[dropcap]తె[/dropcap]లంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శ్రీ క్రోధినామ ఉగాది పండుగను పురస్కరించుకుని నిర్వహించిన కవిసమ్మేళనంలో పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ కవులు కోట్ల వేంకటేశ్వరరెడ్డి, డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ పాల్గొన్నారు.
హైదరాబాదులోని రవీంద్రభారతిలో ఏప్రిల్ 9 న జరిగిన ఉగాది కవిసమ్మేళనంలో కోట్ల వేంకటేశ్వరరెడ్డి ‘ఉగాది ఒక భావగీతం’ అనే కవితను, డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ‘నాందీవాచకం’ అనే కవితను చదివారు.
అనంతరం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ కవులను శాలువా, నగదుతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు డా.ఎన్.గోపి, గోరటి ఎంకన్న, సభాధ్యక్షులు డా.అమ్మంగి వేణుగోపాల్, యాకూబ్, కవులు పాల్గొన్నారు.