2022 శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

0
3

[dropcap]మ[/dropcap]న తరం చూడని, ఎరుగని –
కఠోర, కన్నీటి, అనుభవాల
అలల, తెరలను దాటించి..
శుభాల నివ్వనుంది శుభకృత్!

కాలం, అలుపులేని గమనంలో –
ఎన్నెన్ని అనుభూతుల దొంతరలు –
మట్టిలో, శిలలలో దాగిఉన్నాయో?!
గమనిస్తే, కనువిప్పు చూపేనా?

మనిషి, మనిషిని వెన్నాడే, వెంటాడే –
శబ్దకాంతులను దాటే పరుగు …
నిలిచి, నిలిచి, నిశ్చలమై –
అందమైన లోకం చూపాలీ శుభకృత్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here