[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత. [/box]
[dropcap]హ[/dropcap]రితాన్ని హరించి
పచ్చని పల్లెలను పట్టణాలుగా
ఆధునికరిస్తున్నాం.
స్వేదం కక్కుతున్న రైతన్న
నాగేటి చేలలో
ఎండిపోయిన నేల తల్లి
రొమ్ములపై దుక్కి దున్నతుంటే
మోడువారిన ప్రకృతితో
నెత్తురోడుతున్న నేలమ్మ
వరుణుడికి ఎన్ని ఆహ్వానాలు పలికినా
నేల దిగిరాలేదు…
కరువు చేత చిక్కి అలసిన రైతన్న మౌనం
మరణానికి మార్గం అయితే…?
మానవాళి మనుగడ ఆగిపోదా.
తెలుసుకో…., మనిషి
నిజమైన అభివృద్ధంటే
పచ్చదనం పెంచడమే.
నాగరికత అంటే
నేలతల్లిని గౌరవించడమే…