Site icon Sanchika

31. రైతన్నా! నీకు వందనం

[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత. [/box]

[dropcap]ఓ[/dropcap] రైతన్నా!
నేల చూసి – దమ్ముచేసి
దుక్కిదున్ని – విత్తు వేసి
నారు పోసి – నీరు పెట్టి
కలుపు తీసి – అప్పు చేసి
పురుగుమందు తెచ్చి – పంటకు కొట్టించి
నీ డొక్కను ఎండగట్టి – మా కడుపుకు ముద్దపెట్టి
పంట చేతికొచ్చేవేళ – వర్షాలు ముంచెత్తి
అప్పిచ్చిన వాడు వచ్చి – నిన్ను చుట్టుముడితె
దిక్కు తోచక, దారి లేక – అవమానం తాళలేక
పురుగుమందు తాగి – నీ గుండె ఆగి
నీ పెళ్ళాం బిడ్డల్ని – అనాథల్ని చేసి
మా కడుపులు నింపుతున్న – రైతన్నా నీకు వందనం.
రైతన్నే లేకపోతే – లేదు మనకు మనుగడ
అందుకే అతనికి – ఇవ్వాలి మన అండదండ
రైతన్నకు కావాలి – తగిన సమయస్ఫూర్తి
రాబోయే తరాలకు – రైతే ఒక స్ఫూర్తి
వ్యవసాయం లేకపోతే – లేదు మనకు కూడు
అందుకే ఇవ్వాలి – రైతుకు మన తోడు
డాక్టరు కన్నా, యాక్టరు కన్నా, కలెక్టరు కన్నా
అందరి కన్నా నువ్వే మిన్న ఓ రైతన్నా.
అందుకే రైతన్నా – నీకు వందనం.

Exit mobile version