Site icon Sanchika

అమ్మ కడుపు చల్లగా-12

[box type=’note’ fontsize=’16’] అటవీ విస్తీర్ణం తగ్గిపోవటం పర్యావరణంలో కార్బన్ డై ఆక్సైడ్‍ను నియంత్రించగలగడంలో వైఫల్యాలకు పరోక్షంగా కారణమౌతోందని ఈ వ్యాసంలో వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి. [/box]

[dropcap]స[/dropcap]హజ సిద్ధమైన ప్రకృతి వ్యవస్థలకు ముప్పు వాటిల్లినపుడు విపరీతమైన పరిణామాలు సంభవిస్తాయి. అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసంలో భాగంలో అనేక అటవీ ప్రాంతాలలో వన్య సంపదకు తీవ్రమైన ముప్పు ఏర్పడుతోంది. ఇపుడు నరకబడుతున్న అరణ్యప్రాంతాలన్నీ రానున్న కాలంలో కార్బన్ శోషించుకునే స్థాయి నుండి కార్బన్‍ను విడుదల చేసే స్థాయికి చేరిపోనున్నాయని శాస్త్రజ్ఞుల పరిశోధనల ఫలితాలు చెప్తున్నాయి.

అమెజాన్:

‘అమెజాన్’ అడవులు సుమారు 55 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీరణంలో 30 లక్షలకు పైగా మొక్కల జాతులు, లక్షల సంఖ్యలో జంతువులు, అనేక జీవజాతులు, వందల సంఖ్యలో పలు గిరిజన తెగలు వంటి అపురూపమైన వైవిధ్యాలతో అలరారుతున్న ప్రకృతి వ్యవస్థ. ప్రపంచం మొత్తంగా లభించే మంచినీరులో 20%, పరిశుభ్రమైన గాలిలో 20 శాతానికి అమెజాన్ అడవులే కారణం.

కార్చిచ్చులు:

ఇక్కడి గిరిజనులు మలేరియా, కాన్సర్ వంటి వ్యాధులకు వివిధ రకాల మొక్కల భాగాలతోనే చికిత్స చేస్తారు. వీటికి సంబంధించిన 41 రకాల మొక్కలు అమెజాన్ అడవులలోనే ఉన్నాయి. కాన్సర్‍ను నిరోధించగల ఔషధీయ జాతుల మొక్కలలో 70% అమెజాన్ అడవులలోనే ఉన్నాయి. బ్రెజిల్, వెనిజులా, పెరూ, కొలంబియా, బొలీవియా, ఈక్వెడార్ వంటి పలు దేశాలలో విస్తరించి ఉన్న అమెజాన్ అడవులలో 60% వరకూ బ్రెజిల్‍లోనే ఉన్నాయి. అటువంటి బ్రెజిల్‍లో 2019లో రికార్డు స్థాయిలో కార్చిచ్చులు చెలరేగి ఆ పొగ 3000 కిలోమీటర్ల దూరం దాటి విస్తరించింది. కార్చిచ్చులలో సగం అడవి నాశనం కాగా 228 మెగా టన్నులకు సమానమైన కార్బన్ డై ఆక్సైడ్‍తో బాటు విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ కూడా వ్యాపించింది. అమెజాన్స్‌లో అత్యవసర పరిస్థితి విధించి వలసి వచ్చింది.

అమెజాన్ నది:

ఈ నది ఆండీస్ పర్వతాలలో చిన్నగా బయలుదేరి దారిలో 11000 ఉపనదులను కలుపుకుంటూ ప్రవహించి మహానదిగా రూపుదిద్దుకున్న వైనం ఆశ్చర్యకరం. కొన్ని వేల రకాల (సుమారు 2500) మత్స్య జాతులకు అమెజాన్ నది ఆలవాలం. ఈ నదీ జలాలతో కొన్ని లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. ఆండీస్ పర్వత సానువులు బంగారం నిధులకు నెలవు. అమెజాన్ నదీ పరివాహక ప్రాంతాలలో పెరూకు బంగారం, వెండి, జింక్, రాగి వంటి ఖనిజాల తవ్వకం ఆధారంగానే అధిక మొత్తంలో ఆదాయం సమకూరుతోంది. అక్కడి గనుల తవ్వకాలలో సాలీనా లక్షల టన్నుల పాదరసాన్ని అమెజాన్ నదిలో పారబోస్తున్నారు. ‘అమెజాన్ పర్యావరణ పరిశోధన సంస్థ’ పరిశీలనలో ఇటువంటి నిజాలెన్నో బయటపడ్డాయి.

అరణ్యాలలోని కార్బన్ నిక్షేపాలు వాతావరణంలోని బొగ్గుపులుసు వాయువును పీల్చుకుని నిల్వ చేయడం ప్రక్రియలో కీలకమైన భూమికను పోషిస్తాయి. ఆ రీత్యా అటవీ విస్తీర్ణం తగ్గిపోవటం పర్యావరణంలో కార్బన్ డై ఆక్సైడ్‍ను నియంత్రించగలగడంలో వైఫల్యాలకు పరోక్షంగా కారణమౌతోంది.

Exit mobile version