[dropcap]‘ప[/dropcap]ద్యరచన’ తెలుగు భాష నుదుటిపై ‘తిలకం’ అయితే- ‘వచన కవిత్వం’ తెలుగు భాషామతల్లికి కంఠాభరణం వంటిది.
ప్రపంచంలో ప్రతి భాషకూ తనదైన ఒక ప్రత్యేక వ్యాకరణం, భావవ్యక్తీకరణ, ప్రక్రియలు వుంటాయి.
పార్సీ భాషకు రుబాయీ,
ఉర్దూ భాషకు ఘజల్,
ఇంగ్లీషు భాషకు సానెట్,
జపానీయులకు హైకూలు ప్రత్యేకమైనవి. అయితే –
తెలుగు భాషకు ‘పద్యం’ ప్రత్యేకమైనది. తెలుగు భాషలో తప్పించి మరే ఇతర భాషలోనూ ఛందోబద్ధమైన పద్యాన్ని ఇప్పటికీ సజీవంగా, ఇంత విస్తృతంగా రాస్తున్నవారు లేరు.
ఈనాటి తెలుగు కవుల్లో చాలా మంది పర భాషలకు చెందిన ప్రత్యేక ప్రక్రియలకు ఇస్తోన్న ప్రాధాన్యం , వాటి రచనలో ఒరదర్శిస్తున్న ఉత్సాహం మనదయిన పద్య రచనకు ఇవ్వకపోవడం చింతించదగిన విషయం!
ఛందస్సును సర్పపరిష్వంగంగానో, భావవ్యక్తీకరణకు ప్రతిబంధకంగానో భావిస్తున్నంతకాలం పద్యానికి ప్రాధాన్యత లభించదు.
అందుకే – తెలుగు పద్యానికి కొంతైనా పూర్వ వైభవం కల్పించాలన్న సదుద్దేశంతో.. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ‘ఉగాది’ (2025) పర్వదినం సందర్భంగా ‘సంచిక-డాక్టర్ అమృతలత’ సంయుక్తంగా పద్య కావ్య రచన పోటీ నిర్వహిస్తున్నారు.
ఈ పోటీని సంచిక- డాక్టర్ అమృతలతల తరఫున నిర్వహిస్తారు మాన్యులు, పండితులు శ్రీ ఏల్చూరి మురళీధర రావుగారు.
పద్య కావ్య పోటీ నిబంధనలు:
- కావ్యం స్వేచ్ఛావస్తువుతో సలక్షణమైన భాషలో 350 పద్యాలకు మించకుండా రచించినదై ఉండాలి.
- ముద్రిత రచనలను, అనువాదాలను, శతకాలను, స్తోత్రాదులను, ఖండకావ్య సంపుటులను పంపించవద్దు.
- రచనలో అక్షరదోషాలు లేకుండా సరిచూసుకొని, టైపు చేయించిన (లేదా) స్పష్టమైన వ్రాతప్రతి యొక్క పిడియఫ్ ప్రతిని మాత్రమే పంపించాలి.
- ఒకరు ఒక్క రచనను మాత్రమే పంపించాలి. ఒకసారి ప్రతిని పంపించిన తర్వాత మార్పులు, చేర్పులు, సవరణలు అంగీకరింపబడవు.
- రచన పిడియఫ్ ప్రతి మొదట అది మీ స్వీయకృతి అన్న హామీ పత్రాన్ని, మీ చిరునామా, ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడి స్పష్టంగా పేర్కొనాలి.
- రచనకు ఏ కలం పేరు వాడినా కవి అసలు పేరు తప్పనిసరిగా హామీ పత్రంలో రాయాలి.
- ఏ రాష్ట్రమైనా, ఏ దేశంలో ఉన్న తెలుగు వారైనా కావ్యాలు పంపవచ్చు.
- బహుమతుల విషయంలో న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు.
- కావ్యం ప్రతులపై కవి పేరు ఉండరాదు. విడిగా హామీపత్రంపై మాత్రమే పేరు, ఫోన్ నంబరు, ఈ-మెయిల్ ఐడీ రాయాలి.
- కావ్యాలు పంపవలసిన చివరి తేదీ 31/1/2025.
పంపాల్సిన విధానం:
మెయిల్ ద్వారా పంపాల్సిన చిరునామా – sanchikapadyakaavyapotee2025@gmail.com
మెయిల్ సబ్జెక్ట్ లైనులో సంచిక-డాక్టర్ అమృతలత పద్య కావ్య రచన 2025 పోటీకి అని వ్రాయాలి.
వాట్సప్ ద్వారా అయితే – 9849617392. సంచిక-డాక్టర్ అమృతలత పద్య కావ్య రచన 2025 పోటీకి అని వ్రాయాలి.
By Post (పోస్ట్ ద్వారా అయితే):
(గమనిక: పోస్ట్ ద్వారా పంపేవారు విధిగా ఒక కాపీ తమ దగ్గర వుంచుకోవాలి).
Sachika Web Magazine
Plot no 32, H.No 8-48
Raghuram Nagar Colony.
Aditya Hospital lane
Dammaiguda, Hyderabad-500083
అనే చిరునామాకి పంపాలి. పోస్టల్ కవర్ మీద తప్పనిసరిగా సంచిక-డాక్టర్ అమృతలత పద్య కావ్య రచన 2025 పోటీకి అని వ్రాయాలి.
బహుమతి సొమ్ము ప్రకటన తరువాత వెలువడుతుంది.
ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు – శ్రీ అపురూప వేంకటేశ్వర స్వామి దేవాలయం, మామిడిపల్లి, నిజామాబాదులో ‘ఉగాది – 2025’ పర్వదినం సందర్భంగా జరిగే ‘ కవి సమ్మేళనం’లో ‘బహుమతి’ ప్రదానం జరుగుతుంది.