[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘సాగాలి జీవితం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]బా[/dropcap]ల్యం ఓ స్వర్గం
ఆ గురుతులు అతి మధురం
యవ్వనం ఓ పూల వనం
నవ్వుతూ తుళ్ళుతూ సాగిపోతుంది
నడి సంద్రంలో నావ
నడిమి వయసు ముచ్చట
వృద్ధాప్యం ఓ శాపం
ఎవరూ జాలి చూపని దైన్యం
అన్ని దశలూ దాటాలి
మిన్నగా జీవితం సాగాలి