12వ జాతీయస్థాయి ‘సోమేపల్లి’ చిన్న కథల పోటీ విజేతలు – ప్రకటన

0
2

[dropcap]’ర[/dropcap]మ్యభారతి’ ఆధ్వర్యంలో ఇటీవల  జాతీయస్థాయిలో నిర్వహించిన తెలుగు చిన్న కథల పోటీలలో  12వ ‘సోమేపల్లి సాహితీ పురస్కారాల’ కోసం దేశం నలుమూలల నుండి 121 కథలు పరిశీలనార్థం వచ్చాయి.  వాటిలో ఉత్తమంగా ఉన్న ఈ క్రింది కథలను న్యాయనిర్ణేత ఎన్నిక చేసారు.

విజేతలు: నూజివీడుకు చెందిన డా|| జడా సుబ్బారావు రచించిన ‘మంచుకింద ఉక్కపోత’ కథకు ‘సోమేపల్లి’ ప్రధమస్థాయి అత్యుత్తమ పురస్కారం లభించింది.  ద్వితీయస్థాయి పురస్కారం విశాఖపట్నంకు చెందిన శ్రీమతి పి.వి.శేషారత్నం రచించిన ‘ఇదేం న్యాయం?’కు, తృతీయస్థాయి పురస్కారం నర్సారావుపేటకు చెందిన నారాయణ గూండ్ల రచించిన ‘గిరిగీరోల్లు’కు లభించాయి.

అలాగే ‘బుడగ’ రచనకు బి.వి.శివప్రసాద్‌(విజయవాడ), ‘గీతా మకరందం’ రచనకు జి.రంగబాబు (అనకాపల్లి), ‘స్మార్ట్‌ఫోన్‌’ రచనకు శింగరాజు శ్రీనివాసరావు (ఒంగోలు), ‘క్రమ వికాసం’ రచనకు కృపాకర్‌ పోతుల (హైదరాబాద్‌)లకు ప్రోత్సాహక పురస్కారాలు లభించాయి.

విజేతలకు వరసగా 2,500, 1,500, 1,000, ప్రోత్సాహకం 500 నగదుతోపాటు జ్ఞాపిక, శాలువతో త్వరలో జరిగే ప్రత్యేక సభలో సత్కరించడం జరుగుతుంది.  ఈ పోటీలకు  ప్రఖ్యాత రచయిత, విమర్శకులు శ్రీకంఠస్ఫూర్తి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.

ఈ పోటీలు విజయవంతం చేసిన రచయితలకు, పత్రికల వారికి రమ్యభారతి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నది.

చలపాక ప్రకాష్, ఎడిటర్, రమ్యభారతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here