[శ్రీమతి వి. నాగజ్యోతి రచించిన ‘కడలి స్వగతం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]తీ[/dropcap]రం చేరని నా అలల పరుగే
ప్రేమగాథలు
నన్ను గమనించు
నాలో తొంగిచూడు
నీవూ కవివై అంతటా
కీర్తింపబడతావు
సమయం లేదంటూనే
నాకోసం వస్తావు
అందరికీ తెలిసే వరకూ తరచూ
నా సహాయాన్ని కోరుతావు
నాచెంత నిలుస్తావు
అన్నీ దొరికాక నాకు
దూరమౌతావు
ఆనందంతో అలసిపోయి
అన్నీ వదిలేసి మనశ్శాంతికై
మరలా నాచెంత చేరి
నీ కథనూ నా అలలలో చేర్చి
వేరొకరికి అందిస్తావు