[box type=’note’ fontsize=’16’] “కష్టాలు లేని జీవితం ఆనందమయం కానేరదు. నిన్నటి కఠోర జ్ఞాపకాలే ధైర్యానికి పునాదులు” అంటున్నారు కె.వి. సుబ్రహ్మణ్యం ‘కష్టసుఖాలు‘ కవితలో. [/box]
నిన్నటి కఠోర జ్ఞాపకాలే
నేటి ఆనందపుటలలు
అవే ధైర్యానికి పునాదులు
భావి జీవితానికి ఆశలు.
కష్టాలు లేని జీవితం
ఆనందమయం కానేరదు.
సూర్యాస్తమయం లేనిదే
సూర్యోదయంలో ఆనందం ఏదీ?
కళ్ళు కలిపిన ప్రేమ ఆనందం,
తృటిలోనే విరహవేదన
ఆవేదనా భరిత జ్ఞాపకాలతో
జీవించడం మధురమనిపించదూ?