సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహిస్తున్న 2024 దీపావళి కథల పోటీ ప్రకటన

1
4

[dropcap]సం[/dropcap]చిక వెబ్ పత్రిక – డా. అమృతలత సంయుక్తంగా 2024 దీపావళి సందర్భంగా వినూత్న కథల పోటీ నిర్వహిస్తున్నాము.

మొత్తం బహుమతుల విలువ రూ. 20,000/-

కథాంశం ఏదైనా కావచ్చు. కథనానికే ప్రాధాన్యం…

కథల నిడివిపై పరిమితి లేదు.  కథ నవల స్థాయికి ఎదగకపోతే చాలు.

ఒక రచయిత  ఎన్ని కథలనైనా పంపవచ్చు. ఒకరు ఒక కథే పంపాలన్న నియమం లేదు.

కథను టైప్ చేసి పంపితే సంతోషం. చేతి రాతతో పంపేవారు కథను చివరి తేదీ వరకూ ఆగకుండా కాస్త ముందుగానే పంపటం వాంఛనీయం!

నియమ నిబంధనలు:

  • ఇంతకుముందు ఎక్కడా (ప్రింట్‌ పత్రికలలో కానీ, వెబ్‌ పత్రికలలో కానీ, వ్యక్తిగత బ్లాగులలో కానీ, ఫేస్‍బుక్/వాట్సప్ గ్రూపులలో కానీ) ప్రచురితం కాని కథలను మాత్రమే పోటీకి పంపాలి.
  • ఇప్పటికే ఎక్కడైనా పరిశీలనలో ఉన్న రచనలు పోటీకి అనర్హం.
  • పై అంశాలను ధృవీకరిస్తూ హామీపత్రం తప్పనిసరిగా జతపరచాలి.
  • రచనకు ఏ కలం పేరు వాడినా రచయిత/రచయిత్రి అసలు పేరు తప్పనిసరిగా హామీ పత్రంలో రాయాలి.
  • కథ అనువాదం, అనుకరణ, అనుసరణ కాదని హామీపత్రంలో స్పష్టం చేయాలి.
  • రచయితలు తప్పనిసరిగా తమ ఈ-మెయిల్ అడ్రెస్సు, సెల్ నంబరును హామీ పత్రంలో రాయాలి.
  • ఏ రాష్ట్రమైనా, ఏ దేశంలో ఉన్న తెలుగు వారైనా కథలు పంపవచ్చు.
  • అందిన కథలు సంచికలో ప్రచురితమవుతాయి.
  • పోటీలో బహుమతి పొందిన ఏ కథనైనా, ఫలితాలు వెలువడిన తరువాత వెనక్కి తీసుకునే అవకాశం లేదని గమనించగలరు.
  • బహుమతుల విషయంలో న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు.
  • బహుమతి ప్రకటనలయిపోయిన తరువాత ఎవరయినా ఈ నియమనిబంధనలను ఉల్లంఘించారని తెలిస్తే, బహుమతి రద్దవుతుంది. 
  • కథలు పంపవలసిన చివరి తేదీ 30/9/2024.

పంపాల్సిన విధానం:

మెయిల్ ద్వారా కథలు పంపాల్సిన చిరునామా – sanchikakathalapoteelu@gmail.com మెయిల్ సబ్జెక్ట్ లైనులో సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహిస్తున్న 2024 దీపావళి కథల పోటీకి అని వ్రాయాలి.

వాట్సప్ ద్వారా అయితే – 9849617392. సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహిస్తున్న 2024 దీపావళి కథల పోటీకి అని వ్రాయాలి.

By Post (పోస్ట్ ద్వారా అయితే):

(గమనిక: పోస్ట్ ద్వారా పంపేవారు విధిగా కథ కాపీ తమ దగ్గర వుంచుకోవాలి).

Sachika Web Magazine

Plot no 32, H.No 8-48

Raghuram Nagar Colony.

Aditya Hospital lane

Dammaiguda, Hyderabad-500083

అనే చిరునామాకి పంపాలి. పోస్టల్ కవర్ మీద తప్పనిసరిగా సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహిస్తున్న2024 దీపావళి కథల పోటీకి అని వ్రాయాలి.

ఫలితాలు 2024 దీపావళి నాడు వెలువడతాయి. అనంతరం సంచిక వెబ్ పత్రికలో బహుమతి పొందిన కథలు, పోటీకి అందిన ఇతర కథలూ వరుసగా ప్రచురితమవుతాయి.

పోటీ కథలు ప్రచురితమయిన తరువాత ఆ కథలను విశ్లేషిస్తూ అందిన విమర్శలలో ఉత్తమ విమర్శకు ప్రత్యేక బహుమతి వుంటుంది. అంటే, కథలు చదివి విశ్లేషణ  రాయాలన్నమాట. రచయితలకే కాదు, చదివిన  పాఠకులకూ బహుమతులుంటాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here