సినిమా క్విజ్-100

0
3

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

పరభాషల నుండి డబ్ చేయబడ్డ తెలుగు చిత్రాలపై ప్రశ్నలు.

ప్రశ్నలు:

  1. కె. శంకర్ దర్శకత్వంలో ఎం.జి.ఆర్., బి.సరోజాదేవి, నంబియార్ నటించిన ‘కలంగరై విలక్కమ్’ (1966) అనే తమిళ సినిమా తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది? (క్లూ: ఈ చిత్రం అమెరికన్ సినిమా ‘వర్టిగో’ ఆధారంగా తీయబడింది)
  2. ఎం. ఎ. తిరుముగం దర్శకత్వంలో ఎం.జి.ఆర్. షావుకారు జానకి, జయలలిత, ఎస్.వి.రంగారావు నటించిన ‘తైక్కు తలై మగన్’ (1967) అనే తమిళ సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  3. టి. ఆర్. రామన్న దర్శకత్వంలో ఎం.జి.ఆర్., కె.ఆర్. విజయ, షావుకారు జానకి నటించిన ‘పణం పడైతవన్’ (1965) అనే తమిళ సినిమా తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  4. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ఎం.జి.ఆర్. బి.సరోజాదేవి, పండరీబాయి నటించిన ‘తాయిన్ మదియిల్’ (1964) అనే తమిళ సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  5. కె. శంకర్ దర్శకత్వంలో ఎం.జి.ఆర్., జయలలిత, నంబియార్ నటించిన ‘చంద్రోదయం’ (1966) అనే తమిళ సినిమా తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  6. టి. ఆర్. రామన్న దర్శకత్వంలో ఎం.జి.ఆర్., బి.సరోజాదేవి, నగేష్ నటించిన ‘పణక్కార కుటుంబం’ (1964) అనే తమిళ సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు? (క్లూ: ఇదే సినిమా 1984లో ఇంటిగుట్టు పేరుతో పునర్మించారు)
  7. కె. శంకర్ దర్శకత్వంలో ఎం.జి.ఆర్., జయలలిత, అశోకన్ నటించిన ‘అడిమై పెణ్’ (1969) అనే తమిళ సినిమా తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  8. ఎ.సి. త్రిలోకచందర్ దర్శకత్వంలో ఎం.జి.ఆర్., బి.సరోజాదేవి, అశోకన్ నటించిన ‘అన్‍బే వా’ (1966) అనే తమిళ సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?
  9. ఎం. ఎ. తిరుముగం దర్శకత్వంలో ఎం.జి.ఆర్. జయలలిత, నంబియార్ నటించిన ‘తనిప్పిరవై’ (1966) అనే తమిళ సినిమా తెలుగులో ఏ పేరుతో డబ్ అయింది?
  10. తాపీ చాణక్య దర్శకత్వంలో ఎం.జి.ఆర్., జయలలిత, నగేష్ నటించిన ‘పుదియ భూమి’ (1968) అనే తమిళ సినిమాని తెలుగులో ఏ పేరుతో డబ్ చేశారు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 ఆగస్టు 06 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 100 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 ఆగస్టు 11 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 98 జవాబులు:

1.ఇంటి దొంగ (1964) 2. గౌరవము (1974) 3. బాబా (2002) 4. 7th సెన్స్ (2011) 5. డాన్స్ మాస్టర్ (1986) 6. పరిణయం (2021) 7. అభిమన్యు 8. ఓకే బంగారం (2015) 9. కాలం మారింది (1964) 10. బంగారు పతకం (1974)

సినిమా క్విజ్ 98 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి. రాజు
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • శంబర వెంకట రామ జోగారావు
  • తాతిరాజు జగం
  • వనమాల రామలింగాచారి
  • జి. స్వప్నకుమారి
  • కొన్నె ప్రశాంత్
  • బి. సంగీత

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here