Site icon Sanchika

2022 ఉగాది కవిసమ్మేళనం ప్రెస్ నోట్

[dropcap]2 [/dropcap]022 ఉగాది కవిసమ్మేళనం ప్రెస్ నోట్

~

సమాజాన్ని సంస్కరింపజేసేదే కవిత్వం

– తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్

– వేడుకగా ఉగాది కవిసమ్మేళనం, ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం

సమాజాన్ని సంస్కరింపజేసేదే కవిత్వమని అలాంటి కవిత్వమే సమాజంలో నిలుస్తుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. శ్రీ శుభకృత్ ఉగాదినామ సంవత్సరాన్ని పురస్కరించుకుని పాలమూరు సాహితి, లుంబిని పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో లుంబిని పాఠశాలలో మార్చి 30 న నిర్వహించిన కవిసమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో ఎన్ని ఉగాదులు వచ్చిపోతున్నా కవులు కొత్త జీవితాలను ఆవిష్కరిస్తారన్నారు. ఒకప్పుడు పల్లెలు కన్నీళ్లు కారిస్తే ఇప్పుడు పచ్చనిపంటలతో కళకళలాడుతున్నాయన్నారు. విశిష్టఅతిథిగా విచ్చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణసుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉగాది పండుగ ను పురస్కరించుకుని ప్రతి ఏటా కవిసమ్మేళనం నిర్వహించడం అభినందించదగ్గ విషయమన్నారు.

గౌరవ అతిథిగా విచ్చేసిన ప్రముఖ న్యాయవాది వి.మనోహర్ రెడ్డిలు మాట్లాడుతూ ఉగాది పండుగ కంటే ముందే లుంబిని పాఠశాలలో కవులు కవితాగానం చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. ప్రతి సంవత్సరం కొత్త కవులను తయారుచేస్తున్నందుకు ఈ సందర్భంగా నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన కాళోజీ అవార్డు గ్రహీత కోట్ల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా గత పదహారు సంవత్సరాలుగా ఉగాది కవిసమ్మేళనం నిర్వహించడం నిజంగా గొప్ప విషయమన్నారు. సభకు లుంబిని టెక్నో హైస్కూలు డైరెక్టర్ కె.లక్ష్మణ్ గౌడ్ అధ్యక్షత వహించారు. కవిసమ్మేళనాన్ని డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ నిర్వహించారు. అనంతరం ఈ సంవత్సరం ఉగాది పురస్కారాలను డాక్టర్ కె.బాలస్వామి‌, డాక్టర్ మాడ పుష్పలత లకు అందించారు. అలాగే కవిసమ్మేళనంలో పాల్గొన్న ప్రతి కవికి మెమెంటో, శాలువాతో సత్కరించారు.

Exit mobile version