Site icon Sanchika

51. రాజకీయ క్షేత్రమున

[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత. [/box]

[dropcap]రా[/dropcap]జకీయ క్షేత్రమున అలుపెరగని యోధుడా
జాతీయతా నేర్పిన భారతీయ పౌరుడా
మరువలేము మీ సేవలు ఓ కార్గిల్ వీరుడా!
ఆర్యసమాజంతో కార్యశీలత ఆరంభించి
కల్మషపు కుట్రలను అనుక్షణం త్యజించి
వెలిగావు బ్రాహ్మచారిగా ఆ జన్మాంతం జీవించి
బాల్యమందు కలమెత్తగ యవనమందు గళమెత్తగ
బ్రహ్మాండమైతివి భారతరత్న నిను వరించగా
బటేశ్వరా ప్రాంతమందు భరతమాత ముద్దుబిడ్డ
వినుతికెక్కి విరాజిల్లె నేడు ఆ పుణ్యగడ్డ
భారతమధ్య ప్రాంతం లో జనించిన బిహారి
అందుకో ధీరుడా మా మధుర కవితా నివాళి
లోకసభన లోకులెంచె నాయకుడిగ నడిసొస్తివి
రాజసభన రాజసముగ రాజువై వికసిస్తివి
ఆచార్యుని పథము లోన సరస్వతిని మెప్పిస్తివి
మాయమైన మానవతను మంత్రిగానె రప్పిస్తివి
మీ ప్రతిభాపాటవములు పదిమందికి ఆదర్శం
మీ సంరక్షణ సారథ్యం సంఘమునకె నిదర్శనం
ఉద్యమాలు ఉప్పెనల్లె ఉరకలెత్తె నీ నవయువ ప్రాయముగ
జనులందరు శోకమెత్తె నీ చితియే దివి జేరగ
ఎమర్జెన్సి కాలమైన కసిగొట్టెను నిన్ను జూసి
ఏల పోతివి మా బోటి అభిమానపు జనులబాసి
కళలయందు పరవశించి తనువు మరచి  ముగ్ధుడైతివి
సభలయంద ఝులిపించే ఓంకార నాదమైతివి
లోకమాన్య సత్కారపు సంతతియె నిను చేరగ
పార్లమెంటు ప్రతిభ కూడ పరుగెత్తెను మిము చూడగ
పలు భాషల భాషణం లో పదుగురైన సాటిరారు
సమసినట్టి మీ భవితము ముత్తెమోలె మాణిక్యపు తీరు
భారతీయ పదానికే నిలువెత్తు నిదర్శనం మీగమనం
సమైక్యతా జగతికై అవసరం మీ పునర్జననం
వైరి పక్షమును వెన్ను విరిచిన విలక్షణుడవు
సర్వజనుల మదిలో మరువలేని మహనీయుడవు
మేరు శిఖరము నేలకొరిగి నింగిచేరెను
సర్వస్వము త్యాగమొంది సర్వజనులకండైతివి
విపక్షాన జూలు విదిల్చి విశ్వరూపము తీస్తివి
భారతీయ పదమునకే వన్నె తెచ్చిన దివ్వెవైతివి
భరతమాత తనబిడ్డని నిన్ను చూసి ఎంతొ ముచ్చటపొందె
మితవాదిలో అతివాదిగ గళమెత్తి కలమెత్తి దివికెళ్తివి
మతవాదిగ లౌకికమును పదుగురికి పంచిపెడితివి
పరాజయమెన్నడు ఎరుగనట్టి పరిపాలన దక్షడవు
గతిచెదిరిన రాజకీయ గమనమును సరిదిద్దిన గగనం లో జ్వాలైతివి
దేశచక్రము తిప్పి దిశాదిశాన దివ్వెవైతివి
సకల జీవితంబు అంకాతంబు పూని అవనికెల్ల అండదండైతివి
సంపాదక వర్గమందు సకల లోకాన్నంత పుటలపై లిఖిస్తివి
ఆరు నూరైన ఆరెస్సెస్ మార్గమునకే మనసిస్తివి
పాంచజన్య వారసత్వ పత్రికందు జగమేలిన సత్యమంత కైకడితివి
జనులు బాధలు తీర్చి భారతీయ బాసటైతివి
అవని పథమున అదృశ్యము గాంచి అంతులేని అస్త్రమైతివి
నాసిరకము నీటనొదిలి నాణ్యమైన నాయకునిగ నడిసొస్తివి
క్రియాల జీవితమున జీతమొదలి జీవనదిగ జీవిస్తివి
ముఖర్జీ ముఖము నందు మువ్వన్నెల నవ్వువై పయనిస్తివి
అమెరికకు మూడు తరముల ముచ్చెమటలు నింపి భారతాన్ని మురిపిస్తివి
ప్రజాక్షేమమె ధ్యేయమంటు వ్యక్తిగతము వీధిలోన విడిచేస్తివి
స్వార్థ రాజకీయ దోమలు నీ తరమున విలువలేక విలవిలలాడె
అట్టడుగు వర్గాల జనుల మదిలో ఆనందముగ వికసిస్తివి

Exit mobile version