Site icon Sanchika

ఎ.పి.రచయితల సంఘం భాషా పురస్కారాలు 2023 – ప్రకటన

[dropcap]ఆం[/dropcap]ధ్రప్రదేశ్‌ రచయితల సంఘం ‘గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి’ సందర్భంగా తెలుగు భాషా వ్యాప్తికి విశేష కృషి చేసిన వ్యక్తులకు తెలుగు భాషా పురస్కారాలను ప్రకటించింది.

వేలాది వ్యాసాల ద్వారా తెలుగు భాష, సంస్కృతిని పరివ్యాప్తం చేసిన తెనాలికి చెందిన షేక్‌ అబ్దుల్‌ హకీంజానీకి, బాలల్లో ఆసక్తికరంగా ఆలోచనల్ని రేకెత్తించే విధంగా బాలసాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్న చెన్నైకి చెందిన ప్రముఖ బాలసాహితీవేత్త బెల్లంకొండ నాగేశ్వరరావుకు ఈ ఏటి తెలుగు భాష పురస్కారాలకు రచయితల సంఘం కమిటీ ఎంపిక చేసింది.

ఈ నెల 29న జరిగే ప్రత్యేక సభలో వీరిని ప్రముఖుల సమక్షంలో నగదు, సన్మాన పత్రం, శాలువాతో రచయితల సంఘం సత్కరించనున్నది.

సాహిత్యాభివందనములతో

– సోమేపల్లి వెంకట సుబ్బయ్య, అధ్యక్షులు

– చలపాక ప్రకాష్‌ , ప్రధాన కార్యదర్శి

ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం

Exit mobile version