సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహిస్తున్న 2024 దీపావళి కథల పోటీ – ఒక అప్‌డేట్

1
2

[dropcap]సం[/dropcap]చిక- డా. అమృతలత సంయుక్తంగా నిర్వహిస్తున్న కథల పోటీ చివరి తేదీ ముగిసిన రెండు రోజుల వరకూ కథలు వస్తూనే వున్నాయి. 02 అక్టోబర్ వరకూ అందిన కథలన్నిటినీ పోటీకి స్వీకరించాము.

ఈ పోటీకి అందిన కథల సంఖ్య అంచనాలను మించిందనటం సరిపోదు. అంచనాలను దాటి పొంగి పొర్లి ముంచెత్తిందనటం అతిశయోక్తి కాదు. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరగని రీతిలో మూడువందలపైగా కథలు అందాయి.

కథలు పంపిన రచయితలందరికీ శతకోటి వందనాలు!!!!!

ముందుగా బహుమతిగా, మొత్తం సొమ్ము ₹ 20,000/-, చక్కని కథలుగా ఎంపిక చేసిన రచనలకు సమానంగా పంచాలని అనుకున్నాము.

ఎందుకంటే, ప్రథమ, ద్వితీయ కథలుగా ఎంపికచేసే పద్ధతికి సంచిక వ్యతిరేకి.

కానీ, అందిన కథల సంఖ్యను, నాణ్యమైన కథల సంఖ్యను పరిశీలించిన తరువాత బహుమతిగా ₹ 20,000/- తక్కువ అనిపించింది.

రచయితలు వస్తువు ఎంపికలో చూపిన వైవిధ్యం, కథను నడపటంలో చూపిన చమత్కారం, కథలో ప్రదర్శించిన అంశాల వైశిష్ట్యం ఆనందాశ్చర్యాలు కలిగించాయి. అందుకని, బహుమతి మొత్తాన్ని పెంచాలని నిశ్చయించాము. అందుకు, ప్రఖ్యాత రచయితలు అల్లూరి గౌరీలక్ష్మి గారు, పుట్టి నాగలక్ష్మి గార్లు ముందుకు వచ్చి తమ వంతుగా కొంత ధనం అందించారు, బహుమతుల కోసం. సంచిక కూడా, ముందుగా అనుకున్న దానికన్నా ఎక్కువ సొమ్ము బహుమతులకు కేటాయించుకోవాలని నిశ్చయించటంతో ఇప్పుడు బహుమతి మొత్తం ₹ 40,000/- అయింది. దాంతో మరికొన్ని చక్కని కథలు రాసిన రచయితలకు బహుమతులిచ్చే వీలు చిక్కింది.

కథల పోటీ ఫలితాలు త్వరలో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here