[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీలలో న్యాయ నిర్ణేతల ద్వారా తృతీయ ఉత్తమ బహుమతి పొందిన కవిత. [/box]
[dropcap]చే[/dropcap]తవెన్నముద్ద చెప్పిన అమ్మయే
అక్కఅన్ననాన్న అమ్మనేర్పె
తెలుగుభాషనేర్పితేజమిచ్చినదమ్మ
అమ్మభాషనాకుఅమృతమయ్యె
ఓనమాలునేర్పెఒజ్జగనాన్నయె
తెలుగుభాషతీపితేటబరచి
బాషపలుకునేర్పెబాటవేసెనుగాదె
అమ్మభాషనాకుఅమృతమయ్యె
శతకపద్యమిచ్చి చక్కజేసె
భషమీదద్యాసబలపడజేయంగ
అమ్మభాషనాకుఅమృతమయ్యె
పురుషులందుపుణ్యపురుషులువేరనుచు
వేమనార్యుపలుకువేదమవ్వ
నీతిభోదతోడ సేతువునిర్మించు
అమ్మభాషనాకుఅమృతమయ్యె
బమ్మెనార్యుపలుకుబహుదొడ్డదవంగ
తెలుగుకీర్తియిలనుతేజరిల్లె
తేటతెల్లమయ్యెతెలుగువెల్లివిరిసె
అమ్మభాషనాకుఅమృతమయ్యె
అన్యభాషలెన్నిఅలవోకనేర్చినా
తెలుగుభాషనాకుతల్లికాగ
అన్యభాషతోడ ఆకలితీరినా
అమ్మభాషనాకుఅమృతమయ్యె
భాగవతముతోడ బాసిల్లతెలుగిల
దేశభాషలందుతెలుగులెస్స
నృపులనోటినుంచి నురకలువేయంగ
అమ్మభాషనాకుఅమృతమయ్యె
చెళ్ళపిళ్ళ వారిచెల్లియోచెల్లకో
రాయభారమందురమ్యమగుచు
పద్యవిద్యయందుపల్లవించతెలుగు
అమ్మభాషనాకుఅమృతమయ్య
ఆంద్రదేశమందు అలరారుతెలుగుయే
మేటిభాషగానుమెరయుగాదె
ఎన్నిభాషలున్న ఏమిఫలంబురా
అమ్మభాషనాకుఅమృతమయ్యె
తెలుగుమరుగుకాకతెలియజెప్పంగను
వెలుగునింపుచుండెతెలుగువెలుగు
భావితరములందుబాసిల్లజేయంగ
అమ్మభాషనాకు అమృతమయ్యె