[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత. [/box]
[dropcap]అం[/dropcap]దరమూ నింపాదిగా కూచుని
ఆహ్లదంగా నవ్వుతున్నపుడే ఏదో కొరతగా అనిపిస్తోంది
మాటలకూ మాటలకూ మధ్య
ఖాళీ గుసగుసలు లీలగా వినిపిస్తున్నాయి
అంతా జేజేలు కొడుతుంటే… ఒక్కరైనా
నొసలు చిట్లించని వైనాలు ధాఖలు పడుతున్నాయ్
కాదా మరి – ఎవరో ఒకరు ఉండాలి
అంతా పరవశంలో జోగుతుంటే
ఒక్కరైనా అప్రమత్తంగా ఉండాలి
స్తోత్రాలూ స్తోత్రకవచాలు హోరెత్తిస్తోంటే
వెంట్రుక ప్రమాణంలో తప్పిపోయే బాణమెకటి
మొహం మీదుగా దూసుకు రావాలి
రంగుల కలలకు అంతముండదు.. రెటినా అలిసిపోదూ..
కామాతురుణాం అన్నట్లు ఆబగా కీర్తిని ఆకాక్షిస్తూనే ఉంటుంది
భుజం చరిచి మేలుకొలిపే వాళ్ళు కరువయితే
మన భుజాలు మనమే తడుముకోవాలి అసహ్యంగా..!
అందుకే ఇక్కడెవరో తగ్గినట్టుంది అతడో ఆమెయో
ఒక ‘వాక్సునామీ’ ఖచ్చితంగా రంగప్రవేశం చేయాలి
సిగ్గొచ్చేలా నిలదీయాలి… మనం చేయగలగే చేయలేని
మహత్కార్యం కనీసం అలాగయినా పూరించబడాలి..!!
ఒక్కటంటే ఒక్క ప్రశ్న మొలకెత్తాలి…. !!!