వినాయక చవితి 2024 ప్రత్యేక సంచికకై రచనలకు ఆహ్వానం – ప్రకటన

1
2

[dropcap]ఈ[/dropcap] ఏడాది శ్రీరామనవమి సందర్భంగా సంచిక వెబ్ పత్రిక ప్రత్యేక సంచిక వెలువరించిన సంగతి తెలిసినదే.

ఈ క్రమంలోనే వచ్చే నెలలో రానున్న వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రత్యేక సంచిక వెలువరించాలని ప్రయత్నిస్తున్నాము.

ఇందుకు గాను వినాయక చవితి సంబంధిత కవితలు, కథలు, వ్యాసాలు తదితర రచనలను ఆహ్వానిస్తున్నాము.

మీ రచనలను kmkp2025@gmail.com అనే మెయిల్‍కి గానీ లేదా 9849617392 అనే నెంబరుకు వాట్సప్ గాని చేయవచ్చు.

వినాయక చవితి 07 సెప్టెంబరు 2024, శనివారం నాడు వచ్చింది. స్పెషల్ ఇష్యూ 08 సెప్టెంబరు 2024 ఆదివారం నాడు వెలువడుతుంది.

ఈ స్పెషల్ ఇష్యూ కోసం రచనలు మాకు 03 సెప్టెంబరు 2024 నాటికల్లా పంపగలరని మనవి.

రచయితలకు సూచనలుః

— రచనల నిడివి పరిమితిలేదు.

—రచన ఏ ప్రక్రియలోననినా రాయవచ్చు.. కథ, కవిత, పద్య కవిత, వ్యాసం, కార్టూన్ వగైరా…వగైరా…

—రచన ప్రధానంగా వినాయక చవితి, వినాయకుడికి సంబంధించనదై వుండాలి.

—రచనలు పండుగ ప్రాశస్త్యన్ని, వైశిష్ట్యాన్ని, తత్త్వాన్ని ప్రదర్శించేవిగా వుండటం వాంఛనీయం.

—ప్రపంచవ్యాప్తంగా వినాయక చవితి జరుపుకునే పధ్ధతులను, వినాయకచవితి పరమార్ధాన్ని తెలిపే రచనలకు ప్రాధాన్యం.

—-పురాణాలను దూషించటం, వక్రంగా వ్యాఖ్యానించటం, దేవీ దేవతలను అవమానించటం, భారతీయ ధర్మాన్ని తప్పుగా చూపించటం సంచిక ప్రోత్సహించదు. అలాంటి రచనలకు ప్రత్యేక సంచికలో స్థానంలేదు.

ధన్యవాదాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here