య దర్శకత్వంలో జగ్గయ్య, జమున, కృష్ణంరాజు, శోభన్ బాబు నటించిన ‘బంగారు తల్లి’ (1971) సినిమాకి ఏ హిందీ చిత్రం మూలం?
  9. ‘గజ్జె పూజె’ అనే కన్నడ చిత్రం ఆధారంగా, వి. మధుసూదన్ రావు దర్శకత్వంలో శోభన్ బాబు, కాంచన, జగ్గయ్య, అంజలీదేవి నటించిన ‘కళ్యాణ మంటపం’ (1969) చిత్రానికి సంగీతం అందించినదెవరు?
  10. కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వంలో కాంతారావు, అనిత, రాజనాల, విజయలలిత నటించిన ‘గండర గండడు’ (1969) సినిమాలో జలరాక్షసి జులాఫా పాత్రలో నటించినదెవరు?

~

ఈ ప్రశ్నలకు జవాబులను 2024 డిసెంబర్ 24వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 120 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 డిసెంబర్ 29 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 118 జవాబులు:

1.ఎం. ఆర్. రాధ 2. డి. వి. నరసరాజు 3. డి.రామానాయుడు 4. సూర్యకళ 5. యద్దనపూడి సులోచనారాణి 6. పద్మనాభం 7. కె.వి.ఎస్. శర్మ 8. గుమ్మడి. 9. మిక్కిలినేని 10. హరనాథ్

సినిమా క్విజ్ 118 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • మంజుల దత్త కె., ఆదోని
  • పి.వి.రాజు, హైదరాబాదు
  • రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
  • రామలింగయ్య టి, తెనాలి
  • సునీతా ప్రకాశ్, బెంగుళూరు
  • శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

గమనిక:

  1. సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.
  2. ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  3. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.

సిరివెన్నెల పాట – నా మాట – 75 – నిద్రాణమై ఉన్న మానవత్వాన్ని తట్టిలేపే పాట

2

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

నువ్వెవరైనా నేనెవరైనా

~

చిత్రం: అటు అమెరికా – ఇటు ఇండియా

సాహిత్యం: సిరివెన్నెల

సంగీతం : మాధవపెద్ది సురేష్ చంద్ర

గానం: ఎస్.పి.బాలు

~

పాట సాహిత్యం

పల్లవి:
నువ్వెవరైనా నేనెవరైనా నీ నా నవ్వుల రంగొకటే ఊరేదైనా పేరేదైనా మన ఊపిరి గీతం ఒకటే అలలన్నిటికీ కడలొకటే నదులన్నిటికీ నీరొకటే మనసు తడిస్తే నీ నా చెంపలు నిమిరే వెచ్చని కన్నీరొకటే ॥నువ్వెవరైనా॥

చరణం:
ఏ దేశం వారికి అయినా ఇల ఒకటే, గగనం ఒకటే ఏ భాషలు పలికిస్తున్నా, గొంతులు స్వరతంత్రులు ఒకటే
ఆహారం వేరే అయినా, అందరి ఆకలి ఒకటే ఆకారం వేరే అయినా, ఆధారం బ్రతుకొకటే
నిను నన్ను కన్నప్పుడు మన తల్లుల నొప్పుల తీరొకటే ॥2॥
ఎన్నో రంగుల తెల్లకిరణమై వెలుగుతున్న జీవితమొకటే ॥నువ్వెవరైనా॥

చరణం:
ఏ రూపం చూపెడెతున్నా, ఉలి కదలికలకు శిల ఒకటే
ఏ రాగం వినిపిస్తున్నా, పిల్లన గ్రోవికి గాలొకటే
నీ నాట్యం పేరేదైనా, పాదాలకు కదలిక ఒకటే
ఏ ప్రాంతంలో నువు ఉన్నా, ప్రాణాలకు విలువొకటే
నీకు నాకూ అందరికీ పుట్టుకతో చుట్టరికం ఒకటే ॥2॥
నువ్వు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే ॥నువ్వెవరైనా॥

‘ఏకోహం, బహుస్యాం- ప్రజాయేయేతి’ అని ఉపనిషత్తులు యుగయుగాలుగా చెప్తూనే ఉన్నాయి. తానొక్కడే అయిన భగవంతుడు, అనేకంగా మారి, తనలోని అనంత వైవిధ్యాన్ని ప్రసరించి ఆనందించాలన్న సంకల్పం ప్రకారం ఆ పరతత్వం అనేక అంతస్తులు దిగి వచ్చి పదార్థంగా మారిందట. ఒక చివర పరబ్రహ్మ, మరో చివర పదార్థం. ముందుగా పదార్థం పైన ప్రాణిక స్థాయి ఒత్తిడి తెచ్చిన కారణంగా అందులో అంతర్లీనంగా వున్న ప్రాణశక్తి పదార్థాన్ని కలుపుకొని వృక్ష సంతతి, జీవకోటిగా వెలికి వచ్చింది. ఆ తర్వాత దశలో పదార్థంపై మానసిక ఒత్తిడి ఫలితంగా సకల జీవరాశిపై తెచ్చిన మార్పు ఫలితంగా, పదార్థాన్ని ప్రాణాన్ని కలుపుకొని బుద్ధిజీవి అయిన మానవుడు వెలికి వచ్చాడు.

ఈ మనస్సుకున్న ప్రధాన లక్షణం ఆలోచన, విభజన, సంకల్ప- వికల్పాలు. మేధాశక్తి నిరంతరంగా ఎదగడం వల్ల హేతుదృష్టి అభివృద్ధి చెందింది. హేతువాదంలో మనిషి మూఢాచారాల నుండి బయటపడ్డాడు. సైన్స్‌ అభివృద్ధి చెందింది. దీనివలన అనేక అద్భుతాలు ఆవిష్కరించబడ్డాయి. సాంకేతికత అభివృద్ధి చెందే కొద్దీ, మానవులలోని నైతికత దిగజారి పోవడం ప్రారంభించింది.

ఈ మనస్సుకున్న మరో గుణం ప్రతీదానినీ విడగొట్టి చూడటం. ఈ విడగొట్టి చూడటం అనేది వ్యక్తుల మధ్య, సమాజం మధ్య, జాతుల మధ్య, మతాల మధ్య, వైరాన్ని, వేరు భావాన్ని పెంచి, ఘర్షణలకు దారితీసి, అహానికిలోను చేస్తున్నాయి. సకల సమస్యలకూ అసలు కారణం మానవుడు మానసిక జీవి కావడమే! వ్యక్తుల మధ్య, రాజ్యాల మధ్య, చిచ్చుపెట్టి జాతీయంగా, అంతర్జాతీయంగా మానవులను అది నిట్టనిలువునా చీల్చి వేసింది. ఈనాడు మనకు కన్పించే సమస్యలన్నింటికీ మూలం అదే, వీటన్నింటికీ పరిష్కారం మానవుడు మనస్సును దాటి ఎదగడంలోనే వుంది. అంతవరకూ ఈ సమస్యలకు పరిష్కారం లేదు. మనం ప్రస్తుత ప్రపంచం వైపు దృష్టి సారించి చూస్తే అది సమస్యల వలయంలో పడి కొట్టుకొనిపోతున్నది. ప్రతీ దేశం, ప్రతి సమాజం ఎన్నో సంక్షోభాలతో కునారిల్లుతున్నది. జాతి వివక్షలు, వర్ణవివక్షలు, మత విద్వేషాలు, స్థాయి వివక్షలు, మానవులను పశు ప్రవృత్తి కంటే హీనంగా మార్చి, మన చుట్టూ కనిపిస్తున్న అన్ని దురాగతాలకు మూలమవుతున్నది. స్త్రీలపై జరుగుతున్న దౌర్జన్యాలు, మతాల పేరుతో జరుగుతున్న మారణ హోమాలు వీటికి సజీవ సాక్షాలు! కానీ పశువుగా పుట్టిన మానవుడు పశుపతిగా అంటే భగవంతుడిగా ఎదగాలన్న ఆకాంక్షను సిరివెన్నెల ఒకానొక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

బాహ్య ప్రపంచంలో మనిషి ఆలోచనా పరిధిని దాటిపోయిన ప్రగతి కనపడుతోంది. సాంకేతికంగా మనం చూడని అభివృద్ధి లేదు! పరిధులన్నిటినీ చెరిపేసి, గ్రహాంతర యానం చేయగలుగుతున్నా, అంతరంగ ప్రపంచం వైపు ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నాం. ప్రగతి అనేది ఒక ప్రక్కనే జరుగుతూ, రెండవ ప్రక్కన కుంచించుకుపోవడం వలన సమతుల్యత లోపించి, ప్రపంచంలోని సంక్షోభాలన్నింటికీ మూల కారణమైంది. పరిణామ వికాసం ఒక వైపే జరుగుతూ ప్రపంచం అంగవైకల్యంతో అసహ్యంగా తయారైంది. ప్రపంచంలో ఏ సమాజంలో చూసినా, బలహీనులపై బలవంతుల పెత్తందారీతనం, అవినీతి, లంచగొండితనం, స్వార్థం, భోగలాలసత్వం, దుర్మార్గం, దుర్నీతి, అత్యాచారాలు, జంతు ప్రవృత్తి. ఇదంతా చూసి మానవత్వం సిగ్గుతో తలదించుకుంటున్నది. మృగంలోంచి మానవుడు వచ్చాడంటాడు డార్విన్‌. కానీ ఈనాడు మనిషిలోంచి మృగం సంపూర్ణంగా బయటికి వస్తోంది. దీనికంతటికీ కారణం పరిణామ క్రమం ఒకచోట ఆగిపోవడం కాక, ఇప్పుడు అది తిరోగమనంలో ఉంది. సృష్టిలో మానవుడితో పరిణామ క్రమం ఆగిపోకూడదు. అతడింకా ముందుకు సాగాలి. ఆదిమ మానవుడు, యాంత్రిక మానవుడయ్యాడు, సాంకేతిక మానవుడయ్యాడు. అంతటితో ఆగిపోయి, ముందుకు సాగే దారి అర్థం కాక మరలా వెనక్కు తిరిగి మృగ ప్రాయుడవుతున్నాడు.

ఇటువంటి పరిస్థితిలో, మృగం నుండి మళ్లీ అసలైన మానవుడు బయటికి రావాలంటే, మానవ జీవిత పరమార్థం తెలుసుకొని, ఆ దిశగా అడుగులు వేయాలి. మత గ్రంథాలను సరైన కోణంలో అర్థం చేసుకొని, భగవంతుని తత్వాన్నిగ్రహించగలగాలి. ఎదుటి ప్రాణిలో, మనిషిలో, తనను తాను చూసుకోగలిగితే.. ఈ సమస్యలన్నీ అంతమైపోతాయి. అలాంటి జ్ఞానాన్ని పంచే సాహిత్యం కూడా మన ఆలోచనపై దాని ప్రభావాన్ని చూపించగలుగుతుంది. ఉదాహరణకు,

పసుల వన్నె వేరు పాలెల్ల ఒక్కటి
పుష్పజాతి వేరు పూజ ఒకటి
దర్శనంబులారు దైవంబు ఒక్కటె
విశ్వదాభిరామ! వినుర వేమ!

మనుష్యులంతా ఒక్కటే. పశువులు వేరువేరు రంగులలో ఉన్నప్పటికీ అవి ఇచ్చే పాలు మాత్రం తెల్లగానే ఉంటాయి. అలాగే మనుషులు వివిధ వర్ణాల వారైనా మనసులు ఒకటిగా మసలుకోవాలంటాడు వేమన. పూవులు వేరువేరు రంగులతో ఉన్నా పూజకు వినియోగపడటంలో అవన్నీ ఒక్కటే గదా! అని మరో ఉపమానాన్ని జోడిస్తాడు.

అటు అమెరికా ఇటు ఇండియా చిత్రంలోని, ‘నువ్వెవరైనా నేనెవరైనా’, అనే పాట ద్వారా ఈ ఆధునిక సమాజానికి ఇటువంటి అత్యంత విలువైన సాహిత్యాన్ని అందిస్తున్నారు సిరివెన్నెల.

పల్లవి:
నువ్వెవరైనా నేనెవరైనా నీ నా నవ్వుల రంగొకటే ఊరేదైనా పేరేదైనా మన ఊపిరి గీతం ఒకటే అలలన్నిటికీ కడలొకటే నదులన్నిటికీ నీరొకటే మనసు తడిస్తే నీ నా చెంపలు నిమిరే వెచ్చని కన్నీరొకటే ॥నువ్వెవరైనా॥

అన్ని అరాచకత్వాలకు మూలమైన వైషమ్యాలు దూరమై పోవాలంటే, మానవులంతా ఒకటే! అనే అత్యంత గొప్ప సత్యాన్ని తెలుసుకోవాలంటున్నారు సిరివెన్నెల. మానవులందరి ఊపిరి పాడే ప్రాణ గీతం అందరికీ ఒకటేననీ, ఎవరు నవ్వినా ఆ నవ్వులు పూచే రంగులు ఒకటేనని, సముద్రంలో ఎన్ని లక్షల కెరటాలు ఎగిరెగిరి పడుతున్నా, వాటన్నిటికీ మూలమైన సముద్రం ఒకటేనని, ఇన్ని జీవాత్మలకు మూల కారణమైన పరమాత్మ ఒకడేనని, వేదాంత సారాన్ని మనకు అందిస్తున్నారు. మనసును తాకే భావోద్వేగాలు కలిగినప్పుడు, ఎవరి చెంపల మీదికైనా జారే కన్నీటికి కూడా ఎలాంటి భేదము లేదని, మానవులు ఎన్ని రకాల భేదాలను ఎందుకు సృష్టించుకున్నారు అనే ఆవేదనను పలికిస్తున్నారు సిరివెన్నెల. ‘Where the world has not been broken up into fragments by domestic walls..

Where words come out from the depth of truth..’ అలాంటి స్వర్గంలోకి నా ప్రజలందరికీ నడిపించు భగవంతుడా, ‌అని రబీంద్రనాథ్ ఠాగూర్ కోరుకున్నట్టు, సిరివెన్నెల కూడా అలాంటి అభిమతాన్నే వెలిబుచ్చుతున్నారు.

Oneness of humanity poem లో Abdul Wahab ఇలానే అంటున్నారు..

Oneness of humanity poem లో Abdul Wahab ఇలానే అంటున్నారు..
Oh, teacher
Be a student for a day
Let me teach you before any thing
The unity of humanity…
From outside we may appear black or white
But we are all like water melon, red
Inside.

We may wear different clothes designed or undersigned
Built differently
Eat different foods
Belong to different religions
But we suffer the same pain
When we are thirsty, hungry or hurt..
…….

చరణం:
ఏ దేశం వారికి అయినా ఇల ఒకటే, గగనం ఒకటే ఏ భాషలు పలికిస్తున్నా, గొంతులు స్వతంత్రులు ఒకటే
ఆహారం వేరే అయినా, అందరి ఆకలి ఒకటే ఆకారం వేరే అయినా, ఆధారం బ్రతుకొకటే
నిను నన్ను కన్నప్పుడు మన తల్లుల నొప్పుల తీరొకటే
ఎన్నో రంగుల తెల్లకిరణమై వెలుగుతున్న జీవితమొకటే ॥నువ్వెవరైనా॥

విశ్వ మానవ ఏకత్వాన్ని అనేక విధాలుగా ఉదహరిస్తూ, సిరివెన్నెల ఈ చరణాన్ని మనకు అందిస్తున్నారు. ప్రపంచంలో మానవాళికంతా, భూమి, ఆకాశం, గాలి, నీరు, ఒకటేనని.. వీణలో ఉన్న ఒకే స్వరతంత్రి భిన్న రాగాలు పలికించినట్లే, ఎన్ని వేల భాషలు మాట్లాడినా, ఆ భాషలను పలికిస్తున్న స్వరతంత్రులు కూడా ఒకటేనని అందమైన ఉపమానాలను ఆయన అందిస్తున్నారు.

ఆకలిని తీర్చుకునే ఆహార పదార్థాలు భిన్నభిన్నమైనప్పటికీ, ఆకలి అందరికీ సమానమే అంటున్నారు. ఏ దేశంలో ఏ జాతి తల్లి పురుడు పోసుకున్నా, ఆ పురిటి నొప్పుల్లో ఎలాంటి భేదాలు లేవంటున్నారు. అన్ని రంగులు మిళితమైతే ఒకే శ్వేత వర్ణం ఏ రకంగా దర్శనమిస్తుందో, అలా ఎన్నో రంగుల తెల్ల కిరణంలా పలు సమూహాల మానవుల జీవితాలు వెలుగుతున్నాయని హితోపదేశం చేస్తున్నారు సిరివెన్నెల. ఇదే భావాన్ని మనం మరో వేమన పద్యంలో కూడా చూడగలం.

పని తొడవులు వేరు బంగారమొక్కటి
పరగ పుటలు వేరు ప్రాణమొక్కటి
అరయ తిండ్లు వేరు ఆకలి యొక్కటి
విశ్వదాభిరామ! వినుర వేమ!

వృత్తి కళాకారుని పనితనంలో రూపొందే ఆభరణాలు ఎన్ని రకాలైనప్పటికీ, దానికి వాడే మూల పదార్థమైన బంగారం ఒక్కటే. శరీరాలు వేరు వేరు కాని వాటిలో కదలాడే ప్రాణం ఒక్కటే. ఆహారాలు అనేకమైనా, వాటిని కోరే ఆకలి మాత్రం ఒక్కటే అని అర్థం. ప్రజాకవి వేమన లాగా, ఆధునిక ప్రజాకవి సిరివెన్నెల మనకందిస్తున్న అపురూపమైన సాహిత్యమిది.

We are one, living in one place wearing different faces
We walk different paths but we all walk the same grass
The unity of our species is often forgotten
Just how lucky we have been to have gotten one another…. అన్నది Luxnor సందేశం.

చరణం:
ఏ రూపం చూపెడెతున్నా, ఉలి కదలికలకు శిల ఒకటే
ఏ రాగం వినిపిస్తున్నా, పిల్లన గ్రోవికి గాలొకటే
నీ నాట్యం పేరేదైనా, పాదాలకు కదలిక ఒకటే
ఏ ప్రాంతంలో నువు ఉన్నా, ప్రాణాలకు విలువొకటే
నీకు నాకూ అందరికీ పుట్టుకతో చుట్టరికం ఒకటే
నువ్వు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే ॥నువ్వెవరైనా॥

ఎన్ని రకాల శిల్పాలు రూపుదిద్దుకున్నా, శిల – వాటిపై తన విన్యాసం చేసిన ఉలి, ఒకటేనని తెలుసుకోమంటున్నారు. పిల్లనగ్రోవి ఎంత మధురమైన రాగాలను, ఎన్ని రాగాలను పలికించినా, గాలే ఆ మాధుర్యానికి మూలం. ఎన్నో పేర్లతో ప్రఖ్యాతి పొందిన ప్రపంచంలోని అన్ని నాట్యాలకు పదవిన్యాసమే మూలం కదా! ఏ కులానికి, ఏ మతానికి, ఏ జాతికి చెందిన వారైనా.. అందరి ప్రాణం విలువ ఒకటే.

నేను, నాది, నాకు, నన్ను, నువ్వు, నీది, నీకు, నిన్ను.. అనే అష్ట మాయను ఛేదించగలిగితే, మనం ఎవరో మనకు అర్థం అవుతుందని, తేజ్ గురు సర్ శ్రీ అంటారు. నీకు నాకూ అందరికీ పుట్టుకతో చుట్టరికం ఒకటే కాబట్టి, నువ్వు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే అనే విశ్వ మానవ తత్వాన్ని మనకు ఎంతో సరళంగా వివరిస్తున్నారు సిరివెన్నెల.

మనిషి తన మూలాలు మరిచిపోవడం వల్లనే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఎంతో ఆనందంగా జీవించాల్సిన మానవ సమాజం, ఉద్రేకాలతో, ఒత్తిళ్లతో, అర్థంపర్థం లేని ప్రగతితో, వినాశకర పోకళ్ళతో సతమతమైపోతోంది. ఇవన్నీ కలిసి మనిషి మనిషి మధ్య పడగొట్టలేనంత బలమైన ఇనుప గోడలను నిర్మిస్తున్నాయి. అన్ని అనర్థాలకు కారణమవుతున్నాయి. మానవుల అనుసరిస్తున్న అన్ని బేధ భావాలకు చరమగీతం పాడాలనీ, ప్రతి అంశంలోను స్పష్టంగా కనిపిస్తున్న ఏకత్వాన్ని, మూల రూపాన్ని మానవులు గమనించడం, అనుసరించడం అలవాటు చేసుకోవాలనీ గీతోపదేశం చేస్తున్నారు సిరివెన్నెల. మానవుల దృష్టి కోణంలో మార్పు వచ్చినప్పుడే మనిషి మృగంలా కాకుండా, మనిషిగా ఎదిగే ద్వారం తెరుచుకుని, విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని సోపానాలు వేస్తూ, విశ్వశాంతికి దారితీస్తుందన్నది సిరివెన్నెల గారి బలమైన సందేశం. పుట్టుకతో మనందరి చుట్టరికం ఒకటే అన్న సున్నితమైన సత్యాన్ని చాటి చెబుతూ మనలో నిద్రాణమై ఉన్న మానవత్వాన్ని సుతారంగా తట్టిలేపుతుంది అద్భుతమైన ఈ గీతం.

Images Source: Internet

అలనాటి అపురూపాలు – 251

0

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

బెంగాలీ సంగీత దర్శకుడు, స్వరకర్త, జానపద గాయకుడు కమల్ దాస్‌గుప్తా:

కోమోల్ దాస్ గుప్తా లేదా కమల్ దాస్‍గుప్తా లేదా కమాల్ ఉద్దీన్ అహ్మద్ (28 జూలై 1912 – 20 జూలై 1974) ఇరవయ్యవ శతాబ్దపు బెంగాలీ సంగీత దర్శకుడు, స్వరకర్త, జానపద కళాకారుడు. రాగం, ఠుమ్రి వారి సంగీతంలో ప్రధాన అంశాలు. ఆయన భార్య ఫిరోజా బేగం (1930-2014) నజ్రుల్ సంగీత గాయని. వారి రెండవ, మూడవ కుమారులు హమిన్ అహ్మద్, షఫిన్ అహ్మద్ బంగ్లాదేశ్ బ్యాండ్ మైల్స్‌లో ప్రధాన గాయకులు.

కోమోల్ దాస్ గుప్తా 28 జూలై 1912న అప్పటి బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం బంగ్లాదేశ్)లోని జెస్సోర్‌లోని నరైల్‌లో జన్మించారు. ఆయన 1928లో కలకత్తా అకాడమీ నుండి మెట్రిక్యులేషన్ చదివారు, తరువాత కొమిల్లా విక్టోరియా ప్రభుత్వ కళాశాల నుండి బి.కామ్ పూర్తి చేశారు. భజనల స్వరకర్త, గాయని మీరాబాయిపై చేసిన పరిశోధనకి 1943లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో డాక్టరేట్ పొందారు. వారికి ప్రారంభ ప్రేరణ తండ్రి తారా ప్రసన్న దాస్‌గుప్తా నుండి లభించింది. ఆయన తన తొలి సంగీత పాఠాలను తన సోదరుడు బిమల్ దాస్ గుప్తా నుండి నేర్చుకున్నారు. తరువాత అతను దిలీప్ కుమార్ రాయ్, కానా కేస్తా, ఉస్తాద్ జమీరుద్దీన్ ఖాన్ దగ్గర నేర్చుకున్నారు.

కోమోల్ దాస్ గుప్తా బహుముఖ సంగీత మేధావి. అతను బెంగాలీ, ఉర్దూ, హిందీ, తమిళంలో ఆధునిక పాటలు పాడారు. దాదాపు ఎనిమిది వేల పాటలకు సంగీతాన్ని సమకూర్చిన ఆయన అద్భుతమైన స్వరకర్త కూడా. వారి పని శాస్త్రీయ సంగీతంపై ఆధారపడింది, ఠుమ్రీ శైలి వైపు మొగ్గు చూపింది. అయినప్పటికీ ఆయన ఇతర వనరుల నుండి కూడా ప్రేరణ పొందారు.

కోమోల్ దాస్ గుప్తా దాదాపు ఎనభై బంగ్లా చిత్రాలకు సంగీతం అందించారు, వాటిలో తుఫాన్ మెయిల్, ఝమెలార్ ప్రేమ్, ఈ కి గో షెస్ డాన్ ముఖ్యమైనవి. సంగీత దర్శకుడిగా అతని చివరి చిత్రం బధు భరన్ (1967). ‘వార్ ప్రాపగాండా’ అనే అమెరికన్ చిత్రానికి నేపథ్య సంగీతాన్ని కూడా సమకూర్చారు. స్వరకర్తగా అతని దాదాపు పద్నాలుగు సంవత్సరాల క్రియాశీలకంగా ఉన్నారు. స్వరలిపి (నోటేషన్స్) కోసం సంక్షిప్తలిపి పద్ధతిని (షార్ట్‌హ్యాండ్) కనిపెట్టడం సంగీతానికి ఆయన చేసిన విశేష కృషి అని చెప్పుకోవాలి.

 

1935లో కోమల్ దాస్ గుప్తా గ్రామోఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియాలో సంగీత దర్శకుడిగా చేరారు. అక్కడ తన పదవీకాలంలో, అతను కాజీ నజ్రుల్ ఇస్లాంతో సన్నిహిత అనుబంధాన్ని పెంచుకున్నారు. అతని నాలుగు వందల పాటలకు పైగా సంగీతాన్ని సమకూర్చారు. కమల్ దాస్ గుప్తా సంగీతం అందించిన గ్రామఫోన్ రికార్డులు 1950, 1960 దశకాలలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఆయన పాటల్లో ‘సంజేర్ తారకా అమీ’ (నేను సంధ్యా నక్షత్రం), ‘పృథివీ అమరే ఛాయ్’ (ప్రపంచానికి నా అవసరం ఉంది), ‘అమీ భోరేర్ జూతిక’ (నేను ఉదయపు మల్లెపూవును) నేటికీ సుప్రసిద్ధం.

1956లో ఇస్లాం స్వీకరించి కమల్ ఉద్దీన్ అహ్మద్‌గా పేరు తెచ్చుకున్నారు. అదే సంవత్సరంలో ప్రఖ్యాత నజ్రుల్ సంగీత గాయని ఫిరోజా బేగంను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమారులు తహసిన్ అహ్మద్, హమీన్ అహ్మద్, షఫిన్ అహ్మద్. చివరి ఇద్దరు కూడా ప్రముఖ గాయకులే.

కమల్ దాస్ గుప్తా 20 జూలై 1974న ఢాకాలో మరణించారు.

ఆయన సంగీతమందించిన హిందీ చిత్రాలు:

  • జవాబ్ (1942)
  • హాస్పిటల్ (1943)
  • రాణి (1943)
  • మేఘ్‌దూత్ (1945)
  • అరేబియన్ నైట్స్ (1946)
  • బిందియా (1946)
  • కృష్ణ లీల (1946)
  • జమీన్ ఆస్మాన్ (1946)
  • ఫైస్లా (అనుపమ్ ఘటక్‌తో) (1947)
  • గిర్‌బాలా (1947)
  • మన్మణి (1947)
  • చందర్ శేఖర్ (1948)
  • ఇరాన్‌ కీ ఏక్ రాత్ (1949)
  • ఫుల్వారి (1951)

ఆయన సంగీతమందించిన బెంగాలీ చిత్రాలు:

  • పండిట్ మాషి (1936)
  • శేష్ ఉత్తర్ (1942)
  • సహధర్మిని (1943)
  • జోగా జోగ్ (1943)
  • చందర్ కళంక (1944)
  • దంపతి (1944)
  • బిదేష్ని (1944)
  • నందిత (1944)
  • మేఘ్‌దూత్ (1945)
  • భాబీ కాల్ (1945)
  • రంగమతి (1948)
  • అనురాధ (1949)
  • మలంచ (1952)
  • ప్రార్థన (1953)
  • భగవాన్ శ్రీ కృష్ణ చైతన్య (1953)
  • సంధన్ (1953)
  • నబిబిధన్ (1954)
  • బ్రతచారిణి (1955)
  • మనరక్ష (1956)
  • గోవిందదాస్ (1956)
  • మధు మాలతి (1956)
  • బోధు బరన్ (1967)

హిందీ చలనచిత్రం ‘జవాబ్’ (1942)లో, గాయని-నటి కానన్ దేవి, తన అద్భుతమన గానంతో – చంచలమైన, చిన్నపిల్లాడి స్వభావం కల పి.సి. బారువాను నిద్ర పుచ్చుతారు. ఈ పాట ‘ఏయ్ చంద్ చుప్ నా జానా’. గొప్ప సాంత్వననిచ్చే పాట. ప్రస్తుత సమాజంలో చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారు. వారు ఈ పాట వినవచ్చు. పండిట్ మధుర్ సాహిత్యం అందించగా, కమల్ దాస్‌గుప్తా స్వరపరిచిన ఈ లాలిపాట అద్భుతంగా ఉంటుంది.

లింక్:

https://www.youtube.com/watch?v=G2-GkUUwjsg

శ్రీవర తృతీయ రాజతరంగిణి-38

2

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

తృతీయ సర్గ

తదా మాడవరాజ్యస్యా విశోకా శోకదా నదీ।
ప్రదక్షిణేచ్ఛయేవాన్తర్వివేశ విజయేశ్వరమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 13)

ఆ సమయంలో మాడవ రాజ్యానికి శోకప్రదమైన నదిలా భావించే విశోక నది ప్రదక్షిణాలు చేయాలన్న కోరికతో ఉన్నట్టు విజయేశ్వరంలోకి ప్రవేశించింది.

‘నీలమత పురాణం’ ప్రకారం విశోక నది లక్ష్మీస్వరూపం. ఇది కౌండిన్య, క్షీరనది, వితస్తలతో సంగమిస్తుంది. పీర్ పంజాల్ పర్యత శ్రేణులకు ఉత్తరాన ఉన్న ‘బనిహాల్’ వద్ద పరుగులు తీస్తూ ప్రవహిస్తుందీ నది. సౌబంధన్ క్రింద ఉన్న క్రమ సరస్సు కౌసర్‌నాగ్ ప్రదేశాన్ని ఈ నది ఆరంభ స్థలంగా పరిగణిస్తారు. పర్వతాల నుండి క్రిందకు దిగగానే పలు నదులు దీన్లో కలుస్తాయి. పూర్వ కరాల్, దేవసరస్ ప్రాంతాలలో ఈ నదీప్రవాహం వల్ల పంటలు పండుతాయి. విశోక అంటే శోకం లేనిది. కానీ ఈ నదిని శోకానికి కారణంగా భావిస్తారని చెప్పటం ఓ చమత్కారం.

విజయేశ్వరం, శారదాపీఠంతో సమాన స్థాయి, పవిత్రత, ఆదరణలు పొందిన మందిరం. కానీ సికందర్ బుత్‍షికన్ కాలంలో ఈ మందిరం ధ్వంసం అయింది. అయినా సరే, విజయేశ్వరానికి ప్రదక్షిణం చేయాలన్న కోరికతో విశోక నది విజయేశ్వరంలో ప్రవేశించింది అంటున్నాడు, శ్రీవరుడు. అంటే, నాశనమైనా, విజయేశ్వరం ప్రఖ్యాతి కానీ, ప్రతిష్ఠ కానీ, ఆదరణ కానీ శ్రీవరుడి కాలానికి ఏ మాత్రం తగ్గలేదన్న మాట. అదీగాక, విధ్వంసానికి గురైనా ఆ ప్రాంతాన్ని ఇంకా పవిత్రంగా భావిస్తున్నారన్న మాట. విశోక నది విజయేశ్వర ప్రదక్షిణ కోసం విజయేశ్వరంలోకి ప్రవేశించటం ఒక రకంగా చూస్తే, ధ్వంమైన ఆలయాన్ని శ్రీవరుడు తలచుకుంటూనే ఉన్నాడన్న ఆలోచన వస్తుంది. ధ్వంసమైన ఆలయాలు తమ ఓటమికి, చేతకానితనానికి, న్యూనతా భావానికి నిదర్శనంగా భావిస్తున్నట్టు తోస్తుంది. బహుశా, ఆ కాలంలో ఆలయం ధ్వంసమైనా ఆ ప్రాంతాన్ని పవిత్రంగా భావిస్తూనే ఉన్నట్టున్నారు కశ్మీరీయులు. కశ్మీరీయులే కాదు, భారతదేశంలోని ప్రతి ప్రాంతంలోనూ ఇలా ధ్వంసమయిన గుడుల జ్ఞాపకాలను తాజాగా వుంచుకోవటం, ఆ గుడులను పునరుధ్ధరించాలని ప్రయత్నించటం కనిపిస్తుంది. అనేక ప్రాంతాలలో పలు కారణాలవల్ల ఈ ప్రయత్నాలు విస్మృతిలో పడ్డాయి. ఇంకొన్ని ప్రాంతాలలో, ఈ జ్ఞాపకాలు ఆచారాలు, సాంప్రదాయాల రూపంలో వున్నాయి కానీ, ఆ ఆచారాలు ఏర్పడటం వెనుక వున్న చారిత్ర మరుగునపడింది. ఎందుకు పాటిస్తున్నారో తెలియకుండా వాటిని పాటిస్తున్నారిప్పటికీ. ఉదాహరణకు, రాజమహేంద్రవరంలో ఒక కుటుంబంలో పెళ్ళి సంబరాలలో భాగంగా గుర్రం మీద ఊరేగుతూ, కత్తి తిప్పుతూ ఓ మసీదువరకూ వెళ్ళి వెనక్కివస్తారు. దీని వెనుక వున్న కథ ఏమిటంటే, ఒకప్పుడీ కుటుంబం ఆధ్వర్యంలో వున్న మందిరాన్ని ధ్వంసంచేసి ఆ స్థానంలో మసీదు నిర్మించారు. ఆ సమయంలో ఆ కుటుంబం వారు, ఏనాడయినా ఆ మసీదు స్థానంలో గుడిని పునరుధ్ధరిస్తామని ప్రతిజ్ఞ పట్టారు. అప్పుడేర్పడిందీ ఆచారం. తరాలు మారుతున్నకొద్దీ అసలు విషయం మరుగునపడి, మసీదువద్దకు కత్తి తిప్పుకుంటూ ఊరేగింపుగా వెళ్ళటం మిగిలివుంది. ఇలాంటి గాథలు ఎన్నోవున్నాయి దేశవ్యాప్తంగా!!!

భారతదేశ చరిత్రను గమనిస్తే, సుల్తానుల పాలనాకాలంలో పెర్షియన్ భాషలో రచించిన గ్రంథాలలో కూలగొట్టిన మందిరాలతో పాటూ, పునర్నిర్మించిన మందిరాలను మళ్ళీ మళ్ళీ కూలగొట్టిన వివరాలూ కనిపిస్తాయి. మందిరాలను ఎన్నిసార్లు కూలగొడితే అన్నిసార్లు పునర్నిర్మాణాలు సాగిన సంఘటనలూ లభిస్తాయి. కూలిన మందిరాల స్థానంలో మసీదులు వెలిసిన తరువాతనే పునర్నిర్మాణాల ప్రయత్నాలు ఆగేవి. కుబేర్నాథ్  సుకుల్ రచించిన వారణాసి వైభవ్ పుస్తకంలో ఒక అధ్యాయం మొత్తం వారణాసిలో పలుమార్లు ధ్వంసమయి, పునర్నిర్మాణమయి, మళ్ళీ ధ్వంసమయిన మందిరాలు, ఒక ప్రాంతంనుంచి మరో ప్రాంతానికి మారిన మందిరాలు, తీర్థాల  గురించివుంది. సుకుల్ ప్రకారం  12 నుండి  17వ శతాబ్దాల నడుమ వారణాసిలోని ప్రధానమందిరాలన్నీ అయిదుమార్లు ధ్వంసమయ్యాయి. పునర్నిర్మాణమయ్యాయి.  ఒక్కవారణాసి చరిత్ర ఇది. దేశమంతా ఇంతకన్నా తీవ్రస్థాయిలో విధ్వంసం పునర్నిర్మాణాలు సాగాయి. దీన్నిబట్టి చూస్తే, సికందర్ బుత్ షికన్ నాశనం చేసిన విజయేశ్వర మందిరాన్ని శ్రీవరుడు పవిత్రంగా భావించి, ఆ గుడికి ప్రదక్షిణలు చేసేందుకు వరదనీరు ఆ ప్రాంతంలో ప్రవేశించిందని అనటం సమంజసమే కాదు, మందిరాన్ని పునర్నిర్మించి ఆ స్థలం పవిత్రతను పునరుద్ధరించాలన్న ఆకాంక్ష అతని మనసులో వుందని ఊహించటం అనౌచిత్యం కాదని అనిపిస్తుంది.

స్నానాత్ పాపహరీ పూర్వప్రవాహోపగతా నదీ।
ఇతీవ తజ్జలే తూర్ణం మమజ్జుర్గ్రుహపంక్తయః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 14)

తమ పాపాలను ప్రక్షాళణ  చేసుకునేందుకు విశోక నదిలో స్నానమాడాలని దూకినట్టు అనేక ఇళ్ళు నదిలో మునిగాయి.

నదీస్నానం పవిత్రం. పాపాలు ప్రక్షాళన అవుతాయి. అందుకని విజయేశ్వరం లోని ఇళ్ళు తమ పాపాలను కడిగి వేసుకోవటానికి తమ దగ్గరకు వస్తున్న విశోక నదిలో మునకలు వేశాయట. భారతదేశంలో కర్మ సిద్ధాంతం అణువణువునా విస్తరించింది. తమకు ఏదైనా చెడు జరిగితే ‘ఎందుకిలా?’ అనే ప్రశ్న కన్నా, ముందు ‘పూర్వజన్మలో ఏదో పాపం చేశాను, అందుకే నాకు ఇలాంటి కష్టం వచ్చింది’ అనుకుంటాం. ‘ఏం పాపం చేశానో’ అంటూ బాధపడతాం. ‘విజయేశ్వరం’ ధ్వంసం అయింది. అంటేనే, ఏదో పాపఫలితాన్ని ఆ ప్రాంతం ప్రజలు అనుభవిస్తున్నట్టు. అందుకే పాప ప్రక్షాళన కోసం నదిలో మునకలు వేసినట్టు అక్కడి ఇళ్ళు విశోక నదిలో దూకుతున్నాయనటం ఔచితీమంతం. ఆ కాలంలో ఆలయాల విధ్వంసం పట్ల పైకి ఆవేశాన్ని, నిరసనను ప్రదర్శించకున్నా, వారి మనస్సులలో ఒదిగి ఉన్న ఆవేదన, ఆక్రోశాలను అంతర్లీనంగా ప్రదర్శిస్తుందీ వర్ణన. కవి కాబట్టి ఏదో వర్ణించాడని అనుకునే వీలు లేదు. వర్ణనల వెనుక అనుభూతులుంటాయి. ఆకాంక్షలుంటాయి.  అనుభవాల తాలూకు ఆలోచనలుంటాయి.

పురాణేషు ప్రసిద్ధా యా విశోకా శోకనాశనీ।
తదాభూద్ విపరీతార్థా ప్రజాభాగ్యవిపర్యాయాత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 15)

పురాణాలలో విశోక నదిని శోకనాశినిగా వర్ణించారు. కానీ ప్రజల దౌర్భాగ్యం వల్ల విశోక నది తన పేరుకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తోంది.

విశోక నది లక్ష్మీస్వరూపం. లక్ష్మి దుఃఖాన్నివ్వదు. సుఖసంతోషాలనిస్తుంది. కానీ లక్ష్మి తన స్వభావానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దారిద్య్ర్యం, దుఃఖాలు వ్యక్తిని వెన్నంటుతాయి. ఒకప్పటి పురాణాలు ఇప్పుడు వ్యతిరేకంగా ధ్వనిస్తున్నాయన్న శ్లేష అంతర్లీనంగా కనిపిస్తుందీ శ్లోకంలో. పురాణాలు ప్రాభవాన్ని కోల్పోతున్నాయన్న సూచన కూడా కనిపిస్తుంది.

యేభ్య ప్రతిష్ఠా ప్రాప్తా తాన్ దుఃస్థాన్ ద్రష్టుమసాంప్రతమ్।
ఇతీవ తోయే తత్కాలం మమజ్జుర్నగరే గృహాః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 16)

తమను నిర్మించి, ప్రతిష్ఠను ఇచ్చిన వారి దుఃఖాన్ని చూడటం భరించలేక కాబోలు, భవంతులు స్వయంగా జలాలలో నిమజ్జనమయి పోతున్నాయి.

నదీ ప్రవాహా వేగానికి కూలిపోయి నదిలో కలిసిపోతున్న భవంతులు, తమ యజమానుల దుఃఖాన్ని చూడలేక స్వచ్ఛందంగా నది ప్రవాహంలో కలసిపోతున్నట్టున్నాయట.

నదీ ప్రవాహంలో కూలిపోయే భవంతులను చూస్తే అని స్వచ్ఛందంగా కూలిపోతున్నట్లు అనిపిస్తుంది. ఆ దృశ్యాన్ని వివరిస్తున్నాడు శ్రీవరుడు.

శిలాదారూమయీ మగ్నస్తామ్మీభూత చతుర్గ్రుహా।
చతుష్పాదివ ధర్మో యా లోకోత్తరణాకృద్ బభౌ॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 17)

శిలలతో, దారువులతో నాలుగు స్తంభాలు నిర్మించాడు జైనులాబిదీన్. రాజును కలిసేందుకు ప్రజలు ఈ స్తంభాల ఆధారంతో నిర్మించిన వంతెనను దాటి వచ్చేవారు. ఇదెలాగంటే, ప్రజలు చతుష్పాద ధర్మాలను పాటించటం వల్ల నరకం దాటగలుగుతారో, అలాగ ప్రజలు ఈ వంతెన ద్వారా రాజును కలవగలిగేవారు.

‘చతుష్పాద ధర్మ’ అంటే, చర్య, క్రియ, యోగ, జ్ఞానాలు. ఈ నాలుగు దశల ద్వారా వ్యక్తి మోక్షాన్ని పొందుతాడు. ‘చర్య’ అంటే వ్యక్తిత్వం, క్రమశిక్షణ.

తారదాగ్రామ పంక్త్యాశ్చ దర్శనాయ విశాంపతేః।
యాత్రాగతస్య రామస్య సేతుబంధ ఇవాభవత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 18)

తరదా (దారదా) గ్రామాన్ని దర్శించేందుకు వచ్చిన రాజుకు – రాముడికి సేతువులా ఇది ఉపయోగపడింది.

వితస్తాయాం కృతా జైనకదలిః సా గృహోజ్జ్వలా।
జలవేశాత్ తటే మగ్నా భగ్నాద్ యా నగరాన్తరే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 19)

వితస్త నదిపై నిర్మించిన జైన్ కదల్ ఒడ్డున ఉన్న గృహాలు, జలప్రవేశం వల్ల నాశనం అయ్యాయి.

ఒకప్పుడు శోభాయమానంగా ఉన్న గృహాలు, ఇప్పుడు వరద నీటి వల్ల నాశనం అయ్యాయన్న మాట.

శ్రీవరుడు వరదల వల్ల జరగుతున్న వినాశనాన్ని – నీరు ఒక్కక్క మెట్టు పైకి ఎక్కుతున్నట్లు – ఒకటొక్కటిగా వర్ణిస్తూ వస్తున్నాడు..

‘జైన్ కదల్’ అన్నది వితస్త నదిపై జైనులాబిదీన్ నిర్మించిన ఏడు వంతెనలో నాలుగవది.

ఆ కాలంలో ఈ వంతెన ‘నాలుగవ వంతెన’గా ప్రసిద్ధి పొందింది. పూర్వకాలంలో జయాపీడుడు, నిర్మించిన వంతెన స్థానంలో జైనులాబిదీన్ ఈ వంతెనను నిర్మింపచేశాడు.

పాదద్వయావశేపాపి స్థాపితాగ్రే భవిష్యతామ్।
పాదద్వయం పూరయితుం సమాస్యేవ మహీభుజామ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 20)

నాలుగు పాదాలుండాల్సిన వంతెన రెండు పాదాలు నాశనమయ్యాయి. దాంతో భవిష్యత్తులో రాజులయ్యే వారు పూరించాల్సిన సమస్యలా రెండు పాదాలు మాత్రమే ఉన్నాయి.

క్రమరాజ్యే తదా కుర్వన్ కల్లోలైరాకులం జనమ్।
మహా పద్మసరో వేగాదగాద్ దుర్గ పూరాంతరమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 21)

క్రమ రాజ్యంలో ఉన్న సరస్సులు, నదులు ప్రజల జీవితాలలో అల్లకల్లోలం సృష్టించాయి. మహా పద్మసర్ నీళ్ళు వేగంగా దుర్గపురంలోకి ప్రవేశించాయి.

మహా పద్మసర్ ను కొందరు ‘మహాన్ ప్రసార్’గా భావిస్తున్నారు. ఏది ఏమైనా నగరంలోకి నీరు ప్రవేశించిందన్న దానిలో ఎలాంటి వివాదం లేదు. ‘దుర్గాపురం’ ప్రస్తుతం ‘ఉల్లూరు’ సరస్స ఒడ్డున ఉంది.

అన్యః సరోవరః కోపి పద్మనాగ సరోన్తికమ్।
ప్రీత్యా కిమోగతో దూరాద్ యం దృష్ట్వా విశశంకిరే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 22)

ఇతర సరోవరాలు పద్మనాగ సరోవరాన్ని దర్శించేందుకు వచ్చాయా అన్న భ్రమ కలుగుతోంది. నీట మునిగిన నగరాన్ని దూరం నుంచి చూస్తుంటే, ఎటు చూసినా  నీరే  కనిపిస్తోంది. అంటే ఒక సరస్సు, ఇతర సరస్సులు కలసి మొత్తం భూమి అంతా నీరే అయి కనిపిస్తోందన్న మాట. ఇలా అంతా నీరు కనిపిస్తుంటే, ఎలా అనిపిస్తోందంటే, ఒక సరోవరంను కలిసిందుకు అనేక ఇతర సరోవరాలు వచ్చినట్టు.

స్వయముత్పాటయత్యస్మాన్ వృక్షవత్ సహాసాగతః।
ఇతీవ తత్ర వేశ్మాని చిక్షిపుః స్వం జలాంతరే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 23)

నగరంలోని కట్టడాలన్నీ, ఎలాగో ఈ నీళ్లు వృక్షాలను వ్రేళ్ళతో సహా పెకిలించినట్టు తమని కూడా పునాదుల నుండి పెకిలించి వేస్తాయని భావించి తమని తాము నదిలో పారేసుకున్నాయి. అంటే, నదితో పాటు అవి కూడా వృక్షాల్లా కొట్టుకుపోయాయన్న మాట.

దూరే సముద్రో మద్ భర్తా కోయం మే సముపాగతః।
ఇత్థం వితస్తా త్రస్తేవ ప్రతీపమగమత్ తదా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 24)

తన భర్త సముద్రుడు ఎంతో దూరంలో ఉన్నాడు. ఈలోగా తనని ముంచేయటానికి వస్తున్న జలాలను చూసి, ‘వీళ్ళెవరు?’ అని భయంతో వితస్త నది వ్యతిరేక దిశలో ప్రవహించసాగింది.

చక్కటి ఊహాత్మక వర్ణన ఇది.

నది నీరు సముద్రంలో కలవటం ప్రాకృతికం. నది సముద్ర సంగమాన్ని కవులు తమ తమ సంస్కారాన్ని, సృజనాత్మకతలను బట్టి ఊహించారు, కథలు అల్లారు.

నది భర్త సముద్రం అంటున్నాడు శ్రీవరుడు. కిన్నెరసానిని సముద్రుడు మోహించినట్టు విశ్వనాథ ఊహించాడు. పురాణాలు, ధర్మశాస్త్రాలు సందర్భాన్ని బట్టి, తాము చెప్పాలనుకుంటున్న అంశాన్ని బట్టి నదీ సముద్రాల నడుమ సంబంధాన్ని చిత్రిస్తాయి. నదీ ప్రవాహాన్ని మానవ జీవిత ప్రయాణంతో పోల్చి, సముద్ర సంగమాన్ని ‘మోక్షం’ తో పరమాత్మతో లయమవటంతో పోలుస్తాయి ఆధ్యాత్మిక శాస్త్రాలు.

తన భర్త సముద్రం ఎంతో దూరంలో ఉండగా తనతో సమాగమానికి ఉరుకులు పరుగుల మీద వస్తున్న సరస్సుల జలాలను చూసి వితస్త వాటికి దూరంగా వ్యతిరేక దిశలో ప్రవహిస్తోందట!

సీమోజ్ఝితా చలన్మార్గా పక్తాంతం కలాంకితా।
స్థితిః కళియుగస్యేవ భూరభూజ్జలపూరితా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 25)

సరిహద్దులు లేవు, దారుల గుర్తులు లేవు. ఎలాంటి చిహ్నాలు లేక ఎటు చూసినా నీరు తప్ప  మరేమీ కనబడటం లేదు. అయితే, బురద, ఇతర మలినాలతో నిండి – అనేక అవమానాలు, భయాలతో నిండి కళంకిత అయిన నీరు – కలియుగాన్ని తలపుకు తెస్తోంది.

కలియుగం నీతిరహితం, మర్యాదరహితం. కలియుగం అంధకార పూరితం. నిరాశాజనకం. కలియుగంలో నాస్తిక సంప్రదాయాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. కర్తవ్య నిర్వహణ, బాధ్యతలను లెక్క చేయరు. శారీరిక, మానసిక, నైతిక శక్తులు పతనమవుతాయి. అన్నింటినీ ముంచెత్తి, ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. ఆ నీటిలోని మలినాలు, మలినమైన కలియుగాన్ని తలుపుకు తెస్తోంది.

నర్మగర్భితమైన శ్రీవరుడి వర్ణనలు భూత, భవిష్యత్, వర్తమానాలను ఒకే శ్లోకంలో దర్శింప చేస్తున్నాయి. ఇటువంటి వర్ణనలు, శ్రీవరుడు తన రాజతరంగిణిని జైనులాబిదీన్ మరణం తరువాత రాశాడన్న ఆలోచనను బలపరుస్తాయి. జైనులాబిదీన్ మరణం తరువాత కశ్మీరు స్థితికి, ఇప్పుడు శ్రీవరుడు చేసిన వర్ణన సరిపోతుంది.

(ఇంకా ఉంది)