సినిమా క్విజ్-99

0
2

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

పరభాషల నుండి డబ్ చేయబడ్డ తెలుగు చిత్రాలపై ప్రశ్నలు.

ప్రశ్నలు:

  1. బి.ఆర్. పంతులు దర్శకత్వంలో ఎం.జి. రామచంద్రన్, జయలలిత, నంబియార్ నటించిన ‘ఆయిరత్తిల్ ఒరువన్’ (1965) అనే తమిళ సినిమా తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  2. శంకర్ దర్శకత్వంలో కమలహాసన్, ఊర్మిళ, మనీషా కొయిరాలా తీసిన ‘ఇండియన్’ (1996) అనే తమిళ సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  3. ఆర్.ఎస్. శక్తి దర్శకత్వంలో రజనీకాంత్, శ్రీదేవి నటించిన ‘ధర్మ యుద్ధం’ (1979) అనే తమిళ సినిమా తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది? (క్లూ: శ్రీదేవి పై చిత్రీకరించిన ‘నీ కనులలోన మురిసే మదిలోన కురిసే విరి వాన’ అనే పాట తెలుగు వెర్షన్‍లో ప్రసిద్ధి)
  4. ఎ.సి. త్రిలోగచందర్ దర్శకత్వంలో శివాజీ గణేశన్, కె.ఆర్. విజయ, జయచిత్ర, అక్కినేని నాగేశ్వరరావు (అతిథి పాత్ర) నటించిన ‘భారత్ విలాస్’ (1973) అనే తమిళ సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  5. అట్లీ దర్శకత్వంలో విజయ్, సమంత, అమీ జాక్సన్, రాధిక నటించిన ‘తెరి’ (2016) అనే తమిళ సినిమా తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  6. ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో అజిత్, సురేష్ గోపి (తమిళంలో తొలి సినిమా), లైలా నటించిన ‘ధీనా’ (2001) అనే తమిళ సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు? (క్లూ: తెలుగు వెర్షన్ పేరుతో – 1987లో ఎన్.రవీంద్ర రెడ్డి దర్శకత్వంలో సత్యనారాయణ, రంగనాథ్, తులసి ప్రధాన తారాగణంగా నటించిన సినిమా వచ్చింది. చక్రవర్తి సంగీతం)
  7. లింగుస్వామి దర్శకత్వంలో సూర్య, సమంత, మనోజ్ బాజ్‌పేయ్ నటించిన ‘అంజాన్’ (2014) అనే తమిళ సినిమా తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  8. ఎం.ఎ. తిరుముగం దర్శకత్వంలో ఉదయ్ కుమార్, బి. సరోజాదేవి నటించిన ‘యానయ్ పాగన్’ (1960) అనే తమిళ సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  9. అళగం పెరుమాళ్ దర్శకత్వంలో మణిరత్నం నిర్మించిన ‘డుం డుం డుం’ (2001) అనే తమిళ సినిమాలో మాధవన్, జ్యోతిక, వివేక్, మణివన్నన్ నటించారు. ఈ సినిమా తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  10. ఎం. నటేశన్ దర్శకత్వంలో ఎం.జి. రామచంద్రన్, బి. సరోజాదేవి, ఎం. ఆర్. రాధ నటించిన ‘ఎన్ కడమై’ (1964) అనే తమిళ సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 జూలై 30 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 99 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 ఆగస్టు 04 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 97 జవాబులు:

1.కాలాపానీ (1996) 2. ఢిల్లీ డైరీ (1996) 3. మాయా మోహిని (1962) 4. క్రిష్ (2006) 5. వసంత కోకిల (1982) 6. ఘటికుడు (2009) 7. వీరుడొక్కడే (2014) 8. అదిరింది (2017) 9. లింగా (2014) 10. తిండిపోతు రాముడు (1971)

సినిమా క్విజ్ 97 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి. రాజు
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • సునీతా ప్రకాష్
  • శంబర వెంకట రామ జోగారావు
  • తాతిరాజు జగం
  • వనమాల రామలింగాచారి
  • జి. స్వప్నకుమారి
  • కొన్నె ప్రశాంత్
  • బి. సంగీత

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here