Site icon Sanchika

‘19వ శతాబ్దిలో తెలుగు కవిత్వంలో నవ్యత’ – సిద్ధాంత గ్రంథం – త్వరలో

[dropcap]డా.[/dropcap] ఆచార్య ఫణీంద్ర గారు పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.

ఈ పరిశోధనని వారు ఆచార్య ఎస్. వి. రామారావు, పూర్వ డీన్, ఆర్ట్స్ విభాగం గారి పర్యవేక్షణలో కొనసాగించి 2008లో పట్టా పొందారు.

***

‘పందొమ్మిదవ శతాబ్దిలో తెలుగు కవిత్వంలో నవ్యత’ – ఈ శీర్షిక చూడగానే ఇంతవరకు తెలుగు సాహిత్య చరిత్రను అధ్యయనం చేసిన వారు చాలా మంది కనుబొమలు ముడివేయకపోరు. “పందొమ్మిదవ శతాబ్ది క్షీణయుగంగా ప్రసిద్ధి చెందింది. కదా! ఇరవయ్యవ శతాబ్దిలోగాని నవ్యకవిత్వం అంకురించలేదు కదా! మరి, అంధకారం ఆవరించియున్న 19వ శతాబ్దిలో నవ్యత ఎక్కడిది?” అన్న సందేహం ఒక్కసారి కలుగక మానదు.

ఇదీ 19వ శతాబ్ది తెలుగు కవిత్వానికి జరిగిన అన్యాయం. నిజంగా 19వ శతాబ్దిలో వెలువడిన కావ్యాలను కూలంకషంగా అధ్యయనం చేస్తే, వాటిలోని నవ్యతా పరిమళాలను ఆస్వాదించగలిగితే, ఈ అభిప్రాయాన్ని మార్చుకోక తప్పదు.

18వ శతాబ్ది అంతం వరకు కొనసాగిన నాయక రాజుల యుగానికి, 20వ శతాబ్దిలో వ్యవస్థీకృతమయిన నవ్య యుగానికి మధ్య 19వ శతాబ్ది ఒక ద్వారబంధం లాంటిది. 20వ శతాబ్దిలో తొలితరం పండితులు 19వ శతాబ్దిలో వెలువడిన ఒకటి, రెండు నవ్య కావ్యాలను గుర్తించినా, వారి దర్శనం ద్వారబంధానికి అటువైపు నుండి చేసిందే. కాని, ఈ సిద్ధాంత రచన 20వ శతాబ్ది నవ్యయుగ మహా వృక్ష ఫలాలను పూర్తిగా రుచి చూసి, ద్వారబంధానికి ఇటు వైపు నుండి చేసిన దర్శనం.

***

ఈ పరిశోధన ద్వారా డా ఫణీంద్ర 19వ శతాబ్ది ‘క్షీణ యుగం’ కాదు.. తెలుగు సాహిత్య చరిత్రలో ‘ఉషోదయ యుగం’ అని నిరూపించారు.

***

‘19వ శతాబ్దిలో తెలుగు కవిత్వంలో నవ్యత’ – సిద్ధాంత గ్రంథం – వచ్చే వారం నుంచి సంచికలో

చదవండి.. చదివించండి.

‘పందొమ్మిదవ శతాబ్దిలో తెలుగు కవిత్వంలో నవ్యత’

Exit mobile version