[dropcap]శ్రీ[/dropcap] విశ్వావసు నామ సంవత్సర ‘ఉగాది’ (2025) పర్వదినం సందర్భంగా సంచిక- సాహితీ ప్రచురణలు సంయుక్తంగా వచన కవితల పోటీని నిర్వహిస్తున్నారు.
సంచిక- సాహితీ ప్రచురణల తరఫున వచన కవిత పోటీని నిర్వహిస్తున్నారు కవి శ్రీ ఆచార్య ఫణీంద్ర.
వచన కవిత పోటీ నిబంధనలు:
- రచనలో అక్షరదోషాలు లేకుండా సరిచూసుకొని, టైపు చేయించిన (లేదా) స్పష్టమైన వ్రాతప్రతి యొక్క పిడియఫ్ ప్రతిని మాత్రమే పంపించాలి.
- ఒకరు ఎన్ని కవితలనైనా పంపించవచ్చు. అలాగని ఒకేసారి ఒక పుస్తకానికి సరిపడ కవితలను పంపకూడదు.
- ఒకసారి ప్రతిని పంపించిన తర్వాత మార్పులు, చేర్పులు, సవరణలు అంగీకరింపబడవు.
- వీలయినంతవరకూ కవితలో రాజకీయాలు, విద్వేష భావనలు ఉండకూడదు. కవిత ప్రధానంగా రసమయమయి వుండాలి. అనుభూతి ప్రధానమై వుండాలి.
- ఇంతకుముందు ఎక్కడా ప్రచురితం కాని రచనలను మాత్రమే పోటీకి పంపాలి.
- ఇప్పటికే ఎక్కడైనా పరిశీలనలో ఉన్న రచనలు పోటీకి అనర్హం.
- పై అంశాలను ధృవీకరిస్తూ హామీపత్రం తప్పనిసరిగా జతపరచాలి.
- రచనకు ఏ కలం పేరు వాడినా కవి అసలు పేరు తప్పనిసరిగా హామీ పత్రంలో రాయాలి.
- కావ్యం అనువాదం, అనుకరణ, అనుసరణ కాదని హామీపత్రంలో స్పష్టం చేయాలి.
- ఏ రాష్ట్రమైనా, ఏ దేశంలో ఉన్న తెలుగు వారైనా కావ్యాలు పంపవచ్చు.
- పోటీలో బహుమతి పొందిన ఏ కవితనైనా, ఫలితాలు వెలువడిన తరువాత వెనక్కి తీసుకునే అవకాశం లేదని గమనించగలరు.
- బహుమతుల విషయంలో న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు.
- కవితలపై కవి పేరు ఉండరాదు. విడిగా హామీపత్రంపై మాత్రమే పేరు, ఫోన్ నంబరు, ఈ-మెయిల్ ఐడీ రాయాలి.
- కవితలు పంపవలసిన చివరి తేదీ 31/1/2025.
పంపాల్సిన విధానం:
మెయిల్ ద్వారా పంపాల్సిన చిరునామా – sanchikavachanakavitapotee2025@gmail.com
మెయిల్ సబ్జెక్ట్ లైనులో సంచిక – సాహితీ ప్రచురణలు 2025 ఉగాది వచన కవితల పోటీకి అని వ్రాయాలి.
వాట్సప్ ద్వారా అయితే – 9849617392. సంచిక – సాహితీ ప్రచురణలు 2025 ఉగాది వచన కవితల పోటీకి అని వ్రాయాలి.
By Post (పోస్ట్ ద్వారా అయితే):
(గమనిక: పోస్ట్ ద్వారా పంపేవారు విధిగా ఒక కాపీ తమ దగ్గర వుంచుకోవాలి).
Sachika Web Magazine
Plot no 32, H.No 8-48
Raghuram Nagar Colony.
Aditya Hospital lane
Dammaiguda, Hyderabad-500083
అనే చిరునామాకి పంపాలి. పోస్టల్ కవర్ మీద తప్పనిసరిగా సాహితీ ప్రచురణలు 2025 ఉగాది వచన కవితల పోటీకి అని వ్రాయాలి.
***
బహుమతి సొమ్ము ప్రకటన తరువాత వెలువడుతుంది.
ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు – శ్రీ అపురూప వేంకటేశ్వర స్వామి దేవాలయం, మామిడిపల్లి, నిజామాబాదులో ‘ఉగాది – 2025’ పర్వదినం సందర్భంగా జరిగే ‘ కవి సమ్మేళనం’లో ‘బహుమతి’ ప్రదానం జరుగుతుంది.