[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘ఒంటరివి కాదు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]ఒం[/dropcap]టరి అని బెంగేలా
భయమేలా
ఎంతటి బలమో
ఆ ఒంటరితనం
ఒక్కటిగా వుంచుతుంది
నీపై నీకు మక్కువ పెంచుతుంది
అక్కున చేర్చుకుని
చక్కటి ఓదార్పు ఇస్తుంది
దిక్కులకు అవతల కూడా
నీ గొంతే వినిపిస్తుంది
మొక్కవోని ధైర్యాన్నిచ్చి
మొక్కులన్నీ తీరుస్తుంది
కావలిస్తే అడుగు
ఆ ఒక్క సూర్యున్ని
ఈ పక్క చంద్రున్ని
ఒకటి ఒంటరి కాదని
కోటానుకోటికి సాటి అని
పదే పదే చెబుతాయి
ఇదే ఇదే వినమంటాయి