[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘కయ్యూరు బాలసుబ్రమణ్యం నానీలు 11’ అనే కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఉ[/dropcap]లితో శిలకి
ఒళ్ళంతా గాయాలు
నేడు శిల్పమై
ప్రతి నోటా గేయాలు
కష్టాలు
నీకేనని కుమిలిపోకు
రాతికి తప్పలేదు
ఉలి దెబ్బలు
ప్రేమకు
భాషతో పనిలేదు
విశాల భావమే
దాని చిరునామా
మనకంటూ
కొన్ని స్మృతులుండాలి
లేదంటే
దేనిపై వ్యాపకమే ఉండదు
నీ గుండే
గుడి అయితే
నిన్నొదిలి
ప్రేమ దేవత ఎక్కడికెళుతుంది?