సిరికోన – శ్రీ జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక నవలా రచనా పోటీ 2024 – ప్రకటన

0
2

[dropcap]ప్ర[/dropcap]తి సంవత్సరం సిరికోన సాహితీ అకాడమీ పక్షాన నిర్వహించే స్వ. జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మ స్మృత్యంకిత నవలా రచన పోటీ నిమిత్తం అముద్రిత – అప్రకటిత – తాజా రచనలు ఆహ్వానించబడుతున్నాయి.

ఈ మారు పోటీలోని ముఖ్యంశాలు:

  1. ఉత్తమ నవలకు నగదు బహుమతి 50 వేల రూపాయలు. న్యాయ నిర్ణేతలు సర్వోత్తమంగా దేనినీ నిర్ణయించని పక్షంలో పై బహుమతి మొత్తాన్ని, ప్రథమ (25000/-),  ద్వితీయ (15000/-)  తృతీయ (10000/-) బహుమతులుగా అందజేయబడుతుంది.
  2. రచయితలు తమకు నచ్చిన ఇతివృత్తం మీద తాము స్వేచ్ఛగా రాయవచ్చు.
  3. అధిక సంఖ్యలో మంచి రచనలు వచ్చిన పక్షంలో, న్యాయ నిర్ణేతలు సిఫారసు చేస్తే అదనంగా రెండు ప్రోత్సాహక బహుమతులను కూడా ఇచ్చే అవకాశం ఉంది.
  4. పోటీ కోసం సమర్పించే నవలలు కనీస పక్షంగా 120 పుటలకు తగ్గకుండా ఉండాలి.
  5. ఇతివృత్తంలో కానీ, పాత్ర చిత్రణాది నవలాశిల్పంలో కానీ, ఉన్నత ‘మౌలిక’ ప్రమాణాలతో కూడిన నవలలకే  ప్రాధాన్యం. అనువాద నవలలు పోటీకి అంగీకరించబడవు. స్వతంత్ర రచనలే అయి ఉండాలి.
  6. కేవలం అముద్రిత – అప్రకటిత – తాజా రచనలే పోటీకి స్వీకరించబడతాయి. ఇంతకు మునుపు ఏ పత్రికలో కానీ, సామాజిక మాధ్యమాలలో కానీ ప్రకటించబడి ఉండరాదు. పూర్వం ఏ మాధ్యమంలోనైనా ప్రచురితమైందనే విషయం, నిర్వాహకుల దృష్టికి వస్తే, బహుమతి ప్రదానాల పిమ్మట నైనా, తగు చట్టపరమైన చర్యలు చేపట్టబడతాయి.
  7. పోటీకి నవలలు అందడానికి ఆఖరు తేదీ: రానున్న సంక్రాంతి పర్వదినం (15, జనవరి,2025)
  8. బహుమతి పొందిన రచనలు ప్రచురిస్తే, విధిగా మొదటి అట్ట వెనుక భాగంలో స్వ. జొన్నలగడ్డ రాంభొట్లు- సరోజమ్మల చిత్రంతో పాటు బహుమతి వివరాన్ని ప్రకటించవలసి ఉంటుంది.
  9. పోటీలకు సంబంధించి ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపులు జరుపబడరాదు.
  10. సిరికోన సభ్యులు కాని వారు కూడా ఈ పోటీలో పాల్గొనవచ్చు.

వీలైనంత ఎక్కువ సంఖ్యలో రచయిత(త్రు)లు పాల్గొనాలని అభ్యర్థిస్తున్నాము.

ఏదైనా ఇతర సమాచారం నిమిత్తం క్రింది వారిని సంప్రదించవచ్చు:

(అ) జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం # +1 (214)- 621- 1790 subbujvr@gmail.com

(ఆ) ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ # +1 (341)-356-1093 gangisetty.ln@gmail.com

― సిరికోన (Silicon Academy of Letters)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here