[dropcap]పా[/dropcap]లపిట్ట బుక్స్ ప్రచురించిన 48 కథకుల కథల సంకలనం ‘పాలపిట్ట వినూత్న కథ’.
“వర్తమాన తెలుగు కథన రీతుల్ని ప్రతిఫలించే వినూత్న కథల సంకలనం ఇది. విభిన్న పాయలు, వివిధ జీవన పార్శ్వాలకు సంబంధించిన బహుముఖ కోణాల్ని చిత్రించిన కథల సమాహారం ఈ పుస్తకం. వస్తువులో, శైలీ శిల్పాలలో, కథా సంవిధానంలో ఎవరి ప్రత్యేకత వారిదే అయిన రచయితల కథల సంకలనం ఇది” అని తమ ముందుమాట ‘వైవిధ్య కథల సమాహారం’లో ప్రచురణ కర్తలు తెలిపారు.
“ఇవాల్టి రచయితలు ఏయే అంశాల గురించి ఆలోచిస్తున్నారో, వారిని స్పందింపజేసే సంఘటనలు ఏమిటో ఈ కథలు చదివితే బోధపడుతుంది” అంటూ “మంచి కథల కోసం దప్పిక గొన్న పాఠకుల దాహాన్ని తీర్చేందుకు చేసిన ప్రయత్నమిది” అని కూడా ప్రచురణకర్తలు చెప్పుకున్నారు.
ఈ సంకలనంలో జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి, శిరంశెట్టి కాంతారావు, డా. కె.ఎల్.వి. ప్రసాద్, డా. టి. శ్రీరంగస్వామి, భీమరాజు వెంకటరమణ, బి. మురళీధర్, సింహప్రసాద్, సంగినేని రవీంద్ర వంటి ప్రముఖ కథకులున్నాయి.
***
పేజీలు:352, వెల రూ. 150
ప్రచురణ, ప్రతులకు:
పాలపిట్ట బుక్స్,
16-11-20/6/1/1, 403,
విజయసాయి రెసిడెన్సీ,
సలీంనగర్, మలక్‌పేట,
హైదరాబాదు – 500036
ఫోన్: 9848787284
మెయిల్: palapittabooks@gmail.com