61. అమ్మ మాటలే నడిపే ఆయుధాలు

0
3

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

[dropcap]అ[/dropcap]నగ అనగ ఒక ఊర్లో పేద కుటుంబం. ఆ కుటుంబంలో అమ్మా, నాన్న అన్న, ఇద్దరు చెల్లెళ్ళు ఉండేవారు. తండ్రి చేనేత వృత్తితో కుటుంబాన్ని పోషిస్తుండగా, తల్లి మిషన్ కుడుతూ కాలం వెళ్ళదీసేది. తమ కొడుకు కూతురు ఒకే తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదివేవారు. చదువులో అన్ని రంగాల్లోనూ ముందుండేవారు. రెక్కాడితే కాని డొక్కాడని బ్రతుకు వారిది. అందుచేత తల్లి రేయింబవళ్ళు మిషన్ కుడుతూండేది. తల్లికి సహాయంగా వారు తనతో పాటు చేతి పని చేయడం చేస్తూ కాలం వెళ్ళదీసేవాళ్ళు. వాళ్ళ అమ్మ ఎప్పుడూ చెబుతూండేది – కష్టపడాలి, కష్టపడితేనే ఏదైనా సాధించవచ్చని! ఇది ఇలా ఉండగా కొడుకు, కూతురు పదవ తరగతి పూర్తి చేసి జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించారు. ఐఐఐటి బాసరలో ఒకరు, ప్రైవేటు కళాశాలలో ఇంకొకరు ఉచిత ప్రతిభా సీటును సాధించారు. వాళ్ళని నడిపించేది వాళ్ళ అమ్మ మాటలే.

కొంత కాలానికి కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని కలెక్టర్ పరీక్ష రాశాడు. జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. తన ఆనందానికి హద్దులు లేవు. ఇంటికెళ్ళి అమ్మకిది చెప్పగా తన కళ్ళలో ఆనందం చూసి ఎంతో మురిసిపోయాడు. “ఇలా ఉండు, ఇప్పుడే వస్తా.. స్వీట్ చేస్తా” అని ఇంట్లోకెళ్ళగా, ఇంట్లో చిల్లి గవ్వ లేకపోవడంతో, కొడుకుతో, “నాయనా, ఇంట్లో చిల్లిగవ్వ కూడా లేదు” అని అంది.

అప్పుడు కొడుకు “అమ్మా! మనిషిని నడిపించేది డబ్బు కాదు, ప్రేమానురాగాలు అని నువ్వే చెప్పావుగా అమ్మా! ఆ మాటలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. నీ ఆశీర్వాదాలు కావాలమ్మా” అన్నాడు.

అంతలో అతన్ని అభినందించడానికి ప్రధానమంత్రి ఊరికి వచ్చాడు. ఆ అబ్బాయి ఇల్లు అడగగా, వచ్చి చూపించారు. ఆ ఇల్లు చూడగానే ప్రధానమంత్రి ఆశ్చర్యపోయాడు. పూరి గుడిసె. ఆనందమే ఆభరణంగా వాళ్ళింట్లో వాళ్ళు మెరిసిపోతున్నారు. వాళ్ళింటికి వెళ్లి పిలిచాడు. వాళ్ళమ్మ పరుగు పరుగున వచ్చి నమస్కరించింది. వాళ్ళమ్మని అభినందించాడు. కొడుకు వచ్చి నమస్కరించాడు. ప్రధానమంత్రి వాళ్ళ అమ్మానాన్నల మెడలో పూలమాల వేసి ఘనంగా సత్కరించాడు. ఏమైనా పెడదామని తల్లి చూస్తే ఇంట్లో ఏమీ లేదు. చెంబు నిండా నీరు తీసుకెళ్ళి ప్రధానమంత్రికి ఇచ్చింది. వాళ్ళ స్థితి చూసి ఆయన సంతోషంతో లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చాడు. కష్టపడని సొమ్ము మాకు వద్దని తిరస్కరించారు. కొడుకుకి పోస్టింగ్ వచ్చింది. జిల్లా సబ్ కలెక్టరుగా నియమితుడయ్యాడు.

కడుపునిండా భోజనంతో, ఏ లోటు లేకుండా జీవిస్తున్నారు. హేళన చేసినవారే అవసరానికి ‘సార్’ అని పిలిచే స్థితికి చేరుకున్నారు. మసి బట్టలు తొడిగేవాడు సూట్ తొడుగుతున్నాదు. కాలి నడకన వెళ్ళేవాడు, కారులో వెళుతున్నాడు. ఇదంతా తన అమ్మ వల్లేననీ, ఆమె మాటల వల్లే ఎదిగానని చెప్పాడు.