Site icon Sanchika

53. తాజ్ మహల్

2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత.

పాలరాతి స్వర్గమా,
అందమైన యముననే
అసూయ చెందేలా చేసిన
అద్భుతమా,
భారతదేశపు ఖ్యాతి పెంచిన
కీర్తి పతాకమా…
చరిత్రలోని సజీవ ఘట్టమా..
వెన్నెల అచ్చెరొవందే ఆశ్చర్యమా..
వేల శిల్పుల అపూర్వ చాతుర్యమా…
కవుల కల్పనా భావ సౌధమా..
మంచు వర్షపు వాకిట మాయని పరువమా…
నీ సౌందర్యము వర్ణణాతీతము…

మరిప్పుడో..
మురుగు నిండిన యమున దుర్గంధం ఎదుట
కాలుష్యపు కోరలలో చిక్కుకొని వెలవెలబోతూ..
ఓ ముంతాజ్
శతాబ్దాలపాటు నిద్రించినది చాలు.
దండయాత్రలను సైతం ఎదుర్కొని
స్థైర్యంతో నిలబడ్డ నీ ప్రేమకానుక
మానవ తప్పిదాలను క్షమించి
మానవహరాలలో నీ ప్రేమను ప్రవేశపెట్టి
కాలుష్యాలను ఎదుర్కొనే మార్గాలను
మాలో ప్రవేశ పెట్టి నీ ప్రేమమహల్
కాపాడుకో….!

Exit mobile version