[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘అందాలకు నెలవు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]అ[/dropcap]దొక అందమైన ఇల్లు
మానవ సంబంధాల పరిమళాలు
మమతానురాగా మధురిమలు
వెదజల్లే పూల తోట
మాటలే పాటలుగా సాగే
సరాగాల బృందావనం
ఆత్మీయతానుబంధాల వరుసల
పిలుపులే జల్లులై కురుస్తాయి
కలిసిమెలిసి తింటారు
ఒక చోట ఉంటారు
ఒకేమాట ఒకటేబాట అందరిది
చరవాణి అవసరం లేదు
వారి పలుకుల మధుర వాణి
ఆ ప్రాంతమంతా చరిస్తూ ఉంటుంది
వాస యోగ్య నివాసం చిన్నదైనా
అందులో వసించే వారి మనస్సులు విశాలం
ఒకరికోసం ఒకరమనుకుంటూ
కష్టసుఖాలు కలబోసుకుంటూ
ఆనందాలు పండించుకుంటూ
అందరిని ఒకచోట కలిపే
అందమైన బృందావనం
ఆప్యాయతలకు నెలవు
ప్రేమలకు కాణాచి అయిన
ఆ ఇల్లు అనురాగాల కోవెల