తల్లివి నీవే తండ్రివి నీవే!-43

0
3

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

ఆనంద పరమానంద

ఈశానాం జగతోఽస్య వేఙ్కటపతే ర్విష్ణోః పరాం ప్రేయసీం
తద్వక్షఃస్థల నిత్యవాసరసికాం తత్-క్షాన్తి సంవర్ధినీమ్।
పద్మాలఙ్కృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వన్దే జగన్మాతరమ్॥

శ్రీమన్ కృపాజలనిధే కృతసర్వలోక
సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్।
స్వామిన్ సుశీల సుల భాశ్రిత పారిజాత
శ్రీవేఙ్కటేశచరణౌ శరణం ప్రపద్యే॥

అప్రమేయః

న విద్యన్తే ప్రమాతం యోగ్యాః పరిచ్ఛిన్నా గుణాః యస్యాసౌ అప్రమేయః॥ – ఎవరికీ లెక్కింపరాని అనగా కొలుచుటకు సాధ్యం కానన్ని గుణములు కలవో అతడు అప్రమేయుడు.

ప్రమితసర్వఙ్ఞత్వేన, న విద్యతే ప్రమేయం – జ్ఞాతవ్యం యస్యేతి వా॥ – భగవంతుని సర్వఙ్ఞత్వము ప్రమితమైనది. అందువలన తెలుసుకొనదగినది ఏదియును లేని వాడు. అంటే ఏ విధముగ చూసినా తెలుసుకొనశక్యము కానివాడు.

శ్రీమద్భాగవతంలో నుడివినట్లు..

త్వమప్యదభ్రశ్రుతవిశ్రుతం విభోః సమాప్యతే యేన విదాం బుభుత్సితమ్ అఖ్యాహి దుఃఖైముహురర్దతాత్మనాం సంక్లేశనిర్వాణమిశంతి నాన్యథా

(వ్యాస భాగవతం 1.5.40)

ఎవరి గురించి తెలుసుకోవటం వలన ఇక తెలుసుకొనవలసినది ఏమీ మనకు మిగలదో అట్టి నారాయణుని చరిత్రమును వర్ణింపుము.

ఎందుకంటే వేరొక మార్గములో ఆర్తులైన వారి కష్టాలు తీరవు.

జ్ఞాతవ్యాశ్చైవ, ధ్యాతవ్యా గుణాః సర్వేఽప్యతో హరేఃఇత్యుక్తే॥ – శ్రీహరి యొక్క గుణములు తెలుసుకొనదగినవి, ధ్యానింపదగినవి.

ప్రకృష్టా మేయా – భక్తఙ్ఞేయా గుణాః యస్యాసౌ ప్రమేయః। అశ్చాసౌ ప్రమేయశ్చేతి వా॥ – భక్తుల చేత తెలుసుకొనేది అనేక గుణములు కలవాడు.

ప్రకృష్టా చ సా మా చ ప్రమా – లక్ష్మీః, తామ్, ఈం – విస్మయం, యాపయతీతి ప్రమేయః, అశ్చాసావితి ప్రాగ్వత్॥ – ప్రమా అనగా లక్ష్మీదేవి. ఈం అనగా విస్మయం. యాపతీతి అనగా కలిగించువాడు. అంటే లక్ష్మీదేవికి తన రూపగుణ విలాసాదులతో ఆశ్చర్యము కలిగించువాడు నారాయణుడు.

ఇంతకు మునుపు విశ్వావిర్భావ సిద్ధాంతాలలో ప్రధానంగా అంగీకరింపబడిన బిగ్ బ్యాంగ్ ను సమర్థించేందుకు CMBR – Cosmic Microwave Background Radiation ఎలా పనికి వచ్చిందో చూసాము. అక్కడ మైక్రోవేవ్ రేడియేషన్ ను శబ్దరూపంలో ఎలా విశ్లేషించి విశ్వావిర్భవ విస్ఫోటనం తరువాత 380,000 సంవత్సరాల కాలం నాటి వివరాలను పరిశోధించటం గురించి చూసాము.

కానీ, ఎంత గొప్ప సిద్ధాంతం అయినా దానిలో ఎంతో కొంత లోపం ఉండి పరిపూర్ణతను చూపదు. ప్రతి సిద్ధాంతానికీ దాని లోపాలను సరిచేస్తుండగా వచ్చే కొత్త సిద్ధాంతము ఉండనే ఉంటుంది. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో. అలా విశ్వావిర్భావాన్ని వివరింపబూనిన మరొక సిద్ధాంతం స్టెడీ-స్టేట్. దీనిని మొదట ప్రతిపాదించిన వారు హర్మన్ బోండి, థామస్ గోల్డ్, ఫ్రెడ్ హయిల్. వీరిలో ఫ్రెడ్ హయిల్ ఈ సిద్ధాంతం గురించి చాలా ఆసక్తి చూపి దాన్ని గట్టిగా సమర్థించాడు.

In cosmology, the steady-state model or steady state theory is an alternative to the Big Bang theory. In the steady-state model, the density of matter in the expanding universe remains unchanged due to a continuous creation of matter, thus adhering to the perfect cosmological principle, a principle that says that the observable universe is always the same at any time and any place.

పదార్థ సృష్టి కొనసాగుతూనే ఉండటం వల్ల విశ్వంలో ఎక్కడ చూసినా ఈ విశ్వసాంద్రత ఒకేలా ఉంటుంది. మనం గమనించగలిగే విశ్వం ఎక్కడ ఏ సమయంలో చూసినా ఒకేలా ఉంటుంది అని చెప్పే విశిష్ట వైశ్విక సూత్రానికి అణుగుణంగా ఉంటుంది.

స్టెడీ-స్టేట్ థియరీ అనేది విశ్వం ఎల్లప్పుడూ విస్తరిస్తూనే ఉంటుంది కానీ స్థిరమైన సగటు సాంద్రతను కలిగి ఉంటుంది అని ప్రతిపాదించే విశ్వోద్భవ నమూనా. కొత్త నక్షత్రాలను, గెలాక్సీలను ఏర్పరచడానికి కొత్త పదార్థం నిరంతరం సృష్టించబడుతుందని దీని ప్రతిపాదన, పాత నక్షత్రాలు, గెలాక్సీలు దూరం జరుగుతుండటం వల్ల అవి మన దృష్టిపథంలో క్రమంగా కనబడవు.

సనాతన విశ్వం- స్థిర విశ్వం: బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం వలె కాకుండా, స్టెడీ స్టేట్ సిద్ధాంతం విశ్వానికి ప్రారంభం, ముగింపు లేవని చెప్తుంది.

స్థిర సాంద్రత: విశ్వంలో పదార్థం యొక్క సగటు సాంద్రత ఎంత కాలం గడిచినా అదే విధంగా ఉంటుంది, అది ఎంత విస్తరించినప్పటికీ.

నిరంతర సృష్టి: విశ్వం ఆద్యంతాలు లేకుండా విస్తరిస్తున్న కారణంగా మన నుండి దూరం అవుతున్న పదార్థం స్థానంలో నిరంతరం కొత్త పదార్థం సృష్టించబడుతుంది.

విశ్వానికి ఆది లేదు: ఈ సిద్ధాంతం విశ్వం ఎలా ఉద్భవించిందో వివరించలేదు. విశ్వం అలా ఉంది. ఇది మాత్రమే ఈ సిద్ధాంతం చెప్పింది.

అంటే Existence exists. సృష్టి అలా నడుస్తోంది అంతే.

అంటే పరబ్రహ్మమును గురించి చెప్పటానికి చులాగ్గా తత్that – అని ఎలా అంటారో అలాగ.

ఆధునిక శాస్త్ర జ్ఞానం ప్రకారం ఈ స్టెడీ స్టేట్ సిద్దాంతం Cosmic Microwave Background Radiation గురించి వివరించలేదు. కాసార్ల (Quasars) గురించి స్థిరమైన వివరణలు ఇవ్వలేదు. రెడ్ షిఫ్ట్ గురించి కూడా వివరించలేదు.

ఇలా ఈ సమస్యలు ఉన్నా, Steady-state Theory విస్వావిర్భావానికి సంబంధించిన విశేషాలను పరిశోదించటంలో ఒక బాట పరిచింది.

విష్ణు సహస్రనామములలో అవ్యయః, స్థాణుః మొదలైన నామములకు సరిపోలే విధంగా ఉంటుంది.

విశ్వానికి ఆది లేదు. అంతం లేదు. సృష్టికి ఆది ఉంది. అది అంతమూ అవుతుంది. ఇదంతా ఒక చక్రం వలె మరల మరల జరుగుతూనే ఉంటుంది. It’s a cosmic cycle.

అంటే విష్ణు సహస్రనామములలో ఎన్నో వైరుధ్యాలు ఉన్న పదాలు ఏ విధంగా మనకు దర్శనమిస్తాయో పరస్పర వైరుధ్యాలు కలిగిన Big Bang, Steady-state Theory లు విశ్వమనే నాణేనికి రెండు వైపుల లాంటివి. అయినా అవి విశ్వాన్ని గురించి పూర్తిస్థాయిలో వివరించలేవు.

తత్! అప్రమేయుడు.

48. హృషీకేశః

అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి (A. C. Bhakti Vedanta Swami aka Srīla Prabhupada) హృషీకేశ అనే నామాన్ని ఇలా వివరిస్తారు.

Krishna is more popularly known as Hrishikesha in our immediate ancient history. It means he is the “Master of Senses”. The living entity on the earth is actually a Spiritual Soul. However, when it comes in contact with the materialistic things, the soul forgets itself and starts to identify itself with the body. This change is made possible by false ego which converts material experience to feel Spiritual.

The transformation of material experience to Spiritual experience is made possible by Krishna alone, who controls the false ego, all our senses and mind, and acts as an Interface between the material experience and Spiritual experience.

Hrishikesh is the God within us, who is the controller of our senses and mind. This is the main reason, Krishna is called as a God who lives in every living being.

రైభ్యుడు అనే ఋషి ఆ ప్రదేశంలో తన ఇంద్రియాలను తన వశంలో ఉంచుకుని తపస్సు చేసి శ్రీమహావిష్ణువును మెప్పించాడు. అలా హృషీకములను అధీనంలో ఉంచుకుని రైభ్యుడు తపస్సు చేసిన ప్రదేశానికి హృషీకేశ్ అనే పేరు వచ్చింది. అదే రిషీకేశ్ పట్టణము.

రైభ్యుని గురించి కొంత సమాచారం..

రైభ్య మహర్షి గురించి వరాహ పురాణంలో ఉంది. రైభ్యుడు బ్రహ్మ కుమారుడని వ్రాయబడి ఉంది. రైభ్యుడు ఒక గురువు వద్ద విద్యాధ్యయనం చేయసాగాడు. గురువే పరమేశ్వరుడని భావించి సేవచేయుచూ విషయాలు గ్రహిస్తున్నాడు. గురువు హృదయము చూరగొన్నాడు. రైభ్యుని గురుభక్తికి దేవతలే మెచ్చుకున్నారు. పుష్పవర్షం కురిపించారు. రైభ్యుడు సర్వవిద్యలు నేర్చుకున్నాడు. బ్రహ్మజ్ఞాని అయ్యాడు. అనంతరం బృహస్పతి వద్దకు వెళ్ళి అతని కటాక్షమర్థించాడు. బృహస్పతి రైభ్యునకు అనేక రహస్యాలు తెలియజేశాడు. రైభ్యునకు ఒక సందేహము కలిగినది. మోక్షము కర్మమున లేక జ్ఞానము వలన దేని వలన సులభముగా లభించునని ఆ విషయము బృహస్పతిని అడిగాడు. బృహస్పతి చక్కని కథ చెప్పి సంశయ నివృత్తి చేశాడు. అనంతరం రైభ్యుడు ఒక ఉత్తమ కన్యను వివాహమాడి గృహస్ధు అయ్యాడు. ఆమె యిరువురు పుత్రులను కన్నది. వారిలో పెద్దవానికి అర్యావసువు అని రెండవ వానికి పరావసువు అని పేర్లు పెట్టాడు. కొడుకులిద్దరికి తానే గురువుగా ఉండి వారిని వేదాధ్యయన సంపన్నులను చేశాడు.

ఈ రైభ్యుని గురించి ముందు ముందు తెలుసుకోవలసిన అవసరం వస్తుంది. అది అక్కడ చూద్దాము.

ద్వైతము ప్రకారము..

హృషో- హర్షః సోఽస్యాస్తీతి హృషీ, ఈ – రమా, కో (క) – బ్రహ్మా చ ఈకౌ, తయోః ఈశః ఈకేశః। హృషీ చ అసౌ ఈకేశశ్చేతి హృషీకేశః॥ – హృషీ అనగా హర్షము కలవాడు. ఈకౌ అనగా లక్ష్మీ బ్రహ్మలు. తయోరీశః అనగా వారికి ప్రభువైన వాడు.

ఎల్లెడలా ఆనందముగా ఉండువాడు. బ్రహ్మ, లక్ష్మీదేవి.. వీరిద్దరికీ ప్రభువైన వాడు హృషీకేశుడు.

హృష్ తుష్టౌ అనేది ధాతువు.

హృషిణః ఈకేశా – రమాబ్రహ్మరుద్రా యేనేతి వా॥ – ఎవరి వలన రమా-బ్రహ్మ-రుద్రులు ఆనందమును పొందుతున్నారో ఆతడు హృషీకేశుడు.

ఇక ఇంద్రియాలకు అధిపతి అనేది అన్ని చోట్లా చెప్తున్న మాటే!

వేదములే ఇంద్రియములుగా కలిగిన వాడు అని పరాశర భట్టర్ తేల్చివేసారు. ఇంద్రియములకు అధిపతి. బ్రహ్మ రుద్రాదుల ఇంద్రియములను తనే స్వయముగా నియమించిన వాడు.

పంచ తన్మాత్రలు – శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం – 5

పంచ జ్ఞానేంద్రియములు – కన్ను, చెవి, చర్మం, ముక్కు, నాలుక – 5

పంచ కర్మేంద్రియాలు – కన్ను, చెవి, చర్మం, ముక్కు, నాలుక  – 5

పంచ భూతములు – నేల, నీరు, ఆకాశం, గాలి, అగ్ని – 5

గుణత్రయము – సత్త్వము, రజస్సు, తమస్సు – 3

మనస్సు – ఒకటి – 1

మూలప్రకృతి – ఒకటి – 1

మహత్తు – ఒకటి – 1

అహంకారం – ఒకటి – 1

సప్తవింశతి తత్వాలు మొత్తం – 27

వీటన్నిటిని నియమించేది, పాలించేది, నిరోధించేది అన్నీ ఆయనే.

దీని గురించి మరింత వివరణ మునుముందు చూడగలము.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here