Site icon Sanchika

పదసంచిక-1

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

పదసంచిక-1

ఆధారాలు:

అడ్డం:
1.నౌకరి అంటే తక్షణం స్పేస్ షటిల్ అంటావా?(4,2)
4. ఒక తెలుగు సంవత్సరం పేరు.  2025లో వస్తుంది.(4)
7. గడియ పురసత్తు లేదు ____ ఆదాయం లేదు అని సామెత. (2)
8. రాజమహల్‌లోని రాబడి, ఆదాయం.(2)
9. చతుర్వేదాలలో చివరిది.(4,3)
11. ఈ సందు కాదు బాబూ.(1,2)
13. రయమున రా బావా అంటూ పిలుస్తున్నాడు ధర్మజుడు శ్రీకృష్ణుణ్ణి. దౌత్యానికేనా?(5)
14. ఈమె పేరు బాల. ఇంటిపేరు రెంటాల.(2,3)
15. నలగ గొట్టేయి.(3)
18. కుమారస్వామి. కర్ణాటక ముఖ్యమంత్రి కాదు మయూరకేతువు.(7)
19. ఇది కట్టేయడమంటే బాల్చీ తన్నేయడమే.(2)
21. పాడి జంట ఇదంట.(2)
22. తెలంగాణలోని ఒకానొక సంస్థానం. ఇక్కడ తేలాల అంటే కుదరదు.(4)
23. పడుకోవడానికి పట్టెమంచమే కావాలా? ఇది సరిపోతుంది.(3,3)

 

నిలువు:

1. లోమపాదుడా లేక కర్ణుడా? ఎవరైనా ఫరవాలేదు.(4)
2. తవ్వకం మొదలెట్టగానే రెండు సోలలు దొరికాయి.(2)
3. నవరసాలలో ఒకటి. మూడవది.(5)
5.జవరాలు వత్సనాభి/ఉగ్రగంధను కలిగివుంది.(2)
6.ప్రజాదరణ పొందిన తెలుగు టెలివిజన్ వ్యాఖ్యాత్రి (2,4)
9.కోనంగి నవలా రచయిత. మీజాన్ పత్రికా సంపాదకుడు. (3,4)
10. రేవతీ నక్షత్రము. Group of Thirty Two (7)
11. ఆ సంతోషం జిడ్డు కారుతోంది.(3)
12. అరబ్బు దేశాలలో ఒకటి కదు బాయి?(3)
13. సడి సేయకో గాలి సడి సేయబోకే అని కృష్ణశాస్త్రి వేడుకున్నది ఈ చిత్రంలోనే.(6)
16. అంగీకరించలేను.స్వీకరించలేను.(5)
17. కంటకాన్ని సరిచేస్తే వచ్చే కవచం.(4)
20. పామరుడి స్పానరు.(2)
21. ప్రపంచములో ధోవతి.(2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను మే 21వ తేదీలోగా puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితోబాటుగా మే 26వ తేదీన వెలువడతాయి.

Exit mobile version