[dropcap]ప్ర[/dropcap]ముఖ రచయిత్రి చివుకుల శ్రీలక్ష్మి గారు రచించిన ‘గిరిపుత్రులు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.
***
భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో అడవులను, కొండలను అంటిపెట్టుకొని జీవిస్తున్న అనేక తెగలకు చెందిన కొండజాతుల వారు ఉన్నారు. వారు అక్కడ ఎటువంటి జీవనం గడుపుతున్నారు? ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు? సహాయం చేయగలిగి ఉండి కూడా నాగరిక సమాజం ఎందుకు వారిని ఉపేక్షిస్తుంది? లేదా వారు మిగిలిన వారితో ఎందుకు కలవలేక పోతున్నారు? వారి నమ్మకాలూ, ఆచార వ్యవహారాలూ ఏమిటి? మౌలిక వసతులు కూడా వారికి ఎందుకు అందడం లేదు? అవిద్య కారణంగా ఏ విధంగా అణచివేతకు గురి అవుతున్నారు? వారి గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? గిరిపుత్రులు నివసించే భౌగోళిక స్వరూపాన్ని, చారిత్రక సంఘటనలనూ, తెలిపే చిరు ప్రయత్నంతో పాటు వీటి గురించి ఒక కనీస అవగాహనను అందించే ప్రయత్నం చేస్తుంది ఈ ‘గిరిపుత్రులు’ నవల.
శక్తికి ప్రతీక అయినటువంటి స్త్రీ మూర్తులు ఈ నవలలో తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎటువంటి గంభీరతను ప్రదర్శించారు? ప్రత్యక్షంగా చూసిన కొన్ని అనుభవాలతో ఈ గిరిపుత్రుల గురించి చిరునవలా రూపంలో రచించారు శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి.
***
ఆసక్తిగా చదివించే ‘గిరిపుత్రులు’ ధారావాహిక వచ్చే వారం నుంచే..
చదవండి.. చదివించండి..
‘గిరిపుత్రులు’