[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]
~
1
చందనం
అభినందనం
తోబుట్టువుల బాల్యానుబంధాల స్మృతుల జ్ఞాపిక రక్షాబంధనం
కోటమహంతి వెంకటరావు(కోవెరా),
విశాఖపట్నం
2
హరివిల్లులు
విరిజల్లులు
చిన్నారుల కిలకిల నవ్వులు, విరిసిన మరుమల్లెలు
కాయల నాగేంద్ర,
హైదరాబాద్
3
ఆహారం
వ్యవహారం
పంటల్లో నష్టపోయే రైతులకు చెల్లించాలి పరిహారం.
ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు
సారవకోట
4
తపస్వి!
మనస్వి!
మది పెట్టి కష్టపడితే అవుతావు యశస్వి!
యలమర్తి మంజుల
విశాఖపట్నం
5
కలం
బలం
అక్షరసేద్యానికి అవరోధం కానేరదు వ్రాతగాడి కులం!
బలివాడ హరిబాబు
విశాఖపట్టణం
6
శిక్ష!
కక్ష!!
అన్నా చెల్లెలు -బంధంలో ఉండకూడదు అగ్నిపరీక్ష!!!
మన్నవ సుధాకర్
విజయవాడ
7
బంగారం
సింగారం
ఉన్నది చాలక కోరితే కూలదా సంసారం!
జంజం కోదండ రామయ్య
జమ్మిపాళెం
8
బంధం!
అనుబంధం!!
అన్నాచెల్లెళ్ల మధ్య ఉండేది తెగని రుణానుబంధం!!!
మన్నవ నాగ లలిత శ్రీదేవి
విజయవాడ.
9
అరసం
విరసం
ప్రయోగాత్మకంగా సాహిత్యవేత్తలు ప్రక్రియలు కవులకు సురసం
బొగ్గవరపు శ్రీమన్నారాయణ
నెల్లూరు.
10
రావు
పోవు
ప్రేమ, గౌరవం భిక్షగా తెచ్చుకునేవి కావు
గందె శోభారాణి
చందానగర్,హైదరాబాద్
11
రక్తదానం!
అన్నదానం!!
మరణించినా మనలను జీవింప చేసేదే అవయవదానం!!!
లయన్:కంబాల తిమ్మారెడ్డి
కళ్యాణదుర్గం,అనంతపురం జిల్లా
12
తెలుపు
కలుపు
సత్సాంగత్యం తెస్తుంది జీవితంలో మరువలేని మలుపు
నెల్లుట్ల శ్రీనివాసులు
చెన్నై
13
ఇచ్ఛ
రచ్చ
అందరికీ వికాసం అంటూ ఒక్కడే ప్రకాశిస్తే మచ్చ.
పట్నాల ఈశ్వరరావు
విజయనగరం
14
జనం
ఘనం
కలిస్తే నిలబడతాం, విడిపోతే పడిపోతాం మనం.
కె. ఎమ్. కె. మూర్తి
సికింద్రాబాద్
15
వియ్యము
కయ్యము
రెండింటిలోనూ తలవొగ్గి ఉంటేనే మనిషికి నెయ్యము
హైమ. కందుకూరి
హైదరాబాద్
16
కలం
బలం
జాగ్రత్తగా వాడుకోకపోతే ఎప్పుడైనా ఎక్కడైనా పడిపోగలం.
మాధవీసనారా,
అనకాపల్లి
17
కష్టం..!
నష్టం..!!
మలుపుల జీవితంలో వాటిని ఎదుర్కోవడమేగా ఇష్టం..!!!
మహమ్మద్ అంకూస్
బెల్లంపల్లి
18
క్లేశము
నాశము
ఆశాపాశాల్ని తెంచుకుంటేనే గోచరమవుతుంది మనలోని ప్రకాశము.
భమిడిపాటి వెంకటేశ్వర రావు
హైదరాబాద్
19
కల్పం
సంకల్పం
మేలు కోరే మనుజులే నేడు అల్పం!
సిద్ధిరెడ్డి యామినీ సౌజన్య,
లండన్.
20
పన్నులు
సంపన్నులు
ఎగవేతకు సదా అవకాశాలు కనుగొనే తీరుతెన్నులు
వి శ్రీనివాస మూర్తి
హైదరాబాదు
21
ప్రకృతి
వికృతి
ప్రళయ విధ్వంసం తర్వాత మారింది వయనాడ్ ఆకృతి
ఎస్.గిరిజశివకుమారి
గుంటూరు
22
గది
మది
పదిమందితో సఖ్యతగా నుండుట మంచిదని నేర్పినది
ఈమని వెంకట మల్లికార్జున రావు.
నెల్లూరు
23
మౌనము
ధ్యానము
ఈ జీవనదీపానికి తైలం అనుభవ జ్ఞానము
తెంటు వెంకట ధర్మారావు
విజయనగరం
24
తలవకు
వెరవకు
ఎవరికో భయపడి చేయాలనుకున్న మంచిపనిని విడవకు
వురిమళ్ల సునంద
అర్కెన్సాస్ అమెరికా
25
చరించు
సంచరించు
గతాన్ని తక్కువగా ఆలోచించి భవిష్యత్తుకై పచరించు
అభిషేక్
హైదరాబాద్
~
(మళ్ళీ కలుద్దాం)