Site icon Sanchika

39. అడుగుల సవ్వడి

2018 దసరా కవితల పోటీలలో పాఠకుల ఓట్ల ఆధారంగా ఎంపికైన తృతీయ ఉత్తమ కవిత.

స్వప్నమో ఏమో
తెలియదు……..  నీ రాక…..
మల్లెల వాగులో
వెన్నెల పడవలా ఉంటోంది….!

తడి రెప్పలను తాకిన
నీ స్పర్శ
కల అయిన అద్భుతమే …..
రాలిన పొగడపూలలా సున్నితంగా…..!

సంగీత లయను పోలిన
ఏదో ఓ తీయని సడి
అది నీదే ఏమో ….
ఇంకా వినిపిస్తోంది మెలకువలోనూ….
నను వీడనంటూ…..!

మదికెంత ఊరటో
విరిగిన మమతల గూడును
మళ్ళీ అల్లుకుంటోంది….!

ఇప్పుడు అధరాలపై
ఓ కమ్మని చిరుహాసం
నేను రాసే కవితల కన్నా
మధురంగా….. !

ఓ స్నేహమా….!

ఇది కలే కదూ…!

చూడు నా కళ్ళెంత మురిసిపోతున్నాయో…. నీపాద స్పర్శను అనుభూతిస్తూ ….!

నడిచిరావా ప్రతిరేయీ….
నా స్వప్నాల సౌధం లోకి…..

నాకే వినిపించే
అడుగుల సవ్వడితో…..!!

Exit mobile version