[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
ప్రశ్నలు:
- కె. ఎస్. రామచంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వర రావు, జూనియర్ శ్రీరంజని నటించిన ‘మంత్ర దండం’ (1951) చిత్రానికి పాటలను స్వరపరిచినదెవరు (నేపథ్య సంగీతం కాదు)?
- అంజలీదేవి భర్త పి. ఆదినారాయణ రావు సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘మాయలమారి’ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకుడెవరు? ఇందులో అక్కినేని, అంజలీదేవి నటించారు.
- సంగీత దర్శకులు టి. ఆర్. పాపా; టి.కె. కుమారస్వామి, టి. కళ్యాణ రామన్ సంగీతం అందించిన చిత్రంలో NTR, జమున, సి.ఎస్.ఆర్ నటించారు. ఆ చిత్రం పేరేమిటి? (క్లూ: ‘ఓ మదనా రా వెన్నెల చిందే రేయిలో’ అనే పాట ఇందులోనిదే).
- కె. ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలో వచ్చిన ‘కన్నతల్లి’ (1953) చిత్రంలో అక్కినేని, జి.వరలక్ష్మిలు నటించారు. ఆ చిత్ర సంగీత దర్శకుడెవరు? (క్లూ: ‘ఇదే ఇదే సరాగం ఇదే కదా అనురాగం’ అనే పాట దీనిలోనిదే)
- ఎల్. వి. ప్రసాద్ దర్శకత్వంలో అక్కినేని, శివాజీ గణేశన్, అంజలీదేవి నటించిన ‘పరదేశి’ (1953) చిత్రానికి సంగీత దర్శకుడెవరు? (క్లూ: ‘నా హృదయములో ఎవరో పొంచి పలుకరించారు’ అనే పాట ఈ సినిమాలోనిదే).
- కన్నడ హీరో డా॥ రాజ్‍కుమార్ తెలుగు భాషలో నటించిన ఏకైక చిత్రం ‘కాళహస్తి మహాత్య్మం’ (1954). దర్శకుడు L. N. సింహ కాగా రచన, పాటలు వ్రాసినదెవరు?
- కె.వి. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన వాహిని వారి ‘పెద్దమనుషులు’ చిత్రంలో జంధ్యాల గౌరీనాథశాస్త్రి, ముదికొండ లింగమూర్తి, రేలంగి నటించారు. ఈ సినిమాకి ఛాయాగ్రహకుడెవరు?
- పి. పుల్లయ్య దర్శకత్వంలో అక్కినేని, జగ్గయ్య, సావిత్రి నటించిన ‘అర్ధాంగి’ (1955) చిత్రానికి బెంగాలీ రచయిత ‘మణిలాల్ బెనర్జీ’ నవల ‘స్వయం సిద్ధ’ ఆధారం కాగా దీనికి సంగీతం అందించిన వారెవరు?
- కోవెలమూడి భాస్కర రావు దర్శకత్వంలో ఘంటసాల సంగీతం అందించిన ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడు కమల్ ఘోష్ కాగా, N.T.R., అమర్నాథ్, రేలంగి, జానకిలు నటించారు. ఈ చిత్రం పేరు? (క్లూ: ‘యోగము అనురాగము త్యాగము ఒక యాగము’ అనే పాట ఇందులోదే).
- హిందీ చిత్రం ‘కిస్మత్’ (1943) లో అశోక్ కుమార్ హీరో. ఈ చిత్రం ఆధారంగా వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో, ఎస్. రాజేశ్వర రావు సంగీత దర్శకత్వంలో అక్కినేని హీరోగా నటించిన చిత్రం ఏది?
~
మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 ఆగస్టు 13 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 101 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 ఆగస్టు 18 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 99 జవాబులు:
1.కథానాయకుడు కథ (1965) 2. భారతీయుడు (1996) 3. ధర్మ యుద్ధం (1979) 4. భారత నివాస్ (1977) 5. పోలీసోడు (2016) 6. దాదా (2001) 7. సికందర్ (2014) 8. ఎవరు దొంగ (1961) 9. డుం డుం డుం (2001) 10. ఘరానా హంతకుడు (1965)
సినిమా క్విజ్ 99 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- రామకూరు నాగేశ్వరరావు
- శంబర వెంకట రామ జోగారావు
- తాతిరాజు జగం
వీరికి అభినందనలు.
[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]
[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]