[శ్రీ రోచిష్మాన్ సృజించిన సరికొత్త కవితా ప్రక్రియ ‘వాక్కులు’ అందిస్తున్నాము.]
వాక్కు ప్రక్రియలోని నిర్మాణం లేదా విధం:
వాక్కులో ఒక అభివ్యక్తి రెండు వరుసల్లో ఉంటుంది. మొదటి వరుసలో క్రియా పదాలతో ఒక సంపూర్ణమైన పంక్తి ఉంటుంది. ఇది ఒక పంక్తిగా మాత్రమే అంటే 30 అక్షరాల లోపు ఉండాలి.
ఈ పంక్తి ఒక వాస్తవ పరిస్థితిని, ఒక ఊహను, ఒక భావుకతనూ, ఒక విషయాన్ని ఒక భావాన్ని ప్రకటించేదిగా ఉంటుంది. ఆ పంక్తిలో చెప్పడం పూర్తవుతుంది. రెండవ వరుసలో ఒక పదం, లేదా రెండు, మూడు విడివడి పదాలలో సూచనాత్మకంగా ఒక తీర్మానం ఉంటుంది. ఈ వరుసలో క్రియా పదాలు ఉండవు. ఈ రెండో వరుస మొదటి వరుసకు కొనసాగింపు కాదు. ఈ రెండో వరుస వాక్కును సంపూర్ణం చేస్తూ కవిత్వావిష్కరణకు మూలకం ఔతుంది.
శిల్పాత్మకమైన లఘురూప కవితాప్రక్రియ వాక్కు.
ఈ శిల్పాత్మక ప్రక్రియ వాక్కులో వస్తువు ఏదైనా కావచ్చు.
వాక్కు అన్న పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. అవి అందరికీ తెలిసినవే. అవి నిఘంటువుల ద్వారా తెలుసుకోగలిగినవే. అన్ని అర్ధాలకు సంబంధించిన అభివ్యక్తులకూ ఈ వాక్కు ప్రక్రియలో అవకాశం ఉంటుంది.
వాక్కులు
~
241
ప్రపంచాన్ని చూస్తూండాలని వచ్చిన ఒక సదాశయాన్ని పెంచుకుంది భూమి.
“చెట్టు”
242
కొట్టుకుపోతూ ఈదుతున్నాం అనుకుంటున్నారు, అంటున్నారు.
“మనుషులు, మనుగడ”
243
రాని పిలుపును విని లేని చోటుకు వడివడిగా వెళుతున్నారు.
“జీవనం, జీవితం”
244
ఉన్న దారిలో లేని అడ్డుగోడలకు గుద్దుకుని పడిపోయారు.
“మనుషులు”
245
దొంగ, హంతకుడు, మోసగాడు, మూర్ఖుడు, విదూషకుడు తెలుగుకవి కన్నా మేలు.
“వాస్తవం”
246
ఉదయంలోని సంస్కారం స్పష్టంగా తెలుస్తోంది.
“కాంతి”
247
మహోన్నతమైన గానం నిలిచి ఉండే మెఱుపయింది.
“(మొహమ్మద్) రఫీ”
248
తాగుబోతుల పేలాపనకు తెలుగు సాహిత్యంలో పెద్ద పీట వేశారు.
“విమర్శ, ముందుమాట”
249
మంచితనాన్ని ఉద్బోధిస్తూ మౌన గేయాలు పూస్తూనే ఉన్నాయి.
“పువ్వులు”
250
వాక్భావ వరవాణి మట్టిపై సత్యప్రత్యగ్రంగా సంచరణమౌతూనే ఉంది.
“వాల్మీకి, కాళిదాసు”
251
మానసిక బానిస కొడుకులు విదేశీ మత మలాన్ని తెగ తింటున్నారు.
“మేధావులు, చరిత్రకారులు”
252
కాంతికి కదిలే మానవ రూపం ఉంది.
“గురువు”
253
తోచిన తలపుల్లో ఒకటి పూచిన పువ్వై తావినిచ్చింది.
“కవిత”
254
ఎప్పుడూ ఇచ్చిపుచ్చుకునే సందడులే.
“జీవనం, జీవితం”
(ఇచ్చి పుచ్చుకొను సందడులు అని దేవులపల్లి ఒకచోట అన్నారు)
255
మొరుగుళ్లు, ఊళలవల్ల శ్రావ్యమైన సంగీతం తన వైశిష్ట్యాన్ని, విభవాన్ని కోల్పోదు.
“విశ్వనాథ (సత్యనారాయణ)”
256
పాత తప్పులకు కొత్త తప్పుల్ని కలుపుకుంటూ మనిషి మరణిస్తున్నాడు.
“మనుగడ”
257
మహిపై దేవుడి మహిమ వెల్లివిరిసింది.
“మహిళ”
258
దోషులు, దుష్టులు నొచ్చుకోరు, సిగ్గుపడరు, ఏడవరు.
“అదృష్టవంతులు”
(తిరువళ్లువర్, కణ్ణదాసన్ మాటలకు అనువాదం)
259
జీవనాన్ని వయసు కోసేస్తోంది.
“జీవితం”
260
నోటికి చేటు చేస్తోంది పుచ్చిన వక్క.
“బుద్ధి”
261
ఇతివృత్తం కోసం భాష ప్రయాణం చేస్తోంది.
“జీవితం”
262
భాష లేకుండా కవిత్వం అభినయిస్తోంది.
“నాట్యం”
263
ఆకలికి దాహం, దాహానికి ఆకలి తీఱడం లేదు.
“జీవనం”
264
తలపు వలచింది, వలపు తలచింది.
“బంధం, అనుబంధం”
265
వాణ్ణి వాడు తనకు తానుగా చెడగొట్టుకుంటున్నాడు.
“మనిషి, బతుకు”
266
వ్యథ కదలాడడానికి వేదికగా జీవితం అన్నది ఉంది.
“మనిషి”
267
మనదేశంపై వేట్లు వేస్తూనే ఉన్నారు మేధావులు.
“సుత్తి, కొడవలి”
268
నిలిచి ఉండే మెఱుపు పూస్తూ ఉంటుంది.
“సత్కవిత”
269
జాగ్రత్త; చుట్టూ అతి ప్రమాదకర జీవులున్నాయి.
“మానవులు”
270
మేధావులు ఉన్నవి జాగ్రత్త.
“మనదేశం”
(మళ్ళీ కలుద్దాం)