[dropcap]కె.[/dropcap]యన్.వై. పతంజలి సాహిత్య వేదిక, విజయనగరం – గత 10 ఏళ్ళుగా, ప్రతి సంవత్సరం పతంజలి సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ కథకులకు ప్రదానం చేస్తూ వస్తుంది.
2024 సంవత్సరానికి, ప్రముఖ కథకుడు, పాత్రికేయుడు – ‘గోరపిట్ట’ కథాసంపుటి రచయిత ‘సువర్ణముఖి’ (రౌతు బంగారు నాయుడు) కి ప్రదానం చేయనున్నట్లు, సంస్థ అధ్యక్ష కార్యదర్శులు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కథల పైన పొదిలాపు శ్రీనివాస్ ప్రసంగిస్తారు. ముఖ్య అతిథి, ప్రముఖ రచయిత గంటెడ గౌర్నాయుడు పతంజలి సాహిత్య పరిచయం చేస్తారు.
ఆప్తవాక్యం రైతు వాసుదేవరావు. సభా అధ్యక్షులు బి శెట్టి బాబ్జి, కార్యదర్శి నివేదిక ఎన్. కె. బాబు.
ఈ సమావేశానికి సాహిత్య అభిమానులు, విచ్చేసి సభను సుసంపన్నం చేయాలని అధ్యక్ష కార్యదర్శులు సాదరంగా ఆహ్వానిస్తున్నారు.