బ్రతుకు చిత్రం

0
3

[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘బ్రతుకు చిత్రం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]పు[/dropcap]ట్టుకకు
పురుడు పోసిందొక చేయి

ఏడిస్తే
పాలు పట్టిందొక చేయి

బేల కళ్ళకు
ప్రపంచాన్ని చూపిందొక చేయి

బాధల్లో
ఓదార్పునిచ్చిందొక చేయి

చిత్తాన్ని
సన్మార్గంలో నడిపిందొక చేయి

ఆ చేతులలో
ఏదో అద్వితీయమైన శక్తి ఉంది

ఆ చేతులన్ని
కలిసి రూపు దిద్దిన బ్రతుకు చిత్రమిది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here