[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]
~
1
నాడు
నేడు
జీవికి స్నేహమే జీవితం. లేదంటే మోడు!
లింగాల వీరభద్రాచారి
మదనపల్లె
2
ఇరుగు
పొరుగు
పరస్పర ఆత్మీయ పలకరింపులే స్నేహంగా పెరుగు
పి.బాలా త్రిపుర సుందరి
హైదరాబాద్
3
ఇరుగు
పొరుగు
సఖ్యత అపసవ్యం అయితే ముఖాలు మరుగు!
యన్.కే. నాగేశ్వరరావు
పెనుగొండ.
4
అహం
మోహం
మానవ సంబంధాలకు నిరోధకాలై కొడిగట్టేను స్నేహం
డా. ఉషారాణి కోగంటి
హైదరాబాద్
5
సుధాముడు
దివ్యధాముడు
స్నేహానికి నిలువెత్తు నిదర్శనమై నిలచిన పరంధాముడు.
యడవల్లి విజయలక్ష్మి
రాజమండ్రి
6
సందోహం
సందేహం
అహం, కలహం, ద్రోహం ఎరుగనిది స్నేహం!
గోపరాజు వెంకట సూర్యనారాయణ
హైదరాబాద్.
7
మోహం
స్నేహం
మనస్సు అంగీకరించిన చెయ్యనివ్వదు ఎవ్వరికీ ద్రోహం
గుండం మోహన్ రెడ్డి
నర్సాపూర్, మెదక్
8
అహంకారం
వెటకారం
మనల్ని గౌరవించని వ్యక్తులపట్ల చూపకెప్పుడు మమకారం..!!
జి.కె.నారాయణ (లక్ష్మిశ్రీ)
జోగులాంబ గద్వాల్ జిల్లా
9
అహం
మోహం
ఇహంలో పెరుగుతోంది నానాటికి భయంకరమైన ధనదాహం
వురిమళ్ల సునంద,
అర్కెన్సాస్ అమెరికా
10
అయినది
కానిది
మన అనుకుంటే ఏదైనా మనదే అవుతుంది
ఆలేటి పరంజ్యోతి
ఖమ్మం
11
ఆడుతూ
పాడుతూ
గడిచి పోతుంది బాల్యం తెలియనివి వాడుతూ
బెహరా నాగభూషణరావు, గజపతినగరం
12
ఉపకారం
అపకారం
మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుంది ‘అహంకారం’
బిక్కునూరి రాజేశ్వర్
నిర్మల్
13
అలలు
కలలు
వస్తూ పోతూ ఉంటాయిగా చెలిమిలో జలలు
కాటేగారు పాండురంగ విఠల్
హైదరాబాద్,
14
ఈహ
ఊహ
మనిషి మనసును పెడదారి పట్టిస్తుంది అపోహ
Dr. C వసుంధర,
చెన్నై.
15
నిధి
సన్నిధి
సంపదంతా భగవంతునిది -సంతృప్తి మాత్రమే భక్తునిది!
ఆచంటి శ్రీనివాసరావు
తెనాలి.
16
వేదం
నాదం
ఘోషిస్తోంది మనసు ,పరమార్ధం తెలియక-ఖేదం!
కె.కె.తాయారు
మదనపల్లి (చిత్తూరుజిల్లా)
17
చెలిమి
బలిమి
కనుకలి వినుకలి తోడను సాగితేనేగా కలిమి
రావెల పురుషోత్తమరావు
అమెరికా
18
నమస్కారం
సంస్కారం
భారతీయత అంటేనే ఉత్తమ సంస్కృతికి ఆస్కారం
బి బీ రవి కుమార్
విజయవాడ
19
శేషం
సశేషం
రెండిటికి తేడా తెలియని మనిషే విశేషం
లలితా చండి
హైదరాబాదు
20
హాలికులు
సైనికులు
దేశానికి సారధులు ప్రజల క్షేమానికి సంరక్షకులు
జె.విజయకుమారి
విశాఖపట్నం
21
కృత్యము
సత్యము
మంచిపనులు చేస్తూ సన్మార్గంలో జీవించాలి నిత్యము
కామేశ్వరి వాడ్రేవు
రాజమహేంద్రవరం
22
ఉబ్బరం
అబ్బరం
అన్ని పరిస్థితుల్లో వుండాలి గుండె నిబ్బరం.
భమిడిపాటి వెంకటేశ్వర రావు
హైదరాబాద్
23
శోధించు
ఛేదించు
సమస్య ఏదయినా సహనంతో సత్ఫలితం సాధించు
కె.సుదర్శనాచారి,
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం,గుంటూరు
24
ఉపకారం,
సహకారం,
మంచి గుణాలతో కలలు చేసుకో సాకారం!
దినవహి సత్యవతి
గుంటూరు
25
దర్శనం!
ప్రదర్శనం!
నలుగురితో మంచిగా ఉండడం సంస్కారానికి నిదర్శనం!
సిహెచ్.వి. బృందావన రావు
నెల్లూరు
~
(మళ్ళీ కలుద్దాం)