Site icon Sanchika

2018 తెలుగు కథాపుస్తకాలు – సింహావలోకనం

[dropcap]2[/dropcap]018వ సంవత్సరంలో తెలుగుభాషలో కథాసాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు అనేకం ప్రచురితమయ్యాయి. వైవిద్యభరితమైన పుస్తకాలు వెలువడటం ఈయేడాది ప్రత్యేకం.  వీటిలో 26 కథాసంకలనాలు, 115 కథాసంపుటాలున్నాయి. ఇవికాక కథలతోబాటు ఇతరసాహిత్య ప్రక్రియలు కలిపి ప్రచురితమైన పుస్తకాలు 6 ఉన్నాయి. మరో రెండు పుస్తకాలలో కథాసాహిత్యానికి చెందిన వ్యాసాలు కనిపిస్తాయి. 12 అనువాద పుస్తకాలు, 12 బాలసాహిత్య గ్రంథాలతోపాటు, దళిత కథాసాహిత్యం, స్త్రీవాద సాహిత్యంకూడా ఈకాలంలో వెలుగు చూశాయి.  ఈ పుస్తకాలన్నింటిలో కలిపి కనీసం 1923 (ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చు) కథలకు చోటు లభించింది.  2017లో వెలువడిన పుస్తకాలతో పోలిస్తే 2018లో కథావాఙ్మయం బాగా విజృంభించిందనే చెప్పాలి.  2017లో వెలువడిన పుస్తకాలు 70లోపునే ఉన్నాయి.

2018లో వెలువడిన కథల పుస్తకాల జాబితాను పరిశీలిస్తే ఎన్నిరకాల అంశాలపై కథలు వెలువడ్డాయో తెలుసుకోవచ్చు. ఈ పుస్తకాలు దేశభక్తి మొదలుకొని సెక్స్ వర్కర్ల వరకు, కటికపూలు మొదలు కొని ఊదారంగు తులిప్ పూల వరకు విస్తృతమైన అంశాలను కలిగివున్నాయి. గాంధీ 150వ జయంతి సందర్భంగా తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు అనే కథా సంకలనం ఈ సారి వెలువడింది. అలాగే ఒకే పేరుతో వివిధ రచయితలు వ్రాసిన ఆనాటి వాన చినుకులు అనే సంకలనం ఒక కొత్త ప్రయోగం. 2018లో వెలువడిన కథాసంకలనాలు, సంపుటుల వివరాలను క్రింది జాబితాలలో చూడవచ్చు. నా దృష్టికి రాని పుస్తకాల వివరాలను కామెంట్ల రూపంలో తెలిపితే వాటిని సవరించుకుంటాను.

2018లో విడుదలైన కథా సంకలనాలు

క్రమ సంఖ్య గ్రంథం పేరు రచయిత(లు)/ సంపాదకుడు(లు) కథల సంఖ్య వివరాలు
1 అంతరిక్ష నౌక దొంగలు ఎం.వేదకుమార్
2 అపూర్వ రష్యన్ జానపద కథలు అనువాదం: అనిల్ బత్తుల
3 ఆకాశంలో నెమలీక ఈ.రాఘవేంద్ర 19
4 ఆథర్స్ & స్టోరీస్ ఎం.ఆర్.వి.సత్యనారాయణమూర్తి 27
5 ఆనాటి వానచినుకులు వేమూరి సత్యనారాయణ 24
6 ఇన్ ది మూడ్ ఫర్ లవ్ అపర్ణ తోట, వెంకట్ సిద్ధారెడ్డి 12
7 కథాతోరణం అనువాదం:ఎలనాగ అనువాద కథలు
8 కథామినార్ మహమ్మద్ ఖదీర్‌బాబు, వేంపల్లి షరీఫ్ 23
9 కొత్త కథ 2018 కుప్పిలి పద్మ, వెంకట్ సిద్ధారెడ్డి 24
10 కొత్త కథలు తెన్నేటి సుధాదేవి 65
11 గోరింటాకు అనువాదం: అమ్జద్ 12 ఉర్దూ అనువాద కథలు
12 టి.షణ్ముఖరావు అనువాద కథలు అనువాదం:టి.షణ్ముఖరావు 23
13 తెలంగాణ రచయిత్రుల కథలు ముదిగంటి సుజాతారెడ్డి 120
14 తెలుగుకథలలో గాంధీ మహాత్ముడు కస్తూరిమురళీకృష్ణ, కోడీహళ్లిమురళీమోహన్ 30
15 దావత్  తెలంగాణ కథ 2017 సంగిశెట్టి శ్రీనివాస్, వెల్దండి శ్రీధర్ 13
16 దేశభక్తి కథలు కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్లి మురళీమోహన్ 35
17 ప్రాతినిధ్య కథ 2016 సామాన్య, ముసునూరు ప్రమీల
18 భారతీయం అనువాదం:రంగనాథ రామచంద్రరావు 22
19 భార్య-భర్త, మరొకరు అనువాదం:మల్లాది వెంకటకృష్ణమూర్తి 24  అనువాద క్రైమ్ కథలు
20 మా కథలు 2017 సి.హెచ్.శివరామప్రసాద్
21 రైలుకథలు ఎమ్.ఉమాశంకర్ కుమార్ 39
22 విశాఖ సంస్కృతి ఉత్తమ బాలల కథలు – 2018 శిరేల సన్యాసిరావు
23 విశ్వకథా సాహితి అనువాదం:దేవరాజు మహారాజు 32 అనువాద కథలు
24 సాహితి తరంగం నమిలికొండ బాలకిషన్‌రావు 31
25 సిగ్నల్ అనువాదం:రంగనాథ రామచంద్రరావు 20
26 సిద్ధిపేట కథలు కొండి మల్లారెడ్డి, పర్కపెల్లి యాదగిరి 9

 2018లో విడుదలైన కథా సంపుటాలు

క్రమ సంఖ్య గ్రంథం పేరు రచయిత(లు)/సంపాదకుడు(లు) కథల సంఖ్య వివరాలు
1 63 బహుమతి కథానికలు సింహప్రసాద్ 63
2 అంతా నిజమే చెబుతా… జీలానీ బానో అనువాదం: మెహెక్ హైదరబాదీ 21 ఉర్దూ కథలు
3 అకాల వసంతం రాధిక నోరి
4 అద్దంలో మనం శంకరమంచి పార్థసారథి
5 అద్దాల గదులు ఇంద్రగంటి కిరణ్మయి
6 అనుకోలేదనీ.. తురగా జయశ్యామల 12
7 అమ్మ అజ్ఞానం! గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు 32
8 అమ్మ చెప్పిన కథలు అనిల్ బత్తుల
9 అమ్మ సిగ్గుపడింది అధరాపురపు తేజోవతి
10 అమ్మతనం అనూరాధ(సుజల గంటి) 15
11 అమ్మే కావాలి జి.యస్.లక్ష్మి 13
12 అసలు దారి వీరబ్రహ్మచారి
13 ఆత్మీయ రాగం రాజేష్ యాళ్ల
14 ఆనందరావు  కథలు ఆనందరావు పట్నాయక్ 27
15 ఆశయాల పల్లకిలో సి.ఎన్.చంద్రశేఖర్
16 ఆశాదీపాలు షేఖ్ బషీరున్నీసా బేగం 26
17 ఇంటింటికొక పూవు జి.యస్.లక్ష్మి 13
18 ఇరానీ కేఫ్ వి.మల్లికార్జున్
19 ఇస్కూలు కతలు శీలా సుభద్రాదేవి 30
20 ఈ తరం కోసం కథాస్రవంతి అట్టాడ అప్పల్నాయుడు కథలు అట్టాడ అప్పల్నాయుడు
21 ఈ తరం కోసం కథాస్రవంతి కలువకొలను సదానంద కథలు కలువకొలను సదానంద
22 ఈ తరం కోసం కథాస్రవంతి కె.వరలక్ష్మి కథలు కె.వరలక్ష్మి
23 ఈ తరం కోసం కథాస్రవంతి కొడవటిగంటి కుటుంబరావు కథలు కొడవటిగంటి కుటుంబరావు
24 ఈ తరం కోసం కథాస్రవంతి గోపీచంద్ కథలు త్రిపురనేని  గోపీచంద్
25 ఈ తరం కోసం కథాస్రవంతి తాడిగిరి పోతరాజు కథలు తాడిగిరి పోతరాజు
26 ఈ తరం కోసం కథాస్రవంతి భూషణం కథలు భూషణం
27 ఈ తరం కోసం కథాస్రవంతి మధురాంతకం నరేంద్ర కథలు మధురాంతకం నరేంద్ర
28 ఈ తరం కోసం కథాస్రవంతి మా.గోఖలే కథలు మాధవపెద్ది గోఖలే
29 ఈ తరం కోసం కథాస్రవంతి రావిశాస్త్రి కథలు రాచకొండ విశ్వనాథశాస్త్రి
30 ఈ తరం కోసం కథాస్రవంతి వల్లూరు శివప్రసాద్ కథలు వల్లూరు శివప్రసాద్
31 ఊదారంగు తులిప్ పూలు కూనపరాజు కుమార్
32 ఎచటికి పోతావీరాత్రి? కొండేపూడి నిర్మల 12
33 ఎడారి బతుకులు ఎండపల్లి భారతి 30
34 ఎస్.వి.రంగారావు కథలు ఎస్.వి.రంగారావు
35 ఒక కోయిల గుండె చప్పుడు అత్తలూరి విజయలక్ష్మి
36 ఒక సాయంత్రం త్వరగా ఇల్లు చేరినప్పుడు పలమనేరు బాలాజీ
37 ఓ వర్షం కురిసిన రాత్రి కాంచనపల్లి
38 కటికపూలు ఇండస్ మార్టిన్ 26 దళితకథలు
39 కథల గోదారి దాట్ల దేవదానం రాజు 14
40 కథాసుధ -1 దుగ్గిరాల రాజకిశోర్ 40 బాల సాహిత్యం
41 కపిల మహర్షి బి.వి.రావు
42 కప్పస్తంభం చింతకింది శ్రీనివాసరావు 10
43 కాకిబొడ్డు చిరంజీవి వర్మ
44 కొత్త పొద్దు మౌని 41
45 కొత్త స్వరాలు దాసరి శిరీష 17
46 కోయిల చెట్టు ఎం.ప్రగతి 18
47 గడ్డిపువ్వు గుండె సందుక వి.శాంతిప్రబోధ 12
48 గాలిపటం సన్నిహిత్ 10
49 గిలిగింతలు తులసి బాలకృష్ణ హాస్యకథలు
50 గీతోపదేశం డి.కామేశ్వరి 17
51 గుండెల్లో గోదారి చెంగల్వల కామేశ్వరి
52 గురి మల్లిపురం జగదీశ్ 12
53 చదువుల చెలమ ఎల్.ఆర్.వెంకటరమణ విద్యా వికాస కథలు
54 చిన్నారి కథలు లక్కోజు రాజాగణేష్ 42
55 చేతవెన్న ముద్ద ఓలేటి శ్రీనివాసభాను
56 జన్నాభట్ల కథలు – 4 జన్నాభట్ల నరసింహప్రసాద్ 14
57 జీవన గతులు చెన్నూరి సుదర్శన్
58 జీవన జ్యోతి పొత్తూరి విజయలక్ష్మి 15
59 జీవితం తాయమ్మ కరుణ 30
60 జోలెవిలువ హైమవతి 6
61 టీచర్ చెప్పిన కథలు ఎం.హరికిషన్
62 తగినశాస్తి దండ్రె రాజమౌళి బాల సాహిత్యం
63 తడి ఎస్.డి.వి.అజీజ్ 13
64 తరం మారినా కడారు వీరారెడ్డి
65 తాత్పర్యం రామా చంద్రమౌళి 20
66 తూరుపు గాలులు ఉణుదుర్తి సుధాకర్ 13
67 తోలుబొమ్మలాట కూనపరాజు కుమార్ 6
68 దళిత బ్రాహ్మణుడు శరణకుమార్ లింబాళె అనువాదం:రంగనాథ రామచంద్రరావు 13 మరాఠీ అనువాద కథలు
69 దేవుడికి సాయం కొల్లూరి సోమశంకర్ 16
70 దేవుడెవరు? దేవరాజు మహారాజు బాల సాహిత్యం
71 నిత్యకల్లోలం ముదిగంటి సుజాతారెడ్డి 22
72 నిశ్శబ్ద ప్రతిధ్వని ఎల్.రాజా గణేష్
73 నీలి తెర పల్లె సీను 13
74 నెమలికన్ను చీర రాచపూటి రమేష్
75 పడమటి గోదావరి రాగం శ్రీనివాసరాజు ఇందుకూరి
76 పది రూపాయలకు లక్ష వడ్డీ ఎన్నవెళ్లి రాజమౌళి 20
77 పల్లె నాతల్లి ఐతా చంద్రయ్య 31
78 పల్లె పిలిచింది ఏరుకొండ శశిరేఖ
79 పల్లెపూలవాన బెల్లంకొండ సంపత్‌కుమార్ 12
80 పిల్లలు మెచ్చిన వంద కథలు ఎం.హరికిషన్
81 పూలజడ కందేపి రాణి 16
82 పూలమనసులు నండూరి సుందరీనాగమణి
83 ప్రకృతిమాత చెన్నూరి సుదర్శన్ 15
84 బతుకు బంతి శాంతి నారాయణ 10
85 బహు’మతులు’ వురిమళ్ల సునంద 21
86 బుద్ధిబలం యు.విజయశేఖరరెడ్డి 22 బాల సాహిత్యం
87 భోజ సాలభంజిక కథలు కొంపెల్ల రామకృష్ణమూర్తి
88 మధురాంతకం రాజారాం పిల్లల కథలు మధురాంతకం రాజారాం
89 మా తిరుపతికొండ కథలు గోపిని కరుణాకర్ 16
90 మాదిరెడ్డి సులోచన కథలు మాదిరెడ్డి సులోచన (తెలంగాణ సాహిత్య అకాడమీ) 32
91 మాయజలతారు సలీం 16
92 మిళింద ఎండ్లూరి మానస 22
93 ముగింపుకు ముందు వి.చంద్రశేఖరరావు 7
94 మూగడి బాధ మూడ్నాకూడు చిన్నస్వామి, అనువాదం:రంగనాథ రామచంద్రరావు 10 అనువాద కథలు
95 మెట్రో కథలు మహమ్మద్ ఖదీర్‌బాబు
96 మోహనస్వామి వసుధేంద్ర అనువాదం:రంగనాథ రామచంద్రరావు 10
97 మౌనసాక్షి నక్షత్రం వేణుగోపాల్
98 రాగాల రహస్యం రాచపూటి రమేష్ సస్పెన్స్ కథలు
99 రాజ్యం కోసం బొందలపాటి నాగేశ్వరరావు బాల సాహిత్యం
100 రెప్పపాటు ప్రయాణం పోలంరాజు శారద 25
101 లాలీరోడ్ ఆర్.కె.నారాయణ్, అనువాదం:వేమవరపు భీమేశ్వరరావు అనువాద కథలు
102 లోయ మరికొన్ని కథలు బి.అజయ్ ప్రసాద్
103 విధి పెరుక రాజు
104 సంసారంలో పదనిసలు అను సంసారోపనిషత్ అధరాపురపు తేజోవతి
105 సముద్రం నిద్రపోతోంది బిక్కి కృష్ణ 10
106 సరికొత్త వేకువ కోసూరి ఉమాభారతి 10
107 సామెతల సప్పరము అగరం వసంత్
108 సిమెంట్ బెంచ్ కథలు కొండూరి కాశీవిశ్వేశ్వరరావు 14
109 సీమ బొగ్గులు దేవిరెడ్డి వెంకటరెడ్డి
110 సీమేన్ అద్దేపల్లి ప్రభు 13
111 సెక్స్ వర్కర్లు చెప్పిన కథలు కె.ఎస్.మూర్తి 9
112 స్మార్ట్ జీవితం లక్ష్మీ రాఘవ
113 స్వీటీ, మిల్కీ ఓ చిలుక కందేపి రాణీప్రసాద్ 16  బాల సాహిత్యం
114 స్వేచ్ఛ  నుండి విముక్తి బి.ఎస్.రాములు 7
115 హజ్బెండ్ స్టిచ్ గీతాంజలి
116 కులవృక్షం వనజ తాతినేని 24

విన్నపం

తెలుగు భాషలో ఇప్పటి వరకు వెలువడిన కథా సాహిత్యానికి సంబంధించిన పుస్తకాల వివరాలు సేకరించి “సమగ్ర తెలుగు కథా వాఙ్మయ గ్రంథ సూచి” నిర్మించే ప్రయత్నంలో ఉన్నాను. ఇంతవరకు  సుమారు 4500 గ్రంథాల వివరాలు సేకరించగలిగాను. వీటిలో 1855లో సి.పి.బ్రౌన్ సంపాదకత్వంలో వెలువడిన తాతాచార్ల కథలు మొదలుకొని నేటి వరకు వెలువడిన గ్రంథాలున్నాయి. వీటిలో కథా సంకలనాలు, కథా సంపుటులు, కథాసాహిత్యం పై వెలువడిన విశ్లేషణా గ్రంథాలు, విమర్శా గ్రంథాలు, పరిశోధనా గ్రంథాలు, సమీక్షా పుస్తకాలు మొదలైనవి ఉన్నాయి.  అనువాద కథల పుస్తకాలు, బాలసాహిత్యం మొదలైనవి కూడా దీనిలో చోటు చేసుకున్నాయి. నా యీ ప్రయత్నానికి  రచయితలు, ప్రచురణ కర్తలు తమతమ గ్రంథాల వివరాలు పంపి సహకరించ వలసినదిగా అభ్యర్థిస్తున్నాను. మీ పుస్తకం పేరు, రచయిత/సంపాదకుని పేరు, అది మొదటిసారి వెలువడిన సంవత్సరం, దానిలో వున్న కథలు/కథావ్యాసాల సంఖ్య, ఇతర వివరాలు  దయచేసి నాకు mmkodihalli@gmail.com కు మెయిల్ ద్వారా తెలియజేసి సహకరించగలరు.

Exit mobile version