చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ
చేయకుండా ఉంటే చాలు అనికాదు
కొత్త తప్పులకి తలుపులు తెరవక
తీరువుగా నడుచుకోమంటుంది ఉగాది
మనిషిని మనిషి నమ్మేరోజులు
నమ్మకానికి అర్ధం మారని రోజులు
వస్తేనేకద నిజమైన పండగ
మానవత్వాన్ని మంట కలపక
కాస్తో కూస్తో ఔదార్యాన్ని
కురిపిస్తే చేతలలో
కలకలలాడుతుంది ముంగిట
కన్నులపండువగా ఉగాది !