Site icon Sanchika

సాయిపద్మ గారికి నివాళి

[dropcap]ఎం[/dropcap]దరికో ధైర్యాన్ని, జీవితాన్నిచ్చి హఠాత్తుగా స్వర్గస్థురాలైన సాయిపద్మ గారికి నివాళిగా – గతంలో మే 2018లో – గ్లోబల్ ఎయిడ్ సంస్థ గురించి సంచిక ప్రచురించిన వ్యాసాన్ని పునః ప్రచురిస్తున్నాము.


ఆమె భౌతికంగా దూరమయినా, ఆమె స్ఫూర్తి సంస్థను ముందుకు నడపడంతో తోడ్పడతుందని ఆశిస్తున్నాము.

సంచిక టీమ్


[box type=’note’ fontsize=’16’] దైవికంగా లభించిన అంగవైకల్యానికి క్రుంగి పోకుండా. విధితో పోరాడుతూ, అంగవైకల్యాలతో బాధపడుతున్న ఇతరులకు చేయూతనిస్తూ, దారి చూపిస్తూ, నిస్సహాయత్వాన్ని శక్తిగా మలచుకుని ఎందరికో స్ఫూర్తిగా మార్గదర్శకంగా నిలుస్తున్న సాయిపద్మ, ప్రజ్ఞానంద్ కలసి స్థాపించిన గ్లోబల్ ఎయిడ్ సంస్థ పరిచయ వ్యాసం ఈ నెల ప్రత్యేక వ్యాసం. [/box]

గ్లోబల్ ఎయిడ్ – గ్లోబల్ ఎబిలిటీ ఇన్ డిజేబిలిటీ

A I D ఎబిలిటీ ఇన్ డిజేబిలిటీ అనే అక్షరాలు తన జీవన లక్ష్యంగా పెట్టుకొని ముందడుగు వేస్తున్న వొక పదేళ్ళ వయసున్న సంస్థ గ్లోబల్ ఎయిడ్.  తన అడుగులను, తన కార్యక్రమాల ద్వారా పునరుజ్జీవనం చేసుకుంటూ, వసుధైక కుటుంబం అనే మాటను అక్షరాలా నిజం చేస్తోంది ఈ సంస్థ.

పుట్టుక :

గ్లోబల్ ఎయిడ్ సంస్థ ఆరంభించటానికి ముఖ్య కారణం, సంస్థ ఫౌండర్ డైరక్టర్లు సాయి పద్మ, ప్రజ్ఞానంద్. సుమారు తొంభై శాతం శారీరక వికలాంగురాలైన సాయి పద్మ, సాధించిన వ్యక్తిగత విజయాలతో తన జీవితాన్ని కుదింపదలచుకోలేదు. సమాజహితంలో భాగంకాని  వ్యక్తిగత విజయం, అసంపూర్ణమని బలంగా నమ్మిన వ్యక్తి సాయిపద్మ.

అదేవిధంగా, సాయి పద్మ జీవన సహచరుడు, డెవలప్మెంట్ ప్రొఫెషనల్ గా ఇరవై ఐదేళ్ళ అనుభవం కలిగిన వ్యక్తి ప్రజ్ఞానంద్. గ్రామీణ విద్య, వైద్య, వ్యవసాయం ,సాంప్రదాయేతర ఇంధన వనరులు, జీవనోపాధి నైపుణ్యాలు మొదలైన అంశాలలో విశేషమైన అనుభవం, సమస్యల పరిష్కారంపై పరిణతి కలిగిన వ్యక్తి.

వీరిరువురి మానస పుత్రి గ్లోబల్ ఎయిడ్. ఇవే మౌలిక విలువలు కలిగిన వ్యక్తులను వారి వారి సామాజిక సేవ నేపధ్యంగా గ్లోబల్ ఎయిడ్ బోర్డ్ ఎక్జిక్యూటివ్ బోర్డ్ లో సభ్యులుగా తీసుకోవటం జరిగింది.

సంస్థ ఎక్సిక్యూటివ్ బోర్డ్ లో ఉన్నవారు –

శ్రీ కృష్ణకుమార్ భగవతి – న్యాయవాదిగా సుమారు నలభై ఏళ్ళ అనుభవం ఉన్న న్యాయవాది, హైదరాబాద్ లాయర్స్ ఆన్లైన్ నిర్వహిస్తున్న వీరు, గ్లోబల్ ఎయిడ్ కు న్యాయ సలహాదారు గా, బోర్డ్ మెంబర్ గా ఉన్నారు.

శ్రీ శ్రీధర్ ఎర్రంశెట్టి – తొంబై శాతం వికలాంగులైన వీరు, గుంటూర్ లో హోల్ సేల్ ట్రేడర్. వికలాంగుల సమస్యలు, సమస్యలకి పరిష్కారాలు , వీల్ చైర్ , మొబిలిటీ ఎయిడ్స్ విషయంలో సంయమనంతో వికలాంగులకు అందుబాటులో ఉండే వ్యక్తి .

శ్రీమతి గాయత్రీ బోస్– వృత్తి రీత్యా టీచర్ అయిన ఈమె, ప్రవృత్తి రీత్యా రచయిత్రి, అనువాదకురాలు. గ్లోబల్ ఎయిడ్ విద్యా కార్యక్రమాలకు సంచాలకురాలిగా ఉన్నారు. పూర్తి స్థాయి వాలంటీర్ గా తన సేవలను అందజేస్తున్నారు.

శ్రీమతి ఛాయా దేవి – వొక ఆక్సిడెంట్ లో తన రెండు కాళ్ళూ పోగొట్టుకున్న వీరు, ఫైనాన్స్ ప్రొఫెషనల్ గా ఉన్నారు. గ్లోబల్ ఎయిడ్ సంస్థకు తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు.

శ్రీ రామ్ సుందర్ – గ్లోబల్ ఎయిడ్ సంస్థకు స్త్రేటజిస్ట్ గా, పూర్తిస్థాయి సలహాదారు గా సేవలు అందిస్తున్న వీరు, జాతీయ స్థాయిలో ఉత్తమ వాలంటీర్ అవార్డు పొందిన వ్యక్తి. NGO సంస్థల నిర్వహణలో అపారమైన అనుభవం కలిగిన వ్యక్తి.

శ్రీ శ్రీనివాస్ లంకా – పోలియో బాధితులైన వీరు, వొక మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ని నడిపిస్తున్నారు, ఫైనాన్స్ రంగంలో విశేషమైన అనుభవం కలిగిన వీరు, VUDA సంస్థకు ప్రత్యేక సలహాదారు గా ఉన్నారు.

గ్లోబల్ ఎయిడ్ సంస్థకు గుడ్ విల్  అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విశిష్ట వ్యక్తి మరొకరు ఉన్నారు. వారు-

శ్రీమతి శ్రీదేవీ మురళీధర్– డీ-అడిక్షన్ కౌన్సెలర్ గా విశేషమైన అనుభవం కలిగిన వారు శ్రీమతి శ్రీదేవి గారు. వీ. బీ .రాజు సోషల్ హెల్త్ ఫౌండేషన్ ద్వారా వీరు అందించిన సేవలు అపారమైనవి. కౌమార దశలో ఉన్న పిల్లలు, ఆల్కహాల్ మరియు ఇతర సమస్యలతో సతమతమవుతున్న గ్రామీణ , గిరిజన కమ్యూనిటీలతో పనిచేసే అనుభవం కలిగి ఉన్నవారు. వీరి సలహా, సహాయ సహకారాలు గ్లోబల్ ఎయిడ్ సంస్థకు చాలా ముఖ్యమైన వనరులు.

    

గ్లోబల్ ఎయిడ్ విజన్ :

Creation of a better world for differently abled persons, persons with disabilities, physically challenged persons to live with dignity & respect, making them ‘development inclusive’ thus accomplishing quality of life.’

వికలాంగులకు, గ్రామీణ గిరిజన విద్యార్ధులకు  మరియు అవసరం ఉన్న అందరికీవొక సుగమ్యమైన ప్రపంచాన్ని సృష్టించటం. వాళ్ళని, అభివృద్ది లో భాగస్వాములను చేయటం తద్వారా వారి జీవన నాణ్యత ను మెరుగు పరచటం

గ్లోబల్ ఎయిడ్ మిషన్ :

Mainstreaming into society, differently abled persons, persons with disabilities, physically challenged persons with all-natural rights and special rights that they are entitled.

సమాన హక్కులు, అధికారాలతో కూడిన ,అభివృద్ది లో అందర్నీ భాగస్వాములను చేయటం, ఆయా సమూహాల సహజ హక్కులు, రాజ్యాంగ ఆధారిత హక్కులు, వారికి అందేలా చేయటం

ఈ దిశగా 2008 లో ఒక వికలాంగులు, గ్రామీణ గిరిజన విద్యార్ధుల కోసం, పిల్లల హక్కుల కోసం, వారి సమస్యలు, ఎదుర్కొనే విధానాలు, వైద్య, విద్యా, వివాహ,పాలనా పరమైన విషయాలను అందుబాటులోకి తెచ్చేందుకు గ్లోబల్ ఎయిడ్  సంస్థ స్థాపించడం జరిగింది. సంస్థ పేరు గ్లోబల్ ఎయిడ్- ఎయిడ్ అంటే AID-Ability In Disability అని నామకరణం చేసారు.  గ్లోబల్ ఎయిడ్ ముఖ్య ఉద్దేశ్యాలు నాలుగు, Mobility, Accessibility, Employability, Sustainability

గ్లోబల్ ఎయిడ్ ప్రస్థానం:

గ్లోబల్ ఎయిడ్ యొక్క ప్రస్థానం తాలూకా  కొన్ని పిక్చర్స్ ద్వారా మీరు ఇక్కడ చూడవచ్చు. నిరంతర చైతన్యంతో గత పదేళ్లుగా కార్యక్రమాలు జరుపుతున్నామంటే, దాని వెనుక ఉన్న దీక్ష, దక్షత నేడు ఎంతో మంది గ్రామీణ గిరిజన పిల్లల చదువులకోసం, సమాన హక్కులతో నిండిన జీవితం కోసం వారిని సమాయత్త పరుస్తోంది.

 

మా సంస్థ కార్యక్రమాలలో కొన్ని మైలురాళ్ళు :

గ్లోబల్ ఎయిడ్ ప్రస్తుతం : – ( జరుగుతున్న కార్యక్రమాల వివరాలు )

     

బీబీసీ తో సహా వివిధ మీడియా చానల్స్ లో వచ్చిన మా కార్యక్రమాల వివరాలు, కవరేజీ :

http://www.bbc.com/news/av/world-41552885/how-a-polio-survivor-is-educating-india-s-rural-children

https://www.youtube.com/watch?v=4Z0HvDw16gQ

https://www.youtube.com/watch?v=P-ce5MkwCX8&t=513s

https://www.youtube.com/watch?v=bISg984oPWw

https://www.youtube.com/watch?v=uVc6hJ1beik

https://www.youtube.com/watch?v=xhwDDVCG8Zo

https://www.youtube.com/watch?v=8afdwBy6kDM

https://www.youtube.com/watch?v=IfVdEkF3IY8&t=3s

https://www.youtube.com/watch?v=GlROEBOguGY

https://www.youtube.com/watch?v=pv-F_D12nuI

https://www.youtube.com/watch?v=4vWL9D1QIE0

http://www.youtube.com/watch?v=NIV7MyN6TXY

http://www.youtube.com/watch?v=QrLy9tSkgT4

http://www.youtube.com/watch?v=jb1Qk5Hh4PE&noredirect=1

http://www.youtube.com/watch?v=D-wfmD8MBfw

మా సంస్థ స్పాన్సర్ షిప్ వివరాలు:

మా సంస్థ డొనేషన్ వివరాలు :

To Donate Online ( Within India )

Through ICICI Bank Account:

Name of the Organization: Global Ability In Disability Global AID

Bank Name: ICICI BANK

Account Number: 631601033306

IFSC Code: ICIC0006316

Branch: MVP Colony, Visakhapatnam

City : Visakhapatnam

State: Andhra Pradesh

To donate online (From Out of India):

FCRA Approval No. 010370084R

Name of organization: Global Ability In Disability Global AID

Bank Name: Oriental Bank of Commerce Account

Number: 05222191037534

IFSC Code: ORBC0100522

Swift Code: ORBCINBBVIS

Branch Code: 1056

Branch: MVP Colony, Visakhapatnam City: Visakhapatnam

State: Andhra Pradesh

Country: INDIA

To donate by cheque/bank drafts:

Please write in favor of:

“Global Ability In Disability Global AID”, payable @ Visakhapatnam and mail it to our

corporate office:

“Global AID “

H.No.1-105-12, Plot No.26

Sector-8, MVP Colony,

Visakhapatnam-530017

We ensure that donation process must be transparent and easy. YOUR DONATIONS ARE

DEDUCTIBLE U/S 80G OF THE INCOME TAX ACT, AND FOREIGN CONTRIBUTION &

REGULATION ACT APPROVED.

శారీరక, సామాజిక అవకరాలు, అసహాయతలు , ఆత్మ న్యూనత నుండి అవకరం, అవకాశాలు అందిపుచ్చుకునే దిశగా ప్రతి వారు ఎదగాలన్నది గ్లోబల్ ఎయిడ్ సంస్థ యొక్క లక్ష్యం. సంస్థ వెబ్ సైట్ www.globalaid.in

 సాయి పద్మ

Exit mobile version