3. కవితావనిత

0
4

[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీలలో సంచిక సంపాదకవర్గం వారి ప్రోత్సాహక బహుమతి పొందిన కవిత. [/box]

[dropcap]అ[/dropcap]పార క్షమాగుణాన ధరిత్రి
అపాకృత యాతనాన పూజ్యజనయిత్రి
పవిత్రస్తన్యస్రవాన సవిత్రి
కరుణాకాంతి రీతిన సావిత్రి
మనఃతలపునందున పావన హవిత్రి
జననీజనకఆశాస్వప్నాన ఆనందపుత్రి
రచనారంగకౌశలాన రచయిత్రి
కవనలాఘవాన కవయిత్రి
అభినవ అభినయాన అభినేత్రి
అనురాగ మంత్రాన గాయత్రి
స్వరవిశేషాన మధుగాత్రి
స్పర్శావిషయాన మృదుగాత్రి
నయన అందాన ఝషనేత్రి
హితమహిత ద్వయాన గంగోత్రి
అమితాహార దాతృత్వాన అమృతనేత్రి
అమరప్రేమవృక్షాల హారాన హరితధాత్రి