సంచికలో 25 సప్తపదులు-5

1
3

[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]

~

1
ప్రజ్ఞానం
విజ్ఞానం
జ్ఞానం గోచరించాలి అంటే అంతరించాలి అజ్ఞానం

సింగీతం విజయలక్ష్మి
చెన్నై

2
భక్తి
ముక్తి
యుగాలు, అవతారాలు మారినా మారనిది శక్తి.

మొహమ్మద్ అఫ్సర వలీషా
ద్వారపూడి (కోనసీమ జిల్లా).

3
కులం
వ్యాకులం
పిచ్చి ముదిరితే అనిపిస్తుంది మేమే అధికులం

డా.పి.వి.రామ కుమార్
గుంటూరు

4
కొండలు
బండలు
తగనిచోట కండలు కరిగించినా తయారవ్వవు కుండలు

కృష్ణ తేజ
హైదరాబాద

5
సహకారం
అంగీకారం
సమస్య ఏదైనా మనకు చూపగలవు పరిష్కారం

కాయల నాగేంద్ర,
హైదరాబాద్

6
బీరాలు
బేరాలు
చట్టసభల్లో అనుకూలత అధికమయ్యి మరిచిపోరాదు సంస్కారాలు

అభిషేక్
హైదరాబాద్

7
సంసారం
కాసారం
మొసళ్ళను తప్పించుకొని పూలను చిక్కించుకొనటమే జీవనసారం

సూర్యదేవర రవికుమార్
గుంటూరు.

8
తనువు
ధనువు
వలపు బాణాలు సంధిస్తేనే వలరాజుతో మనువు

ఫణీంద్ర విన్నకోట,
హైదరాబాద్

9
రావాలి
కావాలి
చెడుదారులు పడుతున్న పిల్లలలో మార్పు తేవాలి

డాక్టర్. షహనాజ్ బతుల్
హైదరాబాద్

10
రాజ్యం
వీరభోజ్యం
ప్రజాభిమానం గల నేతకే పట్టం సామ్రాజ్యం.

పట్నాల ఈశ్వరరావు
విజయనగరం

11
కష్టాలు
నష్టాలు
ఏవి ఎదురైనా ఎవరేమన్నా వదలకు ఇష్టాలు

గడ్డం దేవీప్రసాద్
బెంగళూరు

12
బుడుగు
పిడుగు
ముళ్ళపూడి ఏడేళ్ల కుర్రాడు -కాడు బడుగు

బులుసు సీతారామ మూర్తి
హైదరాబాదు

13
చదరంగము
రణరంగము
యేన్నో ఆలోచనలతో సతమతము అవుతుంది అంతరంగము

ఆర్. రమాదేవి
వూరు :హైదరాబాద్

14
సన్నకారు
పెద్దకారు
శ్రమనే ఆయుధంగా మలుచుకుంటే అవుతావు షావుకారు.

జి.కె.నారాయణ (లక్ష్మిశ్రీ)
జోగులాంబ గద్వాల్ జిల్లా

15
మనస్తత్వం
స్థిమితత్వం
అవగతమైతే తెలుస్తుంది విశ్వంలో మన అస్తిత్వం .

అవసరాల పద్మజారాణి
విజయనగరం

16
కలిమి
చెలిమి
అతిశయోక్తి లేదు కాదంటే తప్పదు కొలిమి.

కాశీ మూర్తి
హైదరాబాదు

17
వాదం
భేదం
హేతువాదమే సమాజ ప్రగతికి సరియగు జీవనవేదం!

చంద్రకళ.దీకొండ,
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా.

18
నడక
పడక
నిత్యం నియమానుసారం పాటిస్తేనే
అలవడుతుంది నడవడిక

ధరణికోట శివరామప్రసాద్
హైదరాబాద్

19
ఊడిపోతారు
వాడిపోతారు
అహంకారంతో ఉపదేశాలను పెడచెవిని పెడితే ఓడిపోతారు

కృష్ణ తేజ
హైదరాబాద్

20
సహజీవనము
సమభావనము
ప్రజల నడుమ పరిఢవిల్లిన దేశము శాంతివనము.

పట్నాల ఈశ్వరరావు,
విజయనగరం

21
పైకం
మైకం
మందుబాబులు ఇంట వీరంగం__కుటుంబం శోకం

అచ్యుతుని రాజ్యశ్రీ
హైదరాబాద్

22
శౌర్యం
ధైర్యం
జత కూడితే నిర్విఘ్నముగా సాగును కార్యం!

మొర్రి గోపి
కవిటి

23
సమత
మమత
చెట్టాపట్టా లేసుకుని సమాజంలో నిలపాలి మానవత

అమృతవల్లి అవధానం.
హైదరాబాద్

24
ఆరోపణ
ఆక్షేపణ
ఇతరుల మనసు మనం గాయపరిస్తే క్షమాపణ.

కె. ఎమ్. కె. మూర్తి
సికింద్రాబాద్.

25
కలకల
గలగల
జీవితంలో నవ్వు లేకపోతే ప్రాణం విలవిల

శాంతమూర్తి
హైదరాబాద్

~

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here