[జూలై 21 గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘గురుదేవో భవ!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]త[/dropcap]ప్పేమైనా చేస్తే సున్నితంగా మందలిస్తూ
మనలో దాగిన అజ్ఞానమనే చీకటిని పారద్రోలేలా
మానవతా జ్యోతులు వెలిగించే వెలుగుదివ్వెలు గురువులు!
నలుగురితో సఖ్యతగా, సన్నిహితంగా, ఆత్మీయంగా
ఎలా మసలుకోవాలో సూచించే సన్మార్గదర్శకులు గురువులు!
జ్ఞానామృతాన్ని ప్రసాదించే వాళ్ళు గురువులు!
తమ బోధనలతో
మనలో పాఠాలపై శ్రద్దాసక్తులు కలిగించే
ఉత్తములు,స్ఫూర్తిప్రదాతలు గురువులు!
సందేహం ఎంతటి క్లిష్టమైనదైనా ఇట్టే తీర్చే
జ్ఞాన గుణవంతులు గురువులు!
తమ శిష్యుల అభ్యున్నతే గురుదక్షిణగా భావించే
మహోన్నత మానవతామూర్తులు..
ఇలలో వెలసిన దైవ స్వరూపులు సద్గురువులు!