‘మా వాటా మాకే’ పుస్తకావిష్కరణ ప్రెస్ నోట్

0
3

[dropcap]చ[/dropcap]ట్టసభల్లో, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై రూపొందించిన ‘మా వాటా మాకే’ పుస్తకాన్ని ఆగష్టు 13 న ఆవిష్కరించారు.

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనిలో గల గ్రీన్ బెల్ట్ లోని వివిధ విగ్రహాల దగ్గర ప్రముఖ బిసి నాయకులు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పాలమూరు జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రముఖ న్యాయవాది బెక్కెం జనార్దన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి బిసి కమీషన్ సభ్యులుగా పనిచేసిన జూలూరు గౌరీశంకర్ రచించిన ‘మా వాటా మాకే’ పుస్తకాన్ని బిసి రిజర్వేషన్ల గురించి రాసిన విలువైన పుస్తకమని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా బిసీల బతుకులు మారడం లేదన్నారు. రాజ్యమంతా అగ్రకులాల చేతుల్లోనే ఉందన్నారు. దేశజనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలు అధికారానికి ఆమడ దూరంలో ఉన్నారన్నారు. బీసీలందరూ సంఘటితమై కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం పద్మావతి కాలనీలో ఉన్న ఒక్కో విగ్రహం దగ్గర, అంబేద్కర్ విగ్రహం దగ్గర, జలజం కళాశాల దగ్గర ఒక్కొక్క బిసి నాయకులు పుస్తకాలను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ బీసీ నాయకులు కె.లక్ష్మణ్ గౌడ్, రాష్ట్ర మేదరి సంఘం రాష్ట్ర బాధ్యులు కందూరి వెంకట్రాముడు, జిల్లా మాజీ విద్యా శాఖాధికారి డాక్టర్ ఎస్. విజయ్ కుమార్, జిల్లా పతంజలి యోగ సమితి జిల్లా అధ్యక్షులు ఎల్. గంగాధర్, బీసీ మేధావుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి. పాండురంగం, ఎన్. ప్రభాకర్, బిసిటిఎ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణుడు, బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డా. భీంపల్లి శ్రీకాంత్, ఉపాధ్యక్షులు అశ్విని చంద్రశేఖర్, కొప్పోలు యాదయ్య, ప్రైవేటు జూనియర్ కాలేజీ మేనేజ్‌మెంట్ ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సురగౌని రమేష్ గౌడ్, విశ్రాంత సి.సి. చంద్రమౌళి, పాలమూరు యువకవుల వేదిక జిల్లా అధ్యక్షులు బోల యాదయ్య, ప్రముఖ బీసీ నాయకులు మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here