[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత. [/box]
[dropcap]ఓ[/dropcap] మహాత్మా నీవు ఎంత మంచి వాడవు
నీ మంచితనము ప్రజలూ గుర్తించారు
ఒక చెంప పై కొడితే ఇంకొక చెంప చూపమన్నావు
సత్యం ఆచరిస్తే, ఆ సత్యం స్వేచ్ఛనిస్తుందన్నావు
సత్య ఆచరణే నిజమైన విజ్ఞానమన్నావు
హింస ద్వారా ఏది సాధించలేము
అని నిరూపించావు
అహింసతోనే సమస్తము సాధ్యమన్నావు
సేవ చేయటమనేది మన అదృష్టము అన్నావు
వారికి సేవ చేసుకునే అవకాశము రావటం
మన అదృష్టము అన్నావు
అది నేటి రాజకీయ నాయకులకు తెలియకున్నది
సత్యాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించి
చూపించిన ధీశాలివి నీవు
దుష్టులను కూడా శ్రమించి ప్రేమించాలన్నావు
ప్రేమతో ఏదైనా సాధించవచ్చని నిరూపణ చేశావు
అలా నీ విగ్రహం వద్ద నీ చేతిలో కర్ర పట్టుకుని వున్ననూ
పక్షులు కూడా నీ వద్దకు వచ్చి నీతో స్నేహం
చేస్తున్నాయంటే పక్షులకు కూడా నీవంటే
ఎంత నమ్మకమో నీవు గాంధీ మహాత్ముడవని
అహింస తప్ప హింస నీవు చేయవని వాటికి తెలిసింది
అందుకే ఓ మహాత్మా నీ అహింసను నిన్ను మరువలేకున్నాము.