[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత. [/box]
[dropcap]స్వా[/dropcap]తంత్ర్యమా….నువ్వెక్కడ….?
కాకెత్తుకెళ్లిన తాయిలమయ్యావు….
అవతరించిన అర్ధరాత్రంటే మక్కువేమో…
చక్కంగా వెళ్ళి చుక్కల్లో దాగి పోయావు….
స్త్రీలకు రక్షణ లేని ఈ దేశంలో
మూగవయ్యావు….
పసిపిల్లల ఆక్రందనల్లో
నిశ్శబ్ద గీతమయ్యావు ….
కులాల కుమ్ములాటల్లో
ప్రత్యక్ష సాక్ష్యమయ్యావు…..
రాజకీయపు నాటకాలను చూసి
నువ్వు నివ్వెర పోయావు….
కలికాలపు విన్యాసాలు చూసి
నువ్వు కంట తడి పెట్టుంటావు ….
రక్షణ లేదంటూనే వలువలకు విలువలు వదిలిన
వనితలను చూసి విస్తు పోయుంటావు….
భారమని తల్లిదండ్రులను దూరంగా
వదిలిన సంతానాన్ని చూసి నువ్వెప్పుడో సంతాపం తెలిపుంటావు….
భజనలు దైవానికేగా ఇపుడేంటిలా
మనుషులక్కూడా అనుకుని మూగవయ్యావు….
పరిపాలించాల్సిన ప్రభుత్వం శాసిస్తుంటే….
నవభారతమంటే ఇదేనా అనుకుని
నువ్విపుడు మాయమయ్యుంటావు…..
అందుకే ….
స్వాతంత్ర్యమా… నువ్వెక్కడ …?