సినిమా క్విజ్-98

0
2

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

పరభాషల నుండి డబ్ చేయబడ్డ తెలుగు చిత్రాలపై ప్రశ్నలు.

ప్రశ్నలు:

  1. ఎం. ఎ. తిరుముగం దర్శకత్వంలో ఎం. జి. రామచంద్రన్, సావిత్రి నటించిన ‘వెట్టైకారన్’ (1964) అనే తమిళ సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  2. వియత్నాం సుందర్ దర్శకత్వంలో శివాజీ గణేశన్ (ద్విపాత్రాభియనం), నగేష్ నటించిన ‘గౌరవం’ (1973) అనే తమిళ సినిమా తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  3. సురేష్ కృష్ణ దర్శకత్వంలో రజనీకాంత్, మనీషా కొయిరాల నటించిన ‘బాబా’ (2002) అనే తమిళ సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  4. ఎ. మురుగదాస్ దర్శకత్వంలో సూర్య (ద్విపాత్రాభియనం), శృతి హాసన్ నటించిన ‘7 Aum Arivu’ (2011) అనే తమిళ సినిమా తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  5. కె. బాలచందర్ దర్శకత్వంలో కమలహాసన్, రేవతి, శ్రీవిద్య నటించిన ‘పున్నగై మణ్ణన్’ (1986) అనే తమిళ సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  6. అనూప్ సత్యన్ దర్శకత్వంలో సల్మాన్ దుల్కర్, సురేష్ గోపి, కల్యాణి ప్రియదర్శన్‌, శోభన నటించిన ‘వరనే అవశ్యముంద్’ (2020) అనే మలయాళ సినిమా తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  7. ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్ లాల్, గీత, శంకర్ నటించిన ‘అభిమన్యు’ (1991) అనే మలయాళ సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  8. మణిరత్నం దర్శకత్వంలో సల్మాన్ దుల్కర్, నిత్య మీనన్, ప్రకాశ్ రాజ్ నటించిన ‘ఓ కాదల్ కన్మణి’ (2015) అనే తమిళ సినిమా తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  9. టి. ప్రకాశరావు దర్శకత్వంలో ఎం. జి. రామచంద్రన్, బి. సరోజా దేవి నటించిన ‘Padagotti’ (1964) అనే తమిళ సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  10. పి. మాధవన్ దర్శకత్వంలో శివాజీ గణేశన్, శ్రీకాంత్, మేజర్ సౌందరాజన్, కె. ఆర్. విజయ నటించిన ‘తంగపతకం’ (1974) అనే తమిళ సినిమా తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది? (క్లూ: ఇదే కథతో, కొద్దిగా మార్పులు చేర్పులతో ఎన్.టి.ఆర్. తో ‘కొండవీటి సింహం’ సినిమా తీసారు).

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 జూలై 23 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 98 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 జూలై 28 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 96 జవాబులు:

1.మౌనరాగం (1986) 2. పల్లవి అనుపల్లవి (1983) 3. ఘర్షణ (1988) 4. క్షత్రియుడు (1990) 5. దళపతి (1991) 6. రోజా (1992) 7. దొంగ దొంగ (1993) 8. ఇద్దరు (1997) 9. అంజలి (1993) 10. కడలి (2013)

సినిమా క్విజ్ 96 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి. రాజు
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • సునీతా ప్రకాష్
  • శంబర వెంకట రామ జోగారావు
  • తాతిరాజు జగం
  • వనమాల రామలింగాచారి
  • జి. స్వప్నకుమారి
  • టి. మమన్ బాబు
  • కొన్నె ప్రశాంత్
  • ఎం.సి. మోదీన్

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here